india newzealand test
-
గుట్కా మ్యాన్ అంటూ ట్రోలింగ్.. అసలు విషయం తెలిస్తే షాక్!
క్రికెట్‌కు సంబంధించి మ్యాచ్ గెలుపోటములు, ఆటగాళ్ల ప్రదర్శన, అభిమానుల తీరు అన్నింటిపై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ ట్రెండ్ అవుతుంటాయి. అయితే భారత్‌లో ప్రస్తుతం పూర్తిస్థాయిలో క్రికెట్ ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తుంది. న్యూజిలాండ్ టీమిండియా పర్యటనలో భాగంగా కాన్పూర్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. Test matches in Kanpur. Pity the guy at the other end who has to decipher what this guy is saying pic.twitter.com/AOTYTnvQYR — Gabbbar (@GabbbarSingh) November 25, 2021 కాగా ఆట మొదటిరోజులో భాగంగా మ్యాచ్ వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకుల వైపు కెమెరా తిరిగింది. స్టాండ్‌లో ఉన్న వ్యక్తిపైకి కెమెరా ఫోకస్ మరింత దగ్గరగా వెళ్లింది. అతను గుట్కా నములుతూ.. ఫోన్ సంభాషిస్తున్నట్లు కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో అతనిపై ఫన్నీగా మీమ్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేశారు. మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా ఓ ఫన్నీ మీమ్‌ను ట్విటర్లో పోస్ట్‌చేశారు. "Abe Guddu, Guthka sath leke aana, idhar mehenga bech rahe." pic.twitter.com/9HyYg33S1U — Silly Point (@FarziCricketer) November 25, 2021 ఇక ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో నగరం పొగాకు, పాన్ మసాలాకు ప్రసిద్ధి చెందింది కావటంతో నెటిజన్లు అతనిపై విపరీతంగా జోకులు, మీమ్స్ పేల్చుతున్నారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి శోభిత్ పాండేగా గుర్తించారు. అతను కాన్పూర్‌లోని మహేశ్వరీ మహల్లో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే శోభిత్ పాండే రెండో రోజు(శుక్రవారం) కూడా టెస్ట్ మ్యాచ్ చూడడానికి వచ్చాడు. 😅 #INDvNZ pic.twitter.com/JpRSwzk8RQ — Wasim Jaffer (@WasimJaffer14) November 25, 2021 అయితే అతనిపై మళ్లీ కెమెరా ఫోకస్ కాగా.. ‘గుట్కా నమలడం చెడు అలవాటు’ అని ఓ ప్లకార్డు కనిపించింది. అయితే శోభోత్ పాండే మీడియాతో మాట్లాడుతూ.. తనకు అసలు గుట్కా తినే అలవాటు లేదని తెలిపాడు. కేవలం తమలపాకు తింటూ మరోస్టాండ్లోని తన స్నేహితుడితో ఫోన్లో మాట్లాడుతున్నానని చెప్పాడు. అయితే సదరు వ్యక్తి బాధ ఏంటంటే.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో తన సోదరి తనతోపాటు ఉండటం, ఆమెపై కూడా కామెంట్లు రావడమని పేర్కొన్నాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అందుకే చాలా ఇబ్బందికరంగా ఉందని తెలిపాడు. తన సోదరిపై కూడా కామెంట్లు చేశారని ఆవేదన వ్యక్తంచేశాడు. అదే విధంగా తనకు చాలా మీడియా సంస్థల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని దీంతో చాలా చిరాకుగా ఉందని తెలిపాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 345 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియాకు 43 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మూడోరోజు ఆట ముగిసేసమయానికి 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 63 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
ఒక్క బంతి కూడా వేయకుండానే 5 పరుగులు!
టీమిండియా భారీస్థాయిలో ఏకంగా 557 పరుగులు చేసి డిక్లేర్ చేసిన తర్వాత మార్టిన్ గుప్తిల్ మొట్టమొదటి బంతిని ఎదుర్కోడానికి వచ్చాడు. అయితే ఇండోర్ స్టేడియంలో స్కోరుబోర్డు చూసిన ప్రేక్షకులతో పాటు టీవీలలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు కూడా ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే, మొదటి బంతి కూడా ఇంకా విసరకముందే న్యూజిలాండ్ స్కోరు 5/0 అని చూపిస్తున్నారు. పోనీ ఎక్స్‌ట్రాలు ఏమైనా వేశారా అంటే, 5 పరుగులు వచ్చే ఎక్స్‌ట్రాలు ఏమీ లేవు. ఎలా జరిగిందని చూస్తే.. మన 'సర్ జడ్డూ' రవీంద్ర జడేజా ఎన్నిసార్లు చెప్పినా పిచ్ మధ్యలోంచి పరుగులు తీయడంతో అతడికి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించడంతో పాటు జట్టుకు కూడా జరిమానాగా ఆతిథ్య జట్టుకు ముందుగానే 5 పరుగులు ఇచ్చేశారు. ఇంతకుముందు కూడా బౌలింగ్ చేసేటప్పుడు అంపైర్‌ను గట్టిగా అప్పీలు చేయాలంటే పిచ్ మధ్యలోకి పరుగెత్తుకుని రావడం రవీంద్ర జడేజాకు అలవాటు. ఇంతకుముందు కోల్‌కతా టెస్టులో అంపైర్ రాడ్ టకర్ దీనిపై ఒకటి రెండుసార్లు జడేజాను హెచ్చరించారు. అప్పుడే అతడికి అధికారికంగా కూడా వార్నింగ్ ఇచ్చారు. అయితే న్యూజిలాండ్ కోచ్ మైక్ హెసన్ మాత్రం కేవలం 5 పరుగుల పెనాల్టీ విధిస్తే సరిపోతుందా అని అడిగారు. వికెట్లు త్వరగా పాడైపోయే దేశాల్లో అంపైర్లు ఆటగాళ్ల విషయంలో గట్టిగా వ్యవహరించాలని, అందుకు తగిన నిబంధనలు కూడా ఉన్నాయని అన్నారు. -
విజయానికి 320 పరుగుల దూరంలో టీమిండియా
తొలి ఇన్నింగ్స్‌లో తడబడినా, రెండో ఇన్నింగ్స్ వచ్చేసరికి భారత బౌలర్లు విజృంభించారు. దీంతో ఆతిథ్య జట్టును 105 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా, విజయాన్ని అందుకోవాలంటే మరొక్క 320 పరుగులు చేస్తే చాలు. మొత్తం విజయలక్ష్యం 407 పరుగులు కాగా, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 87/1 స్కోరుతో ధీమాగా ఉంది. మొదటి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే చాప చుట్టేసిన టీమిండియా.. ఆతిథ్య కివీస్ జట్టు కంటే 301 పరుగులు వెనకబడింది. దాంతో మ్యాచ్ చేజారినట్లేనని అంతా నిరాశపడుతున్న సమయంలో ఒక్కసారిగా భారత బౌలర్లు జూలు విదిల్చారు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ నుంచి పరుగుల వరద మళ్లీ వస్తుందని అభిమానులు ఆశిస్తుంటే, అందుకు భిన్నంగా జరిగింది. 41.2 ఓవర్లలో 105 పరుగులకే కివీస్ జట్టును పెవిలియన్ దారి పట్టించారు. దీంతో ఒక్క మూడోరోజే ఈడెన్ పార్కు మైదానంలో ఏకంగా 17 వికెట్లు టపటపా రాలిపోయినట్లయింది. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ రాస్ టేలర్ మాత్రమే 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరును చేరుకున్నారు. పేసర్లు ఇషాంత్ శర్మ (3/28), మహ్మద్ షమీ (3/38), రెచ్చిపోయి ఆరు వికెట్లు తీసుకోగా, వెటరన్ జహీర్ ఖాన్ (2/23) కూడా వారికి తోడయ్యాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 36 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. సౌతీ బౌలింగులో వాట్లింగ్ క్యాచ్ పట్టడంతో మురళీ విజయ్ 13 పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టాడు. అయితే హిట్టర్ శిఖర్ ధవన్ 49 పరుగులతోను, యువ సంచలనం ఛటేశ్వర్ పుజారా 22 పరుగులతోను క్రీజ్‌లో ఉన్నారు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. మూడోరోజు చిట్ట చివరి బంతికి సోధీ ఎల్బీడబ్ల్యు అప్పీల్ చేసినా, అంపైర్ నిర్ణయం మాత్రం ధావన్‌కు అనుకూలంగానే వచ్చింది. ఇప్పుడు 407 పరుగుల లక్ష్యాన్ని గనక టీమిండియా ఛేదిస్తే, ఇది టెస్టు చరిత్రలోనే రెండో అతి పెద్ద ఛేజింగ్ అవుతుంది. ఆ రికార్డు భారత జట్టుకు సొంతం అవుతుంది. ఇంతకుముందు 2003లో 418 పరుగుల విజయ లక్ష్యాన్ని వెస్టిండీస్ ఛేదించి టాప్ రికార్డు సొంతం చేసుకుంది. ఇప్పటివరకు టెస్టు క్రికెట్లో కేవలం మూడుసార్లు మాత్రమే 400పైగా లక్ష్యాన్ని ఛేదించారు. ఆ జాబితాలో భారత్ కూడా ఉంది. వెస్టిండీస్ జట్టు నిర్దేశించిన 406 పరుగుల లక్ష్యాన్ని 1976లోనే ఛేదించింది. అదే సంవత్సరంలో ఇంగ్లండ్ జట్టు పెట్టిన 404 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది.