ఇండియా 'ఆపరేషన్ మైత్రి'
న్యూఢిల్లీ: భూకంప బారిన పడిన నేపాల్‌కు ఇండియా సహాయక చర్యటు వేగవంతం చేసింది. ఇండియన్ ఆర్మీ నేపాల్‌కు అందించే సహాయ పరిధిన మరింత పెంచింది. ఇందుకుగాను 'ఆపరేషన్ మైత్రి' అని నామకరణం చేసింది. ఇప్పటికే నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) ద్వారా భారీ ఎత్తున సహాయక వస్తు సామాగ్రి ని చేరవేయడమే కాకుండా అక్కడ ప్రమాదంలో ఉన్న 500 మందికి పైగా భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చింది.
ఈ సందర్భంగా రెండో అందిస్తున్న సహాయక చర్యలపై ఢిఫెన్స్ మంత్రిత్వశాఖ అధికారిక ప్రతినిధి స్పందిస్తూ 'భారత్ రెండో రోజు కూడా భారీ మొత్తంలో నేపాల్‌కు సహాయాన్ని అందజేస్తోంది. వారికి అవసరమైన ఆహార సామాగ్రి, తినుబండారాలు, ఇతర సాంకేతిక పరికరాలను పంపిస్తోంది. మొత్తం పది విమానాలను కఠ్మాండుకు పంపించేందుకు సిద్ధం చేశాం.వీటిల్లో ఇంజినీర్లు, వైద్య సిబ్బంది, ఆస్పత్రికి సంబంధిన వారు ఉంటారు' ఆయన వెల్లడించారు.