Independent house
-
రూ.55 లక్షలకే 267 గజాల్లో విల్లా!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సొంతిల్లు అదీ ఇండిపెండెంట్ హౌస్, విల్లా అంటే మామూలు విషయం కాదు. కోట్లు వెచ్చించక తప్పదు. కానీ, నగరంలోని అపార్ట్మెంట్ ధరకు ఏకంగా ప్రీమియం విల్లాలను అందిస్తోంది చీడెల్లా హౌజింగ్. ప్రాజెక్ట్ విశేషాలను సంస్థ ఎండీ నాగమణేశ్వర్ గుప్తా ‘సాక్షి రియల్టీ’తో పంచుకున్నారు. ♦ పటాన్చెరు–శంకర్పల్లి Ðð ళ్లే మార్గంలోని బానూరులో 34 ఎకరాల్లో లైఫ్ స్టయిల్ డ్రీమ్ హోమ్స్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. హెచ్ఎండీఏ అనుమతి పొందిన ఈ వెంచర్లో మొత్తం 360 విల్లాలుంటాయి. ఇప్పటికే 220 విల్లాల నిర్మాణం పూర్తయింది కూడా. 180 గజాల్లో 900 చ.అ.ల్లోని విల్లా ధర రూ.40 లక్షలు, 267 గజాల్లో 1,232 చ.అ.ల్లోని విల్లా ధర రూ.55 లక్షలు, 333 గజాల్లో 1,550 చ.అ.ల్లోని విల్లా ధర రూ.65 లక్షలు. ♦ ఈ ప్రాజెక్ట్‌లో 30 వేల చ.అ.ల్లో వాణిజ్య సముదాయాన్ని నిర్మించాం. దీన్ని కార్యాలయాలు, బ్యాంక్, స్కూలు, ఆసుపత్రి వంటి వాటికి కేటాయిస్తాం. 18 వేల చ.అ.ల్లో క్లబ్ హౌస్‌తో పాటూ స్విమ్మింగ్‌పూల్, జిమ్, ఫంక్షన్ హాల్ వంటివి కూడా ఉంటాయి. ఆయా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విల్లాల మధ్యలో ఓపెన్ ప్లాట్లు.. తూర్పు వైపు విల్లాలు, పశ్చిమం వైపు ఓపెన్ ప్లాట్లు ఉండడమే లైఫ్ స్టయిల్ డ్రీమ్ హోమ్స్ ప్రాజెక్ట్ ప్రత్యేకత. ఇందులో 180, 267, 333 గజాల్లో మొత్తం 120 ప్లాట్లుంటాయి. ధర గజానికి రూ.13,500. ఇప్పటికే 70 శాతం అమ్మకాలు పూర్తయ్యాయంటే ప్రాజెక్ట్ నిర్మాణం, స్థానిక అభివృద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ♦ నందిగామలో రాయల్ ప్రైడ్ పేరిట 18 ఎకరాల లే అవుట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో 290 ప్లాట్లుంటాయి. ధర గజానికి రూ.10 వేలు. నర్సాపూర్ రోడ్‌లోని అన్నారంలో 9 ఎకరాల్లో మరో లే అవుట్‌ను ప్రారంభించనున్నాం. హెచ్ఎండీఏ అనుమతి పొందిన ఈ వెంచర్‌ను వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించనున్నాం. ♦ అక్టోబర్ నాటికి 80 ఎకరాల్లో మరో 2–3 వెంచర్లను అభివృద్ధి చేయాలని లకి‡్ష్యంచాం. ఇప్పటివరకు బెంగళూరు హైవేలోని కొత్తూరు, గండిమైసమ్మ ప్రాంతాల్లో 40 ఎకరాల్లో 4 ప్రాజెక్ట్‌లను పూర్తి చేశాం. -
బీ ఇండిపెండెంట్..!
సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు హైదరాబాదీల యత్నం గతేడాదిగా ఇండిపెండెంట్ ఇళ్ల కొనుగోలులో 25% పెరుగుదల శివారు ప్రాంతాల్లో తక్కువ బడ్జెట్ స్వతంత్ర ఇళ్లపై దృష్టి వాణిజ్య, వ్యాపార, ఉపాధి, విద్యా అవకాశాలు పెరగడమే కారణం ప్రాపర్టీ సెర్చ్ ట్రెండ్స్ సర్వేలో వెల్లడి సాక్షి, హైదరాబాద్ అజయ్ ఓ ప్రైవేటు ఉద్యోగి. వేతనం రూ.35 వేలు. ప్రధాన నగరంలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకుంటున్న అతను.. ఇటీవల శివారు ప్రాంతాల్లో సొంతిల్లు కొనుగోలుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే అపార్ట్మెంట్ కంటే.. శివారు ప్రాంతాల్లో రూ.25 నుంచి రూ.28 లక్షల్లో ఇండిపెండెంట్ హౌస్ కొనుగోలుకే అతను మొగ్గు చూపుతున్నాడు. ఇది అజయ్ ఒక్కరి ఆలోచనే కాదు.. ఇటీవలి కాలంలో మధ్యతరగతి వేతనజీవులంతా దాదాపు స్వతంత్ర గృహాల కొనుగోలుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని తాజా అధ్యయనంలో తేలింది. రియాల్టీలో నయా ట్రెండ్.. రణగొణ ధ్వనులు లేని.. స్వచ్ఛమైన గాలి, వెలుతురు ఉండే ఆహ్లాదకర వాతావరణంలో సొంతిల్లు.. అదీ ఇండిపెండెంట్ హౌస్ కొనుగోలుకు గ్రేటర్ వాసులు ఇటీవల ఆసక్తి కనబరుస్తున్నారు. ఇరుకు గదులు.. అపార్ట్మెంట్లలో నివసిస్తున్న వారు సైతం.. శివారు ప్రాంతాల్లో స్వతంత్ర గృహాలైతేనే మేలన్న నిశ్చితాభిప్రాయానికి రావడం నగర రియాల్టీలో నయా ట్రెండ్‌గా మారింది. ఐటీ, బీపీవో, కేపీవో, ప్రైవేట్, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న వేతనజీవులు వారి స్తోమత, స్థాయిని బట్టి ఇంటి కొనుగోలుకు మక్కువ చూపుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. వీరు ప్రధాన నగరానికి 20–25 కి.మీ. దూరంలో ఉన్న శివారు ప్రాంతాల్లో స్వతంత్ర గృహాల కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఏడాదిగా ఈ రంగంలో 25 శాతం పెరుగుదల నమోదైనట్లు ప్రముఖ రియాల్టీ సైట్ మ్యాజిక్ బ్రిక్స్.. హైదరాబాద్‌లో ఇళ్ల కొనుగోలు విషయంలో కన్జ్యూమర్ సెర్చ్ ట్రెండ్స్‌పై తాజా అధ్యయనంలో తేలింది. మహానగరంలో తాజా పరిస్థితి ఇదీ.. మహానగరం శరవేగంగా విస్తరిస్తుండటం.. శివార్లలో వాణిజ్య, వ్యాపార, ఉపాధి అవకాశాలు పెరగడం, కోర్ సిటీలో ధరలు ఆకాశాన్నంటడంతో వేతనజీవులు, మధ్యతరగతి ప్రజలు శివారు ప్రాంతాల్లో సొంతింటి కొనుగోలు యత్నాలు చేస్తున్నారు. దీంతో హయత్‌నగర్, అత్తాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, నిజాంపేట్ తదితర ప్రాంతాల్లో ఇటీవలికాలంలో స్వతంత్ర గృహాలు(ఇండిపెండెంట్), విల్లాల నిర్మాణం ఊపందుకుంది. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇండిపెండెంట్ ఇళ్ల ప్రాజెక్టులు 200 వరకు ఉన్నట్లు రియాల్టీ వర్గాలు చెపుతున్నాయి. వీటిల్లో సుమారు 25 వేల వరకు స్వతంత్ర గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయని, ప్రధానంగా రూ.25 లక్షల నుంచి రూ.80 లక్షలలోపు ధర పలికే ఇళ్లకు డిమాండ్ 25% పెరిగినట్లు తెలిపాయి. బెంగళూరు కంటే ధరలు తక్కువే.. అభివృద్ధి, ఐటీ రంగంలో బెంగళూరు నగరంతో పోటీపడుతున్న గ్రేటర్ సిటీలో సొంతింటి ధరలు అక్క డితో పోలిస్తే 20% మేర తక్కువే. ఉదాహరణకు నగరంలో ప్రాంతాన్ని బట్టి, కల్పించే మౌలిక వసతులను బట్టి ప్రతి చదరపు అడుగు నిర్మాణ వైశాల్యానికి రూ.3 వేల నుంచి రూ.4 వేల ధర పలుకుతుండగా.. బెంగళూరులో రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు ధర పలుకుతోందని బిల్డర్లు చెబుతున్నారు. దీంతో వేతనజీవులతోపాటు ఎన్ఆర్ఐలు నగరంలో గృహాలు, విల్లాల కొనుగోలుకు ప్రాధాన్యమిస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు. గృహరుణాలపై వడ్డీరేట్లు తగ్గించడం వల్ల కూడా వినియోగదారులు సొంతింటి ప్రయత్నాలు చేస్తున్నారని చెపుతున్నారు. ట్రెండ్ ఇదీ.. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు గత ఏడాదిగా వివిధ సైట్లలో సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య ఇలా ఉంది... ఇంటి ధర జూలై 2016 జూలై 2017 రూ.25–80 లక్షలు 17,500 21,900 రూ.80 లక్షలు –రూ.1.50 కోట్లు 5,700 7,200 జీవించేందుకు అనువైన నగరం.. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే జీవించేందుకు హైద రాబాద్ అత్యంత అనువైన నగరం. శివారు ప్రాంతాల్లో విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరిగాయి. తాగునీరు, రహదారుల వంటి మౌలిక సదుపాయాలు పెరగడంతో రియాల్టీ రంగం వేగంగా పురోగమిస్తోంది. ఇదే క్రమంలో సొంతింటి కల నిజం చేసుకునే వారికి తమ బడ్జెట్లోనే ఇళ్లు లభిస్తుండడంతో ఈ ట్రెండ్ పెరిగింది. – రాంరెడ్డి, క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు -
రూ.9 లక్షలకే ఇండిపెండెంట్ హౌస్!
♦ ఆంబియెన్స్ ప్రాజెక్ట్‌లో.. 147 గజాల్లో నిర్మాణం ♦ 200 ఎకరాల్లో గ్రీన్ ఎకర్స్ ఫాం ల్యాండ్ కూడా.. సాక్షి, హైదరాబాద్: సామాన్యుల సొంతింటి కలను సాకారం చేయడమే మా లక్ష్యమంటోంది స్పేస్ విజన్. ఇందు కోసం షాద్‌నగర్‌లో అతిపెద్ద వెంచర్, పోలేపల్లి సెజ్‌కు దగ్గర్లో ఫాం ల్యాండ్ ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టింది. వివరాలను స్పేస్ విజన్ ఎడిఫైస్ ప్రై.లి. సీఎండీ టీవీ నర్సింహా రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ⇔ షాద్‌నగర్‌లోని రామేశ్వరం దేవాలయానికి కూతవేటు దూరంలో ఆంబియెన్స్ పేరిట మెగా టౌన్‌షిప్‌ను నిర్మిస్తున్నాం. తొలి దశలో 300 ఎకరాలను అభివృద్ధి చేస్తున్నాం. 147-1,000 గజాల్లో ఓపెన్ ప్లాట్లున్నాయి. గజం ధర రూ.2,250. రుణ సదుపాయం, సులభ వాయిదాల్లోనూ ప్లాట్లను తీసుకోవచ్చు. ⇔ ఈ ప్రాజెక్ట్‌లో ఇండిపెండెంట్ హౌస్‌లను కూడా నిర్మిస్తాం. 147 గజాల్లో వచ్చే ఒక్కో ఇండిపెండెంట్ హౌస్ ధర రూ.9 లక్షలు. 10 ఎకరాల్లో క్లబ్ హౌజ్ కూడా ఉంటుంది. గోల్ఫ్ కోర్ట్‌తో పాటు స్మిమ్మింగ్ పూల్, స్పా, మెడిటేషన్ సెంటర్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, జాగింగ్, వాకింగ్ ట్రాక్స్ వంటి ఆధునిక వసతులెన్నో ఉంటాయి. ⇔ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పెట్టుబడులు పెట్టేవారి కోసం గ్రీన్ ఎకర్స్ పేరిట మరో ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. పోలేపల్లి ఫార్మా సెజ్‌కు దగ్గర్లో 200 ఎకరాల్లో ఫాంల్యాండ్ను చేస్తున్నాం. గ్రీన్ ఎకర్స్ ప్రత్యేకత ఏంటంటే.. ఎకరం విస్తీర్ణంలో 300 మలబార్, ఐదు రకాల 25 సేంద్రియ పండ్ల మొక్కలను పెంచుతాం. వీటి పర్యవేక్షణ, పెంపకం బాధ్యత కంపెనీదే. 10 గుంటల నుంచి ఎకరం వరకు ఫాం ల్యాండ్లుంటాయి. ధర రూ.4.90 నుంచి 18 లక్షల వరకున్నాయి. ⇔ వీకెండ్స్‌లో ఫాంహౌస్‌లో కొనుగోలుదారులు కుటుంబంతో కలసి ఆనందంగా గడిపేందుకు వీలుగా 5 ఎకరాల్లో క్లబ్ హౌస్, గోశాల వంటి వసతులను కల్పించాం. -
సొంతింటికి దగ్గరి దారి!
సొంతిల్లు.. అదీ భాగ్యనగరంలో! ఎంతలేదన్నా పాతిక లక్షలు పెడితే గానీ దొరకని పరిస్థితి. కానీ, రూ.17 లక్షలకే ఇండిపెండెంట్ హౌజ్.. అది కూడా స్థిరాస్తి రంగంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న షాద్‌నగర్ పట్టణంలో!! షాద్‌నగర్ అభివృద్ధికి బీజం పడింది 2002లోనే. సాఫ్ట్వేర్ దిగ్గజం బిల్ గేట్స్ సందర్శించిన నాటి నుంచే ఈ పట్టణం పేరు ప్రపంచ స్థాయిలో మార్మోగిందనేది నిపుణుల మాట. తాజాగా తెలంగాణ ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానంతో అంతర్జాతీయ కంపెనీల దృష్టి ఇక్కడే పడింది. సాక్షి, హైదరాబాద్: షాద్‌నగర్ సబ్ రిజిస్ట్రేషన్ పరిధిలో ఫలూక్నగర్, కొత్తూరు, కొందుర్గ్, కేశంపేట ప్రాంతాలొస్తాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారిని కలిపే 44వ నంబర్ జాతీయ రహదారి షాద్‌నగర్ మీదుగానే వెళుతుంది. హైదరాబాద్ నుంచి 48 కి.మీ. దూరం, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 22 కి.మీ. దూరంలో ఉందీ పట్టణం. రైలు, బస్సు వంటి రవాణా సౌకర్యాలకూ కొదవేలేదు. మౌలిక వసతులు మెరుగ్గా ఉండటం.. స్థిరాస్తి ధరలూ అందుబాటులోనే ఉండటంతో కొనుగోలు, పెట్టుబడిదారులు ఇద్దరి దృష్టిని ఆకర్షిస్తోంది షాద్‌నగర్. ధరలూ అందుబాటులోనే.. ప్రస్తుతమిక్కడ డీఎల్ఎఫ్, స్పేస్ విజన్, గిరిధారి, సువర్ణ భూమి ఇలా పలు నిర్మాణ సంస్థలు భారీ గేటెడ్ కమ్యూనిటీలు, వెంచర్లను వేశాయి. స్థలం ఎకరం ధర రూ.60-80 లక్షలు చెబుతున్నారు. మెయిన్ రోడ్డు నుంచి కాస్త లోపలికి వెళితే రూ.45-50 లక్షల్లోపూ దొరుకుతున్నాయి. ఇక ఫ్లాట్ల ధరలు చూస్తే.. చ.అ. ధర రూ.2,000 నుంచి ప్రారంభమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్మాణ రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని సారించడంతో ఇప్పుడిక్కడ ధరలకు రెక్కలొచ్చాయి. ఏటా 25-30 శాతం ధరలు పెరిగే అవకాశముందని, అందుకే స్థిరాస్తి కొనుగోలుకు ఇదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి.. షాద్‌నగర్, కొత్తూరు ప్రాంతాలు పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. తెలంగాణ పారిశ్రామిక విధానం తర్వాత సుమారు 13 కంపెనీల నుంచి రూ.900 కోట్ల మేర పెట్టుబడులు ఇక్కడికొచ్చాయి. ♦ గతంలో కేంద్రం ప్రకటించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్టిమెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్ట్‌ను మరింతగా విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీఐఆర్ స్థాపనకు 200 ఎకరాలు చూపిస్తే ప్రాజెక్ట్‌ను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించడంతో ఆ దిశగా పాలమూరు జిల్లా అధికారులు దృష్టి పెట్టారు. జిల్లా మీదుగా జాతీయ రహదారి, రైల్వే లైను, సరిహద్దులో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, షాద్‌నగర్ హెచ్ఎండీఏ పరిధిలో ఉండటం వంటివి జిల్లాకు కలిసొచ్చే అంశాలు. బాలానగర్ నుంచి కొత్తూరు ప్రాంతాల్లో భూములపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. ♦ అమెజాన్ సంస్థ కొత్తూరులో 2.80 లక్షల చ.అ.ల్లో భారీ గిడ్డంగిని ఏర్పాటు చేసింది. ఇక్కడే పీఅండ్‌జీ కంపెనీ విస్తరణ ప్రణాళికలో భాగంగా మూడేళ్లలో సుమారు రూ.3 వేల కోట్లతో అతిపెద్ద సబ్బుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇక్కడే జాన్సన్ అండ్ జాన్సన్ మరో రూ.4 వేల కోట్లతో 40 ఎకరాల్లో ప్లాంటును విస్తరించనుంది. ♦ వేములలో కోజెంట్ సంస్థ సుమారు రూ.300 కోట్లతో గ్లాస్ బాటిళ్ల తయారీ యూనిట్‌ను విస్తరించనుంది. తెలంగాణలో లభించే వనరుల ఆధారంగా ఎనిమిది జిల్లాల్లో 10 పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జడ్చర్లలో 100 ఎకరాల్లో వస్త్రాల తయారీ, తోలు ఉత్పత్తుల క్లస్టర్ రానుంది. రూ.17 లక్షలకే ఇండిపెండెంట్ హౌజ్.. షాద్‌నగర్‌లోని రామేశ్వరం దేవాలయానికి కూతవేటు దూరంలో 600 ఎకరాల్లో ఆంబియెన్స్ పేరుతో మెగా గేటెడ్ కమ్యూనిటీని అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో 147- 1,000 గజాల మధ్య విస్తీర్ణాలతో మొత్తం 10 వేల ప్లాట్లుంటాయని స్పేస్ విజన్ గ్రూప్ సీఎండీ టీవీ నర్సింహారెడి చెప్పారు. ♦ తొలి దశలో 40 ఎకరాలకు డీటీసీపీ అనుమతులు పొందాం. ధర గజానికి రూ.2,250. ఈఎంఐ, బ్యాంకు రుణ సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం. 5 ఎకరాల్లో క్లబ్ హౌజ్, 5 హోల్స్ గోల్ఫ్ కోర్ట్లతో పాటూ ఇతర వసతులన్నీ ఉంటాయి. ♦ సామాన్యులకు తక్కువ ధరలో ఇండిపెండెట్ హౌజ్‌ను అందించాలనే ఉద్దేశంతో వీఎన్‌సీటీ అనే సంస్థతో కలసి హౌజింగ్ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. 200 గజాల్లో 1,000 చ.అ.ల్లో నిర్మించే ఈ ఇళ్లను రూ.17 లక్షలకే అందిస్తాం. తొలి విడతగా 20 ఇళ్లను నిర్మిస్తాం. డిమాండ్‌ను బట్టి 100 ఎకరాల వరకూ విస్తరిస్తాం. ఈ ప్రాజెక్ట్‌లో 5 వేల చ.అ. క్లబ్ హౌజ్ కూడా ఉంటుంది. ఎన్నారై కొనుగోలుదారుల కోసం రుణాలిప్పించేందుకు దుబాయ్‌కు చెందిన ఎమిరైట్స్ ఎన్బీడీ బ్యాంక్తోనూ ఒప్పందం కుదుర్చుకున్నాం. ♦ పోలేపల్లి సెజ్‌కు దగ్గర్లో 300 ఎకరాల్లో గ్రీన్ ఎకర్స్ ఫాం ల్యాండ్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో ఎకరాన్ని యూనిట్ వారీగా విక్రయిస్తాం. ధర ఎకరానికి రూ.12 లక్షలు. ♦ దీని ప్రత్యేకతేంటంటే.. ప్రతీ ఎకరంలో 300 మలబార్, ఐదు రకాల 25 సేంద్రియ పండ్ల మొక్కలను పెంచుతాం. మూడేళ్ల వరకు వీటి పర్యవేక్షణ, పెంపకం బాధ్యత కంపెనీదే. ఆ తర్వాత కొంత రుసుం వసూలు చేస్తాం. ♦ గాజులరామారంలో 25 ఎకరాల్లో వీనస్ ఎన్‌క్లేవ్‌ను ప్లాటింగ్ వెంచర్‌ను చేస్తున్నాం. ఇందులో 135- 200 గజాల మధ్య మొత్తం 460 ప్లాట్లుంటాయి. ధర గజానికి రూ.15 వేలు. నేడు, రేపు హెచ్డీఎఫ్సీ ప్రాపర్టీ షో సాక్షి, హైదరాబాద్: నగరవాసుల సొంతింటి కలను సాకారం చేసేందుకు మరో ప్రాపర్టీ షో రెడీ అయ్యింది. హెచ్డీఎఫ్సీ హోమ్స్ లోన్స్ సంస్థ శని, ఆదివారాల్లో రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ‘రెడీ టు మూవ్స్ ఇన్ హోమ్స్ షో కేస్’ పేరుతో ప్రాపర్టీ షోను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.