స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డబ్బు అన్ని వేల కోట్లా?
భారతదేశంలో చాలా మంది ప్రముఖులకు స్విస్ బ్యాంకుల్లో అకౌంట్స్ ఉంటాయని కొన్ని సందర్భాల్లో వినే ఉంటారు. స్విస్ బ్యాంకుల ఖాతాలను గురించి నిజ జీవితంలో కంటే సినిమాల్లో బ్లాక్ మనీ గురించి వచ్చే చాలా సందర్భాల్లో వినే ఉంటారు. కానీ ఈ బ్యాంకులో అకౌంట్స్ కలిగిన ఇండియన్స్ చాలా మందే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇంతకీ స్విస్ బ్యాంకులో ఉన్న భారతీయులకు సంబంధించిన డబ్బు ఎంత ఉండొచ్చు? స్విస్ బ్యాంకు రూల్స్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కేవలం భారతీయులు మాత్రమే కాకుండా ప్రపంచములోని చాలా దేశాల ధనవంతులు తమ డబ్బుని స్విస్ బ్యాంకులో దాచుకుంటారు. ఇతర బ్యాంకులతో పోలిస్తే స్విస్ బ్యాంకు రూల్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయని చెబుతారు. కావున అక్కడ అకౌంట్ ఉంటే చాలు లాకర్ ఇచ్చేస్తుంటారు. ఎవరు ఖాతా ఓపెన్ చేసారనే విషయాలు పెద్దగా పట్టించుకోరు. అంతే కాకుండా ఖాతాదారులకు సంబంధించిన వివరాలను ఎవరికీ వెల్లడించే అవకాశం లేదు.
(ఇదీ చదవండి: విడుదలకు ముందే వన్ప్లస్ బడ్స్ వివరాలు లీక్ - ధర ఎంతంటే?)
స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంక్ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం, 2022 చివరి నాటికి భారతీయులకు, మన దేశంలోని కంపెనీలకు సంబంధించిన డబ్బు 3.42 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ అని తెలుస్తోంది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30 వేల కోట్లు. 2021 కంటే 2022లో 11 శాతం డిపాజిట్లు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
(ఇదీ చదవండి: అట్లుంటది ముఖేష్ అంబానీ అంటే! ఆ కారు పెయింట్ ఖర్చు రూ. కోటి..)
స్విస్ బ్యాంకుల్లో భారతీయుడు దాచుకున్న డబ్బుని బ్లాక్ మనీ అనలేమని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే పన్ను ఎగవేత వంటి వాటికీ అడ్డుకట్ట వేయడానికి ఇండియాకి నిరంతరం సహకరిస్తున్నామని వెల్లడించారు. దీని కోసం స్విట్జర్లాండ్ 2018లో భారత్లో టాక్స్ విషయాలకు సంబంధించిన సమాచార మార్పిడి కోసం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే 2018 నుంచి స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్న వారి వివరాలను భారత ట్యాక్స్ అథారిటీ చేతికి అందించినట్లు సమాచారం.