ఎస్ఐ పోస్టులను పెంచాలి
- ఎస్కేయూ విద్యార్థుల రాస్తారోకో
ఎస్కేయూ : రాయలసీమ జోన్‌కు సంబంధించి ఎస్.ఐ ఉద్యోగాలను పెంచాలని ఎస్కేయూ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యార్థులు బుధవారం జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. నిధులు, సాగునీరు, తాగునీటి కేటాయింపుల్లో సీమకు వివక్ష చూపిస్తున్న విధంగానే ఉద్యోగాల భర్తీలోనూ కనబరుస్తున్నారని విమర్శించారు. అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీజోన్‌గా మార్చాలని డిమాండ్ చేశారు.
అమరావతి ప్రాంతంలో 300 ఎస్ఐ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో అందరూ పోటీ పడే విధంగా ఫ్రీజోన్‌గా మార్చాలన్నారు. ఎస్ఐ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లో వయో పరిమితి పెంచాలన్నారు. ఎన్ఎస్యూఐ నాయకులు పులిరాజు, ఏఐఎస్ఎఫ్ నాయకులు రామాంజినేయులు , బీసీ విద్యార్థి సంఘం నాయకులు జయపాల్ యాదవ్, అక్కులప్ప, ఎస్ఎఫ్ఐ ముస్తఫా తదితరులు మద్దతు తెలిపారు.