India Blue team
-
బ్లూకి భారీ ఆధిక్యం
గ్రేటర్ నోయిడా: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా బ్లూ జట్టుకు తొలి ఇన్నింగ్సలో 338 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మూడో రోజు ఇండియా రెడ్ జట్టు 98.1 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. బిన్నీ (159 బంతుల్లో 98; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్సను ప్రారంభించిన ఇండియా బ్లూ జట్టు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 1 పరుగు చేసింది. -
ఫైనల్ దిశగా ఇండియా బ్లూ
గ్రేటర్ నోరుుడా: దులీప్ ట్రోఫీలో ఇండియా బ్లూ జట్టు ఫైనల్కు చేరువరుుంది. గ్రీన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్సలో బ్లూ జట్టు 26 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 85 పరుగులు చేసింది. అంతకు ముందు గ్రీన్ జట్టు తొలి ఇన్నింగ్సలో 61 ఓవర్లలో 237 పరుగులకే ఆలౌట్ కావడంతో... బ్లూ జట్టుకు 470 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స ఆధిక్యం లభించింది. బ్లూ జట్టు తమ తొలి ఇన్నింగ్సలో ఏకంగా 707 పరుగులు చేయడం విశేషం. పుజారా (166), షెల్డన్ జాక్సన్ (105) సెంచరీలు సాధించారు.