జనవరిలో సేవల జోరు..
న్యూఢిల్లీ: సేవల రంగం జనవరిలో మంచి పనితీరు ప్రదర్శించినట్లు నికాయ్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) అవుట్పుట్ ఇండెక్స్ పేర్కొంది. ఈ రంగం క్రియాశీలత 19 నెలల గరిష్ట స్థాయిలో 54.3 పాయింట్లకు ఎగసినట్లు ఇండెక్స్ తెలిపింది. జనవరిలో ఈ సూచీ 53.6 పాయింట్ల వద్ద ఉంది. డిమాండ్, వాతావరణ పరిస్థితులు మెరుగుపడ్డం వంటి అంశాలు సేవల రంగం పురోగతికి కారణమని సర్వేను చేసిన మార్కిట్ సంస్థ ఎకనమిస్ట్ పోలీనా డీ లిమా పేర్కొన్నారు. కాగా తయారీ, సేవల రంగాలు రెండింటికీ సంబంధించిన నికాయ్ కాంపోజిట్ పీఎంఐ అవుట్పుట్ ఇండెక్స్ డిసెంబర్లో 51.6 పాయింట్ల వద్ద ఉండగా, జనవరిలో 11 నెలల గరిష్ట స్థాయిలో 53.3 పాయింట్లకు ఎగసింది.