india got talent
-
‘ఇండియాస్ గాట్ టాలెంట్’ పోస్ట్ ప్రొడ్యూసర్ మృతి
ముంబై: ‘ఇండియాస్ గాట్ టాలెంట్’, ‘మాస్టర్ చెఫ్ ఇండియా’ కార్యక్రమాల పోస్ట్ ప్రొడ్యూసర్ సోహాన్ చౌహాన్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆదివారం రాత్రి ముంబైలోని రాయల్ పామ్ సొసైటీకి చెందిన చెరువులో అతని మృతదేహం దొరికింది. సోహాన్ చౌహాన్ చనిపోయి మూడు రోజులు గడుస్తున్నా మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. చౌహన్ టీవీ షోలకు పోస్ట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అతని భార్య ప్రస్తుతం ఢిల్లీలో ఉండగా, అతను ముంబైలో ఒంటరిగా జీవిస్తున్నారు. సోహాన్ చౌహాన్ జూన్ 13 వరకు సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నారు. అంతకుముందు జూన్ 9న ‘సరిగమప లిటిల్ చాంప్స్’ ఫైనల్స్ కోసం పోస్ట్ కూడా చేశారు. చౌహాన్‌ను చివరిసారిగా శనివారం అతని ఇంట్లో పని చేసే వ్యక్తి చూశాడు. సోహాన్ ప్రమాదవశాత్తూ మరణించారా? లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు -
ఎనిమిదేళ్ల పిల్లాడి అంతర్జాతీయ ఇమేజ్!
అక్షత్ సింగ్... ‘కలర్స్’ చానల్లో ‘ఇండియా గాట్ టాలెంట్-5’ కార్యక్రమం చూసేవారికి పరిచయం ఉన్న బుడ్డోడు. ఇతడి వయసు ఎనిమిదేళ్లే కానీ... చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఇతడికి అభిమానులయ్యారు. బీట్‌కు తగ్గట్టుగా ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ ఫాస్ట్‌గా డాన్స్ చేసే , బొద్దుగా ముద్దుగా ఉన్న ఈ బుడ్డోడిని చూసి ఆశ్చర్యపోని వారు ఉండరు. ఆ మధ్య అక్షత్...‘దబంగ్’ సినిమాలోని ‘మేరా హి జల్వా..’ పాటకు చేసిన డాన్స్‌తో అతడి పేరు మారుమోగిపోయింది. ‘కలర్స్’ వాళ్లు ఆ వీడియోను యూట్యూబ్‌లో పెట్టారు. దానికి లక్షల కొద్దీ వ్యూలు, వేల కొద్దీ లైకులు వచ్చాయి. ఇక ఆ రియాలిటీ షోకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన మలైకా ఆరోరాఖాన్కి అక్షత్ అంటే చాలా ఇష్టం. దేశవ్యాప్తంగా ఇలాంటి ఫ్యాన్స్‌ను కలిగి ఉన్న అక్షత్‌కు ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. ఒక అమెరికన్ టీవీ చానల్లో ప్రసారం అయ్యే ‘ది ఎలెన్ డీజెనెరస్ షో’ లో ఇటీవలే అక్షత్ పాల్గొన్నాడు. షూటింగ్ పూర్తి అయ్యిందికానీ ఆ కార్యక్రమం ఇంకా ప్రసారంకాలేదు. చిన్నారులకు సంబంధించిన ఆ షోలో అక్షత్ అల్లరిని చూడవచ్చు. షో నిర్వాహకురాలు తన ప్రదర్శనను చూసి సల్మాన్ గురించి వివరాలను అడిగారని అక్షత్ చెప్పాడు. సల్లూ గురించి తెలియని ఎలెన్ ఆయన గురించి చెప్పమని కోరిందని అక్షత్ వివరించాడు.