ఫెలోషిప్
ఫుల్బ్రైట్ - నెహ్రూ మాస్టర్స్ ఫెలోషిప్స్
యునెటైడ్ స్టేట్స్-ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ (యూఎస్ఐఇఎఫ్).. ఫుల్బ్రైట్-నెహ్రూ మాస్టర్స్ ఫెలోషిప్స్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అమెరికాలోని ఎంపిక చేసిన కాలేజీలు, యూనివర్సిటీల్లో మాస్టర్స్ ప్రోగ్రామ్లు చేసేందుకు ఈ ఫెలోషిప్లను ఇవ్వనుంది.
ఫెలోషిప్ వ్యవధి: ఒకటి లేదా రెండేళ్లు.
ఫెలోషిప్ వివరాలు
జే-1 వీసా మంజూరుకు సాయం. విమానంలో ఎకానమీ క్లాస్లో ప్రయాణానికి (రానుపోను) అయ్యే ఖర్చులు ఇస్తారు. ట్యూషన్ ఫీజు; జీవన, సంబంధిత వ్యయాలను చెల్లిస్తారు.
అర్హతలు
* అమెరికాలోని నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీతో సత్సమానమైన డిగ్రీని ఇండియాలోని గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో పొంది ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ లేనివారు పీజీ చేసి ఉండాలి.
* సంబంధిత రంగంలో కనీసం మూడేళ్ల పని అనుభవం. నాయకత్వం, సంఘ సేవలో చెప్పుకోదగ్గ అనుభవం.
* అమెరికాలో ఇప్పటికే డిగ్రీ పూర్తిచేసి ఉండకూడదు. డిగ్రీ కోర్సుకు దరఖాస్తు చేసుకుని ఉండకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
చివరి తేదీ: జూన్ 15
వివరాలకు: www.usief.org.in