India International Trade Fair
-
ఏపీ పెవిలియన్‌కు విశేష ఆదరణ
సాక్షి, అమరావతి: ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్–2023లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌కు సందర్శకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ‘వసుధైక కుటుంబం–యునైటెడ్ బై ఇండియా’ పేరుతో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. నవంబర్ 14న ప్రారంభమైన ఎగ్జిబిషన్ నవంబర్ 27వ తేదీతో ముగియనుంది. రాష్ట్రం నుంచి 195 దేశాలకు 3,137 ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా ఆయా దేశాలతో కుటుంబ సభ్యులుగా మారి వసుధైక కుటుంబంగా ఎలా ఎదిగిందన్న విషయాన్ని తెలియచేసే విధంగా ఏపీ పెవిలియన్‌ను తీర్చిదిద్దారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఎగ్జిబిషన్లో 550 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సందర్శకులను కట్టిపడేసే విధంగా ఏపీ పెవిలియన్ తీర్చిదిద్దింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ ఈ పెవిలియన్‌ను ప్రారంభించారు. భారీగా సందర్శకుల తాకిడి రాష్ట్రంలోని హస్తకళలు, భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులతో పాటు హస్తకళా ఉత్పత్తులతో ఏపీ పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ఎన్నడూ లేనివిధంగా సందర్శకుల తాకిడి అధికంగా ఉందని, ప్రతిరోజు లక్ష మందికిపైగా సందర్శకులు పెవిలియన్‌ను సందర్శిస్తున్నారని పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ (ఎగుమతులు) జీఎస్ రావు ‘సాక్షి’కి చెప్పారు. కలంకారీ, మంగళగిరి జరీ, ధర్మవరం పట్టు, నెల్లూరు ఉడెన్ కట్లరీ, లేపాక్షి, తోలు బొమ్మలు వంటి వాటికి సందర్శకుల నుంచి మంచి స్పందన వచ్చిదని, పలువురు భారీగా కొనుగోళ్ల ఆర్డర్లు ఇచ్చారని వివరించారు. నాలుగున్నర ఏళ్లుగా ఏపీలో నాడు–నేడు కింద అమలు చేస్తున్న పథకాలను ప్రతీ ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఇంగ్లిష్ లో వివరిస్తూ ఆర్ట్ రూపంలో ఏర్పాటు చేసిన చిత్రానికి మంచి స్పందన వచ్చిదని, పలువురు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కొనియాడారని చెప్పారు. అధికారులకు అభినందన పెవిలియన్‌లో రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తూ వైఎస్సార్ ఏపీ వన్ కింద ఏవిధంగా త్వరతగతిన అనుమతులు జారీ చేస్తున్నారో తెలియజేసే కియోస్్కని పలువురు సందర్శించారు. 974 కి.మీ. తీర ప్రాంతాన్ని ఏవిధంగా అభివృద్ధి చేస్తున్నదీ, మత్స్య ఎగుమతుల్లో ఏపీ నంబర్–1 స్థానంలో ఉందన్న విషయాన్ని వివరిస్తూ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద పలువురు ఫొటోలు దిగుతున్నారు. సాయంత్రం వేళ రాష్ట్రంలోని సంప్రదాయ కళలను పరిచయం చేసేవిధంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కళా ప్రదర్శనలకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర ప్రగతిని ప్రపంచ దేశాలకు తెలియచేసే విధంగా పెవిలియన్‌ను తీర్చిదిద్దారంటూ పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ అధికారులను ప్రశంసించారు. కాగా.. సందర్శకులను విశేషంగా ఆకర్షించిన ఏపీ పెవిలియన్‌కి ఐఐటీఎఫ్ జ్యూరీ అవార్డు ప్రకటించింది. -
ఐఐటీఎఫ్‌కు గవర్నర్ తమిళిసై హాజరు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం ఢిల్లీ వచ్చారు. ప్రగతి మైదాన్‌లో ఈ నెల 14 నుంచి జరుగుతున్న ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (ఐఐటీఎఫ్)–2022 కు హాజరయ్యారు. అనంతరం ఐఐటీఎఫ్లో పుదుచ్చేరి దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై పాల్గొని పుదుచ్చేరి పెవిలియన్‌ను ప్రారంభించారు. అనంతరం తెలంగాణభవన్‌కు వెళ్లిన తమిళిసై తర్వాత హైదరాబాద్‌కు చేరుకున్నారు. గవర్నర్‌ను కలిసిన సుచిత్ర ఎల్లా సాక్షి, హైదరాబాద్: భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా మంగళవారం గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. నిరుపేద మహిళ సంధ్యారాణి, ఆమె ముగ్గురు పిల్లలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చినందుకు సుచిత్ర ఎల్లాను గవర్నర్ అభినందించారు. ఇటీవల గవర్నర్ బైరాన్‌పల్లి గ్రామ సందర్శనలో సంధ్యారాణి ఆమె కాన్వాయ్‌ని చేర్యాల వద్ద ఆపి సహాయం కోసం తన ఇంటికి తీసుకెళ్లారు. ఈ çఘటనపై తమిళిసై చేసిన ట్వీట్‌కు స్పందించిన సుచిత్ర.. సంధ్యారాణికి సహాయం అందించడానికి ముందుకువచ్చారు. -
ఎగుమతుల్లో కొత్త రికార్డులు సాధిస్తాం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లోనూ పుంజుకుంటోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. వస్తు, సేవల ఎగుమతుల్లో చారిత్రక గరిష్ట స్థాయులను సాధించే దిశగా దేశం పురోగమిస్తోందని ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 400 బిలియన్ డాలర్ల ఉత్పత్తుల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. అలాగే సర్వీసుల ఎగుమతులకు సంబంధించి 150 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించగలమని ఆయన పేర్కొన్నారు. వెరసి ఇటు వస్తువులు, అటు ఉత్పత్తుల విషయంలో రికార్డు స్థాయి ఎగుమతులు నమోదు చేయగలమని గోయల్ ధీమా వ్యక్తం చేశారు. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (ఐఐటీఎఫ్)ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో దేశంలోకి 27 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయని మంత్రి చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే 62 శాతం ఎగిశాయని వివరించారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఎదిగిందని, లాక్డౌన్ విధించిన ప్రతికూల పరిస్థితుల్లోనూ అంతర్జాతీయ వ్యవస్థకు ఎటువంటి అంతరాయాలూ ఏర్పడకుండా సేవలు అందించిందని మంత్రి చెప్పారు. దేశ ఎకానమీ వేగంగా కోలుకుంటోందనడానికి అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ. 1.3 లక్షల పైగా నమోదు కావడం నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. భారత్‌కి ఉన్న సానుకూల అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని అంతర్జాతీయ రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ ఇటీవలే భారత సార్వభౌమ రేటింగ్‌ను నెగెటివ్ నుంచి స్టేబుల్ స్థాయికి మార్చిందని మంత్రి చెప్పారు. మెరుగైన ఇన్ఫ్రా, వృద్ధిలో వైవిధ్యం, అభివృద్ధికి డిమాండ్ తదితర అంశాలు ఆర్థిక పునరుజ్జీవనానికి దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు. -
చౌకగా.. నాణ్యమైన ఉత్పత్తులు
ఎగుమతిదారులకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచన న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా డిమాండ్ మందగించడం వల్ల ఎగుమతులు క్షీణిస్తుండటంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎగుమతులకు ప్రోత్సాహం ఇచ్చేలా అనువైన పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయంగా ఎదురైన అనుభవాలను బట్టి చూస్తే ప్రపంచ దేశాలు నాణ్యమైన ఉత్పత్తులు, చౌకగా లభిస్తే కొనుక్కునేందుకు మొగ్గు చూపుతున్నాయని తెలుస్తుందని ఆయన చెప్పారు. అంతర్జాతీయంగా వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గుతోందని, దీంతో తమ ఉత్పత్తులను కొనగలిగేవారిని చేరడం విక్రేతలకు కష్టంగా మారుతోందని ఆయన వివరించారు. ఇతరులకన్నా భిన్నంగా యోచించి నాణ్యమైన ఉత్పత్తులు చౌకగా అందించే ప్రయత్నం చేయాలని, తద్వారా అవకాశాలను అందిపుచ్చుకోవాలని జైట్లీ సూచించారు. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ఎగుమతులు వరుసగా 11వ నెలలోనూ క్షీణించడం, అక్టోబర్‌లో 17.5% తగ్గి 21.35 బిలియన్ డాలర్లకు పడియాయి. మరోవైపు, వాణిజ్య కార్యకలాపాలు పెరిగేందుకు ట్రేడ్ ఫెయిర్స్ ఊతమిస్తాయని జైట్లీ చెప్పారు. ఈ ఏడాది ఐఐటీఎఫ్‌ను 17 లక్షల మంది పైగా సందర్శించారని పేర్కొన్నారు.