Independence fighters
-
ఈ యోధుడి త్యాగానికి విలువేది
పశ్చిమగోదావరి,దెందులూరు: స్వాతంత్య్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన వీరులు వారు. మన భవిష్యత్తు కోసం అవిశ్రాంతంగా పోరాడిన సమర యోధులు. ఈ రోజున వారి త్యాగానికి మాత్రం విలువ శూన్యం. అందుకు ఉదాహరణే దెందులూరు నియోజకవర్గం రామారావుగూడెంకు చెందిన గాంధేయ వాది, శతాధిక వృద్ధుడు నేతల పోతురాజు. స్వాతంత్య్ర సమరయోధులు, సీనియర్ సిటిజన్లకు అన్ని రాయితీలు, ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్న టీడీపీ ప్రభుత్వం మాత్రం ఆయనను నిర్లక్ష్యం చేసింది. 103 ఏళ్ల వయసులోను పెన్షన్ కోసం ఎన్నో సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా రెండు నెలల నుంచి మాత్రమే ఇస్తున్నారు. స్వాతంత్య్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన తనకు సమరయోధులకు ఇచ్చే సాయాన్ని అందించాలని పోతురాజు కోరుతున్నారు. నేతల సహదేవుడు, శేషమ్మల కుమారుడైన పోతురాజుకు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఆసక్తి. యువకుడిగా ఉన్నప్పుడు కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెళ్ళ నాగిరెడ్డి, చింతలపాటి మూర్తిరాజులతో కలిసి పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు చాటపర్రు గ్రామంలో రూపాయి నాణేలతో కూడిన సంచిని చందాగా ఇచ్చి తన దేశభక్తిని చాటుకున్నారు. 1940లో సర్వోదయ సమ్మేళనంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం వరకూ స్వాతంత్య్ర సమరయోధులు కందికట్ల నాగభూషణం, నర్రా మృత్యుంజయరావు, చింతలపాటి మూర్తిరాజు తదితరులతో కలిసి పాదయాత్ర చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలోను చురుగ్గా పాల్గొన్నారు. స్వాతంత్య్ర అనంతరం ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం, ఇతర కీలక ఉద్యమాల్లోను పాలుపంచుకున్నారు. అప్పటి ప్రతిపక్ష నేత తరిమెళ్ళ నాగిరెడ్డికి రూ. 200లు ఇవ్వడంతో పాటు, ముఖ్యమంత్రి సంజీవరెడ్డికి రూ.1,116 తన వంతు సాయంగా అందించారు. జవహర్లాల్ నెహ్రూ, పుచ్చలపల్లి సుందరయ్యను అమితంగా అభిమానిస్తానని పోతురాజు తెలిపారు. పూర్తి శాకాహారైన పోతురాజుకు వార్తాపత్రికల పఠనం, రామకోటి రాయడం, భగవద్గీత చదవటం, తన దగ్గరకు వచ్చిన వారికి ఆనాటి ఉద్యమాలపై వివరించటం దినచర్య. ఈ వయసులోను ఎంతో చురుగ్గా ఉండే ఆయన కర్ర సాయం లేకుండా నడవగలరు. అనేక సార్లు పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి వైద్యం సాయం అందలేదు. మూడేళ్ళ క్రితం ఆయన భార్య మృతి చెందారు. గత రెండు నెలల నుంచి మాత్రమే పింఛన్ ఇస్తున్నారు. తాను చేసిన సేవలకు గాను అప్పటి ప్రభుత్వాలు గుర్తింపు సర్టిఫికెట్లు ఇచ్చాయని, ప్రస్తుతం అవి కనిపించడం లేదని, ఎలాగైనా తనను ఆదుకోవాలని కోరుతున్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చే అన్ని రాయితీలను తనకు వర్తింపచేయాలని పోతురాజు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రపతికి వివరిస్తా.. పలు ఉద్యమాల్లో విశేష సేవలందించిన నేతల పోతురాజు మా నియోజకవర్గంలో ఉండడం గర్వకారణం. స్వాతంత్య్ర సమరయోధుడికి దక్కే అన్ని రాయితీలు ప్రభుత్వం మానవతాదృక్పథంతో అందించేలా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తా.– కొఠారు అబ్బయ్య చౌదరి,దెందులూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కన్వీనర్. -
ఆర్థిక శాస్త్రానికి అడుగుజాడ
‘సమానత్వాన్ని సాధించడం... మానవీకరించడం... ఆధ్యాత్మికతను అద్దడం..’ ఈ మూడూ భారతదేశం సాధించవలసిన లక్ష్యాలుగా భావిస్తున్నానని చెప్పారు, మహదేవ గోవింద రానడే. భారతదేశాన్ని వేధిస్తున్న దారిద్య్రమనే మహా రుగ్మతకి పరమౌషధం పరిశ్రమల స్థాపనేనంటూ రానడే (జనవరి 18,1842–జనవరి 16,1901) చెప్పిన మాట దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన ది. ఆ మాట ఆయన చెప్పినది 19వ శతాబ్దంలో. రానడేను గురువుగా భావించిన తొలినాటి స్వాతంత్య్ర సమరయోధులూ, అనంతర కాలాలలో ఆయన రచనలతో, ఆలోచనలతో ప్రేరణ పొందినవారూ ఆయనను ‘భారతీయ ఆర్థికశాస్త్ర పితామహుడు’గా సంభావిస్తారు. 1912లో ఇక్కడకొచ్చిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ ఆచార్యుడు లీజ్ స్మిత్ అయితే, రానడేను భారతదేశంలో పుట్టిన అత్యంత ప్రతిభాశాలురైన చింతనాపరులలో ఒకరని కీర్తించారు. నిస్సందేహంగా రానడే ఆలోచనా ధార ఒక అద్భుతం. ఇప్పటికీ ప్రపంచాన్ని శాసించడానికి పోటీ పడుతున్న ఆర్థికశాస్త్ర చింతనాధోరణుల జాడలు చాలా వరకు రానడే ఆలోచనలలో బీజప్రాయంగా కనిపిస్తాయి. ఆయన బ్రిటన్ను అభిమానించేవారు. కానీ వారి స్వేచ్ఛావాణిజ్య వాదాన్ని పూర్తిగా నిరాకరించేవారు. అలాంటి వాదాలు దేశాలను శాశ్వతంగా వెనుకబాటుతనంలో మునిగిపోయేటట్టు చేస్తాయని హెచ్చరించారు కూడా. భారత ఆర్థిక విధానానికి గతమే పునాదిగా ఉండాలని చెప్పారాయన. అదే సమయంలో వ్యవసాయానికి విశేష ప్రాధాన్యం సరికాదన్నారు. దారిద్య్రాన్ని నిర్మూలించాలంటే పరిశ్రమల స్థాపన ఒక్కటే పరిష్కారమని సిద్ధాంతీకరించారు. భారతదేశ పరిస్థితులను వ్యవసాయానికి విశేష ప్రాధాన్యాన్ని నిరాకరించడం అసంబద్ధంగానే అనిపిస్తుంది. తను అలాంటి నిర్ణయానికి ఎందుకు రావలసి వచ్చిందో ఆయన వివరించారు. ఆర్థికశాస్త్ర అధ్యాపకునిగా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను అధ్యయనం చేసిన తరువాతనే ఆయన భారతీయ సేద్యం గురించి ఆలాంటి అభిప్రాయానికి వచ్చారు. 19వ శతాబ్దం మధ్య నుంచి, 20వ శతాబ్దం వరకు మన చరిత్రలో దర్శనమిచ్చే ఆధునిక దృష్టి కలిగిన మహోన్నత ప్రతిభావంతులలో, బహుముఖ ప్రజ్ఞశాలురు అని చెప్పడానికి నమూనాలుగా కనిపించేవారిలో ఒకరు– ఎంజీ రానడే. ఆయన మహారాష్ట్రలోని నిపహాడ్లో జన్మించారు. బొంబాయిలోని చరిత్రాత్మక ఎల్ఫిన్‌స్టోన్ కళాశాలలో ఆర్థికశాస్త్ర అధ్యాపకునిగా రానడే జీవితం ఆరంభమైంది. తరువాత బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి పదవిని అలంకరించారు. బ్రిటిష్ ప్రభుత్వంలో ఆయన ఫైనాన్స్ కమిటీ సభ్యుడు. జీవితం మొత్తం అరవయ్యేళ్లు. కానీ సంఘ సంస్కరణకి, విద్యా రంగానికి, చరిత్ర రచనకి, భారత జాతీయ కాంగ్రెస్ తొలినాటి ఉద్యమానికి కూడా రానడే విశేషమైన సేవలు అందించారు. ఆర్థికశాస్త్ర అధ్యయనాన్ని ఒక ప్రత్యేక శాఖగా గుర్తించేటట్టు చేయడంలో రానడే నిర్వహించిన పాత్ర విశిష్టమైనది. భారత ఆర్థిక వ్యవస్థ, సమాజం రెండూ ఏకకాలంలో పురోగతి సాధించడానికి అనువైన ఒక ఆర్థిక తాత్వికత గురించి ఆయన తపించారు. జాతీయ సమస్యల నేపథ్యంలోనే ఆర్థిక శాస్త్ర అధ్యయనం జరగాలని రానడే భావించేవారు. ఆర్థికశాస్త్ర అధ్యయనాన్ని వాస్తవానికి మరింత దగ్గరగా తీసుకుపోవడానికీ, మరింత అర్థవంతం చేయడానికీ ఆయన ఈ సూచన చేశారు. రానడే దృష్టిలో ఆర్థికశాస్త్రమంటే, ఒక సాధారణ శాస్త్రం కాదు. ఒక దేశ సామాజిక, చారిత్రక సందర్భాలను పునాదిగా చేసుకుని ఆవిర్భవించే శాస్త్రమది. భారతీయులు భౌతిక సంపదను పెంచుకోవడమనే ఒకే ఒక్క లక్ష్యంతో ప్రభావితులైనవారు కాదనీ, ఇతర వాస్తవికతలు కూడా అందులో ఉన్నాయనీ అంటారాయన. భారతీయ సమాజాన్ని ప్రధానంగా మతం నడుపుతుంది. ఆపై కులం కీలకంగా ఉంటుంది. వీటిని దాటి భారతీయుడు తన ఒక్కడి సొంతానికి భౌతిక సంపదను పెంచుకునే లక్షణాన్ని ఏర్పరచుకోలేడని రానడే చెప్పారు. ఇక్కడి శ్రమశక్తి, పెట్టుబడి చైతన్యం కలిగినవి కాదని అన్నారు. వేతనాలను కూడా కులం, హోదా శాసిస్తాయని చెప్పారు. రానడే బయటపెట్టిన ఇంకొక అంశం విస్తుగొలుపుతుంది. ఇక్కడ పోటీతత్వం బలహీనమైనదనీ, సంప్రదాయాల కారణంగా ఆ పోటీశక్తులు తమకు తామై సంకెళ్లు బిగించుకున్నాయనీ ఆయన వాదన. పరిశ్రమ స్థాపన జరగాలి. కానీ ఆ పనిలో ప్రభుత్వమే కీలక పాత్ర వహించాలి. రాయితీలు ఇచ్చి ఉత్పాదన సామర్థ్యాన్ని విస్తరించాలి. ఉన్నత విద్య, సాంకేతిక విద్యా సంస్థల ఏర్పాటు కూడా ప్రభుత్వపరంగానే జరగాలి. స్వేచ్ఛా వాణిజ్య వాదం, పురోగతి– ఇవి ఒక ఒరలో ఇమడలేని విధానాలుగానే ఆయన చూశారు. బ్రిటన్‌లో పుట్టిన స్వేచ్ఛా వాణిజ్యవాదంతో భారతదేశం వంటి దేశం ఎప్పటికీ వెనుకబడే ఉంటుందని ఆయన అభిప్రాయం. అదే పురోగతి అనే దృక్పథం ఉంటే? అడ్డంకుల నుంచి స్వాతంత్య్రానికి, బోళాతనం నుంచి విశ్వాసం వైపు, అసంఘటితత్వం నుంచి సంఘటితత్వానికి, మతావేశం నుంచి సహనం వైపు, గుడ్డి నమ్మకం నుంచి ఆత్మగౌరవం వైపు ప్రస్థానం సాగుతుందని ఆయన భావించారు. స్వేచ్ఛా వాణిజ్యమనే విధానమూ సరికాదన్నారాయన. ఎగుమతులు, దిగుమతుల మీద అదుపు లేకుంటే, మొదట నష్టపోయేది దేశీయ పరిశ్రమలేనని చెప్పారు. దాదాభాయ్ నౌరోజీ డ్రెయిన్ థియరీని ప్రపంచంలో చాలామంది విశ్వసించినప్పటికీ రానడే మాత్రం వ్యతిరేకించారు. ‘పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా’ అనే పుస్తకంలో నౌరోజీ ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. భారతదేశ వనరులను దోచుకుపోయి, ఇంగ్లండ్ పరిశ్రమలలో వస్తువులను ఉత్పత్తి చేసి, తిరిగి భారతదేశ మార్కెట్లోనే విక్రయించి మళ్లీ లాభాలను బ్రిటన్‌కే తరలించడాన్ని డ్రెయిన్ థియరీ అంటారు. భారతదేశ వెనుకబాటుతనం ఒక్క ఇంగ్లిష్ జాతితోనే సంప్రాప్తించింది కాదనీ, వెనుకబాటుతనం లోతులు చరిత్రలోనే ఉన్నాయని రానడే చెప్పారు. బ్రిటిష్ జాతీయులు రాక పూర్వం కూడా ఇక్కడ పేదరికం ఉందని, ఆంగ్లేయులు వచ్చిన తరువాత అది మరింత అధికమైందన్నదే నిజమని అన్నారాయన. దేశంలో దారిద్య్రానికి మూలం వ్యవసాయానికి విశేష ప్రాధాన్యం ఇవ్వడం, పరిశ్రమలు లేకపోవడం, రుణ సదుపాయం లేకపోవడం, లోపభూయిష్టమైన భూ విధానం కారణాలని రానడే విశ్లేషించారు. రుణ విధానాన్ని పునర్వ్యవస్థీకరించమని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఇది మాత్రం ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకుంది. భూతనఖా బ్యాంకుల ఏర్పాటు ఆ సలహా ఫలితమే. అసలు సేద్యానికి, విశేష ప్రాధాన్యానికి కారణం ప్రభుత్వ విధానమని, ఇంగ్లండ్‌కు ఎగుమతి చేయడానికి అవసరమైన పంటలనే బ్రిటిష్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఆయన చెప్పారు. భారతదేశంలో పరిశ్రమలు వెనుకబడిపోవడానికి కారణం– విదేశీ పరిశ్రమలతో పోటీకి నిలబడలేకపోవడమేనని చెప్పారాయన. దేశీయమైన వనరులను దేశంలోని కర్మాగారాలలో వస్తువుల ఉత్పత్తికి వినియోగించాలని రానడే నినదించారు. భారతదేశంలో పరిశ్రమల స్థాపనకు చొరవ చూపించవలసిందనీ, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించవలసిందనీ ఆయన బ్రిటిష్ ఇండియా ప్రభుత్వాన్ని పదే పదే కోరేవారు. అందుకే ఆయనను ఆధునిక ఆర్థిక శాస్త్ర పిత అని పిలిచేవారు. మొత్తంగా ఆయన సిద్ధాంతంలో నేటికీ ఉపయోగపడే ఒక అంశం ఉంది. వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్యం– ఈ మూడింటిని కూడా ప్రణాళికాబద్ధంగా సమ ప్రాధాన్యంతో అభివృద్ధి చేయాలని రానడే సిద్ధాంతీకరించారు. అదే సమయంలో వ్యవసాయం మీద ఆధారపడేవారి సంఖ్యను తగ్గించకపోతే ఆ రంగాన్ని అభివృద్ధి చేయడం కూడా కష్టమేనని చెప్పారు. ఆధునిక కాలంలో కనిపిస్తున్న వెనుకబాటుతనం, నిరుద్యోగం తొలగిపోవాలంటే పరిశ్రమల స్థాపనే పరిష్కారమని సూచించారాయన. గ్రామసీమలు యథాతథంగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటాయన్న రాజా రామ్మోహన్రాయ్ అభిప్రాయాలను ఇక్కడే రానడే గట్టిగా వ్యతిరేకించారు. ఆడమ్ స్మిత్, డేవిడ్ రికార్డో, మాల్థస్, జేమ్స్ మిల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్తల సిద్ధాంతాలను కూడా రానడే నిరాకరించారు. అవన్నీ స్థిరపడిన వ్యవస్థలకే పరిమితమని ఆయన అభిప్రాయం. జర్మన్ ఆర్థికవేత్త ఫ్రెడ్రిక్ లిస్ట్ సిద్ధాంతాలతో రానడే ప్రభావితులయ్యారు. వ్లాదిమిర్ లెనిన్ కూడా లిస్ట్ సిద్ధాంతాలకు ప్రభావితుడయ్యారని చెబుతారు. లిస్ట్ సిద్ధాంతాలను భారతీయ సమాజానికి అన్వయించడానికి రానడే కృషి చేశారు. ఆర్థిక విధానాలకు సంబంధించి లెనిన్ అంటే నెహ్రూకు గురి. అయితే లెనిన్, రానడే ఇద్దరూ లిస్ట్ సిద్ధాంతాలతో ప్రభావితులయ్యారన్న సంగతి నెహ్రూకు తెలుసో లేదో తెలియదు. సుభాస్ చంద్రబోస్ జర్మనీలో ఉండగా లిస్ట్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. స్వతంత్ర భారతదేశంలో పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆయన ఊహకు మూలం లిస్ట్ చూపిన ప్రభావం కారణం కావచ్చు. గోపాలకృష్ణ గోఖలే రానడే ప్రత్యక్ష శిష్యుడు. గోఖలే శిష్యుడు గాంధీజీ. అందుకే రానడే ఆలోచనల ప్రభావం గాంధీజీ మీద కూడా పరోక్షంగా కనిపిస్తుంది. పరిశ్రమల స్థాపన మీద, సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతీయులకు పరిచయం చేయడం గురించి స్పష్టమైన ఆలోచనలు ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూణెలోనే చదువుకున్నారు. ఇలాంటి ఆలోచనలు రానడే రచనల నుంచే విశ్వేశ్వరయ్య స్వీకరించి ఉంటారన్న వాదనలు కూడా ఉన్నాయి. రానడే ఆలోచనలు ఆర్థిక పురోగతి వరకే పరిమితం కాలేదు. అసలు ఆర్థిక పురోగతి, ఆధ్యాత్మిక కోణంతో ఉండాలన్నదే ఆయన వాదన. సంఘ సంస్కరణ ఆయన జీవితంలో కనిపించే మరొక గొప్ప కోణం. నిజానికి సంఘ సంస్కర్తగానే ఆయన ఎక్కువ మందికి గుర్తు. వక్తృత్వతేజక్ సమాజ్, పూణె సార్వజనిక్ సభ, ప్రార్థనా సమాజ్, సోషల్ కాన్ఫరెన్స్ వంటి సంస్థలలో ఆయన అవిశ్రాంతంగా పనిచేశారు. బాల్య వివాహాలను అడ్డుకోవడం, వితంతు పునర్వివాహాలకు ప్రోత్సాహం ఇవ్వడం, బాలికలకు చదువు వంటి వాటి కోసం ఆ సమాజాలు పనిచేశాయి. 1861లో ఆయన ప్రారంభించిన విడో మ్యారేజ్ అసోసియేషన్ ఇందుకు సంబంధించినదే. ఇక భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యులలో రానడే ఒకరు. ‘రైజ్ ఆఫ్ మరాఠా పవర్’ ఆయన రాసిన చరిత్ర గ్రంథం. బ్రిటిష్ ఇండియాను ఉదార విధానాలకు పరిచయం చేసిన మహనీయుడు ఈ మహదేవుడు. ∙డా. గోపరాజు నారాయణరావు -
‘రిపబ్లిక్’వేడుకలకు మల్లోజుల మధురమ్మ
పెద్దపల్లి: మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ, వేణుగోపాల్ తల్లి, మల్లోజుల మధురమ్మకు జిల్లా కేంద్రంలో నిర్వహించే రిపబ్లిక్‌డే ఉత్సవాల ఆçహ్వానం అందింది. జిల్లా కలెక్టర్ తరఫున ఆహ్వానాన్ని జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యుల సంఘం అధ్యక్షుడు బాలసాని వెంకటేశంగౌడ్ అందించారు. స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబ సభ్యులు, ప్రముఖులు వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానపత్రాలు కలెక్టర్ పక్షాన పలువురికి అందించారు. మధురమ్మ భర్త మ ల్లోజుల వెంకటయ్య స్వాతంత్ర సమర యోధుడు కావటం వల్లే ఆహ్వానం అందినట్లు భావిస్తున్నారు. -
‘సీమ’ పోరుబిడ్డలు పాలెగాళ్లు!
బ్రిటిష్ సామ్రాజ్యం మొక్కదశలో ఉన్న ప్పుడే తుంచేయాలని బ్రిటిష్ వారితో రాయ లసీమ పాలెగాళ్లు క్రీ.శ.1801 నుంచి 1805 వరకూ ఐదేళ్లపాటు గెరిల్లా పోరాటాలు చేసి ఉరికంబాలు ఎక్కి అమరులయ్యారు. బ్రిటిష్ సైనిక చట్టాన్ని భారతదేశంలో మొట్టమొద టిగా ఎదిరించిన ఘనత వారిదే. రాయల సీమ పాలెగాళ్లలో కొందరిని ఉరితీయగా కొం దరిని ద్వీపాంతరం పంపగా మరికొందరిని దేశ బహిష్కరణ చేశారు. ఎవరీ పాలెగాళ్లు? రాయలసీమ పాలెగా ళ్లను విజయనగర ప్రభువులు క్రీ.శ.15వ శతా బ్దిలో ప్రజలకు రక్షణ కల్పించేందుకు, శాంతి భద్రతలను కాపాడేందుకు నియమించారు. బ్రిటిష్ వాళ్లను ఎదిరించే నాటికి పాలెగాళ్లు 350 ఏళ్లుగా కొండ మార్గాల్లో దుర్గాలు, కోట లు, బురుజులు నిర్మించుకుని ప్రజల రక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండేవారు. విజయ నగర రాజ్య పతనానంతరం పాలెగాళ్ల పాలన ప్రారంభమైంది. క్రీ.శ.1800 నాటికి సీమలో 80 మంది పాళెగాళ్లు, 30 వేల మంది సైని కులు ఉండేవారు. పాలెగాళ్లను తమిళంలో పాలైయాక్కరర్ అని, తెలుగులో పాలెగాడని, కన్నడంలో పాళె యగరరు అని అంటారు. వీళ్లు క్రీ.శ.17, 18వ శతాబ్దాల్లో సాయుధులై పాలన సాగించారు. క్రీ.శ.1600 నుండి క్రీ.శ.1800 వరకు రాయల సీమ ప్రాంతంలో బలమైన రాజుల పాలన లేదు. పాళెగాళ్ల పాలనే రాయలసీమలో ఉం డేది. సీమలో దండయాత్రలు జరిగినప్పుడు గండికోట, సిద్ధవటం కోట పరాయి రాజుల వశమైనప్పటికీ బురుజులు మాత్రం పాళెగాళ్ల ఆధీనంలోనే ఉండేవి. విజయనగర రాజుల కాలంలోనే క్రీ.శ. 1336-1680) పాళెగాళ్ల వ్యవస్థ ఏర్పడింది. రాయలసీమలో పాళెగాళ్లు విజయనగర రాజు లకు పన్నులు వసూలు చేయడంలోనూ, అం తర్గత రక్షణ కల్పించడంలోనూ, రాజులకు అవసరమైన సైన్యాన్ని సమీకరించడంలోనూ సహాయపడేవారు. క్రీ.శ.1565లో జరిగిన తళ్లి కోట యుద్ధంలో సుల్తానుల చేతులలో పరాజ యం పొందిన విజయనగర రాజులు తమ రాజధానిని బళ్లారి జిల్లాలోని హంపీ నుంచి అనంతపురం జిల్లాలోని పెనుగొండకు మార్చారు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సలహాతో బీజాపూర్, గోల్కొండ నవాబులు ఉమ్మడిగా 1650లో పెనుగొండ మీద దాడి చేసి విజయనగర రాజ్యాన్ని ధ్వంసం చేశారు. ఈ యుద్ధాలన్నింటికీ యుద్ధ భూమి సీమే. క్రీ.శ.1572లో పెనుగొండ రాజధానిగా విజయనగర సామ్రాజ్యం ఏర్పడినప్పటి నుం చి 1800 సంవత్సరంలో బ్రిటిష్ వారికి రాయ లసీమ ప్రాంతం దారాదత్తమయ్యే దాకా ఇక్కడ 30 యుద్ధాలు జరిగాయి. ఈ 230 ఏళ్లలో ముస్లిం సైన్యాల ఘోరకృత్యాల వల్ల సీమ ప్రజల ధన, మాన, ప్రాణ నష్టం జరిగి ఈ ప్రాంతం సర్వనాశనమైంది. బ్రిటిష్‌కు వ్యతిరేకంగా పోరాడినందు వలన పాలెగాళ్లను బ్రిటిష్ సర్కార్ బంది పోట్లు అంటూ నిందించింది. నిజాం నవాబు బ్రిటిష్ గవర్నర్ జనరల్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన ‘సైన్య సహకార’ పద్ధతికి తలొగ్గి సంధి షర తుల్లో భాగంగా సీమను 1800లో ఆంగ్లేయు లకు దారాదత్తం చేసిన ఫలితంగా సీమ ఎర్ర బడింది. 80 మంది పాలెగాళ్లు 33,000 మంది సైనికులతో బ్రిటిష్ వారిని ముప్పు తిప్పలు పెట్టారు. క్రీ.శ.1801 నుంచి 1806 వరకు చిత్తూరు పాలెగాళ్లు బ్రిటిష్ వారికి ఎదురొడ్డి నిలబడ్డారు. ఈ పోరాటాలలో యాదరకొండ పాలెగారు రామప్ప నాయు డిని కల్లియబండ అడవులలో క్రీ.శ.1804లో బ్రిటిష్‌వారు ఉరి తీశారు. ఆ తరువాత వరుసగా బంగారు పాళెం పాలెగారు కుమారున్ని, చారగళ్లు పాలె గాళ్లను ఉరితీశారు. మిగిలిన పాళెంలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 1760లో హైదరాలీ కాలం నుంచి బ్రిటిష్ వారి వరకు 40 ఏళ్లపాటు పాలెగాళ్ల అణచివేతతో రాయలసీమ ఎరుపెక్కింది. ఆ నాడు బ్రిటిష్‌వారు పాలెగాళ్లను బందిపోట్లని ముద్రవేస్తే ఈ నాటి సీమ నాయకులను హత్యా రాజకీయాలు చేసేవాళ్లని నిందిస్తున్నా రు. చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకు పన్నిన పన్నుగడ ఇది. క్రీ.శ.1500 నుంచి 1800 వరకు సీమను రక్షించేదెవరు? పాలె గాళ్లే! పాలెగాళ్లే ఫ్యాక్షనిస్టులనుకోవడం తప్పు డు అవగాహన. అనుకరణే చరిత్రగా మారి పోతే, మనకు మనమే పరాయివాళ్లుగా మిగిలి పోతాం. శతాబ్దాల బ్రిటిష్ ఆధిపత్యాన్ని జయించగలిగామే కానీ, వారు వదిలివెళ్లిన సాంస్కృతిక, చారిత్రక కాలుష్యపు కాడిని మాత్రం ఆరు దశాబ్దాల అనంతరం కూడా గుడ్డిగా మోస్తూనే ఉన్నాం. అందుకే సీమ అన గానే బాంబులు, కొడవళ్లతో కక్షలూ, కార్ప ణ్యాల కోలాటంగా ప్రవహించే నెత్తురే అని నమ్మించే ప్రయత్నాలు ఈ నాటికీ సాగుతూనే ఉన్నాయి. శతాబ్దాలుగా సాగిన చెరువుల నిర్మాణం ఫలితంగా సీమ పచ్చటి పొలాలు ‘రత్నాలరాశుల’ను పండించిన చరిత్ర మనకు చెప్పరు. బ్రిటిష్ పాలనలో పరాయీకరణకు గురైన పాలెగాళ్లు తమ భూములూ, హక్కుల కోసం సాగించిన పోరులో అగ్రభాగాన నిలిచి, ఉరికొయ్యల ఊయలలూగిన ఉయ్యా లవాడ నరసింహారెడ్డి వంటి వీరులను నేటి చరిత్రకారులు మరచిపోవడం మహానేరం. దానికితోడు నాటి పాలెగాళ్ల సంస్కృతే నేటి ముఠాకక్షలకు మూలమని నిందించడం చారి త్రక ద్రోహం. పిడికెడు బువ్వ, గుక్కెడు నీళ్లు కరువై గుండె ఆగి మరణిస్తున్న కరువు సీమ బక్క రైతుల కన్నీటి గాథకు ‘ముఠా కక్షల’ ముసుగు తొడిగి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే సాధ్యం కాదన్న రీతిలో చరి త్రను వక్రీకరించడం నాయకుల, చరిత్రకారుల దౌర్బల్యం. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని ప్రపంచానికి సగర్వంగా చాటిన శ్రీకృష్ణ దేవ రాయలు తన అద్భుత పాలనతో సిరిసంపద లకు నెలవుగా మార్చిన భూభాగమే నేటి రాయలసీమ. ‘ఆంధ్ర పథం’ అని లిఖించిన అతి పురాతన శిలాశాసనం సీమ నేలలోనే బయటపడింది. 16వ శతాబ్దంలో దక్కన్ పీఠ భూమి నుంచి సుల్తానులు సాగించిన దండ యాత్రలతో కళ తప్పి రాళ్లసీమగా మారిన రాయలసీమలో తొలి స్వాతంత్య్ర పోరాట యోధులు పాలెగాళ్లు! - డా॥ఎనుగొండ నాగరాజనాయుడు విశ్రాంత ప్రధానాచార్యులు