ఏటీఎంల దొంగ దొరికాడు
హైదరాబాద్: కొత్తపేటలో దొంగతనానికి పాల్పడేందుకు ప్రయత్నించిన ఓ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. శరవేగంగా స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకొని కటకటాల్లో పెట్టేశారు. కొత్త కోటలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఇండిక్యాష్ ఏటీఎంలను ధ్వంసం చేసి అందులోని డబ్బును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. చివరికి అతడివల్ల కాకపోవడంతో అలాగే వదిలివెళ్లాడు. ధ్వంసం అయిన ఏటీఎంలను పరిశీలించిన పోలీసులు వాటిల్లోని సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని నిందితుడిని గుర్తించారు. ఆ వెంటనే రంగంలోకి అరెస్టు చేశారు.