ఐఐటీఎఫ్‌కు గవర్నర్‌ తమిళిసై హాజరు  | Telangana: Tamilisai Soundararajan Attended India International Trade Fair | Sakshi
Sakshi News home page

ఐఐటీఎఫ్‌కు గవర్నర్‌ తమిళిసై హాజరు 

Published Wed, Nov 23 2022 1:22 AM | Last Updated on Wed, Nov 23 2022 1:22 AM

Telangana: Tamilisai Soundararajan Attended India International Trade Fair - Sakshi

ఐఐటీఎఫ్‌లో పుదుచ్చేరి దినోత్సవంలో పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై 

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మంగళవారం ఢిల్లీ వచ్చారు. ప్రగతి మైదాన్‌లో ఈ నెల 14 నుంచి జరుగుతున్న ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఫెయిర్‌ (ఐఐటీఎఫ్‌)–2022 కు హాజరయ్యారు. అనంతరం ఐఐటీఎఫ్‌లో పుదుచ్చేరి దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై పాల్గొని పుదుచ్చేరి పెవిలియన్‌ను ప్రారంభించారు. అనంతరం తెలంగాణభవన్‌కు వెళ్లిన తమిళిసై తర్వాత హైదరాబాద్‌కు చేరుకున్నారు.  

గవర్నర్‌ను కలిసిన సుచిత్ర ఎల్లా 
సాక్షి, హైదరాబాద్‌:
భారత్‌ బయోటెక్‌ సహ వ్యవస్థాపకురాలు, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్రా ఎల్లా మంగళవారం గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. నిరుపేద మహిళ సంధ్యారాణి, ఆమె ముగ్గురు పిల్లలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చినందుకు సుచిత్ర ఎల్లాను గవర్నర్‌ అభినందించారు. ఇటీవల గవర్నర్‌ బైరాన్‌పల్లి గ్రామ సందర్శనలో సంధ్యారాణి ఆమె కాన్వాయ్‌ని చేర్యాల వద్ద ఆపి సహాయం కోసం తన ఇంటికి తీసుకెళ్లారు. ఈ çఘటనపై తమిళిసై చేసిన ట్వీట్‌కు స్పందించిన సుచిత్ర.. సంధ్యారాణికి సహాయం అందించడానికి ముందుకువచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement