భారత్‌ నిధులతో నేపాల్‌లో స్కూల్‌ ప్రారంభం | nepal school build with india funds | Sakshi
Sakshi News home page

భారత్‌ నిధులతో నేపాల్‌లో స్కూల్‌ ప్రారంభం

Published Mon, Jul 24 2017 3:10 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

nepal school build with india funds

కఠ్మాండ్‌: భారత ప్రభుత్వ నిధులతో ఉద యగిరి జిల్లా జోగిదహాలో నిర్మించిన శ్రీ జనతా హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ భవంతి ని నేపాల్‌లో భారత రాయబారి మన్జీవ్‌ సింగ్‌పూరీ ఆదివారం ప్రారంభించారు. ఇదే జిల్లాలోని బాసాహాలో నిర్మించనున్న శ్రీనారద్‌ఆదర్శ ఎడ్యుకేషనల్‌ క్యాంపస్‌కు శంకుస్థాపన చేశారు.

భారత్‌–నేపాల్‌ మధ్య జరిగిన ‘ఎకనామిక్‌ కోఆపరేషన్‌ ప్రోగ్రామ్‌’ లో భాగంగా కేంద్రం ఈ పాఠశాలలను నిర్మిస్తున్నట్లు భారత రాయబార కార్యా లయం తెలిపింది.ఇందుకు స్మాల్‌ డెవలప్‌ మెంట్‌ ప్రోగ్రామ్‌ కింద రూ.4.16కోట్ల సాయం అందించామని పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement