breaking news
India A vs South Africa A
-
అందుకే అతడిని సెలక్ట్ చేయలేదు: స్పందించిన బీసీసీఐ!
సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్ ఆడే భారత్- ‘ఎ’ జట్టు (IND A vs SA A)ను ప్రకటించిన నాటి నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)పై విమర్శలు కొనసాగుతున్నాయి. రిషభ్ పంత్ (Rishabh Pant) కెప్టెన్‌గా వ్యవహరించే ఈ జట్టులో ఉద్దేశపూర్వకంగానే సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan)కు చోటు ఇవ్వలేదనే ఆరోపణలు వస్తున్నాయి.ఇంటిపేరు కారణంగానే అంటూసొంతగడ్డపై సర్ఫరాజ్ ఖాన్ సత్తా చాటగలడని.. అయినా అతడిని పక్కనపెట్టడం ఏమిటని మాజీ క్రికెటర్లు సైతం విమర్శిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేత షామా మొహమ్మద్ అయితే ఓ అడుగు ముందుకేసి.. ఇంటిపేరు కారణంగానే సర్ఫరాజ్‌పై వేటు వేశారంటూ హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పై సంచలన ఆరోపణలు చేశారు.గజ్జల్లో గాయంఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు ఈ విషయంపై స్పందించినట్లు ఎన్డీటీవీ తెలిపింది. సర్ఫరాజ్ ఖాన్‌ను భారత్- ‘ఎ’ జట్టుకు ఎంపిక చేయకపోవడానికి గల కారణం వెల్లడించినట్లు పేర్కొంది. ఈ మేరకు.. ‘‘సర్ఫరాజ్ గజ్జల్లో గాయం కారణంగా చాలా రోజులు ఆటకు దూరమయ్యాడు. ఇటీవలే రంజీ ట్రోఫీ మొదటి రౌండ్ సందర్భంగా ముంబై తరఫున కాంపిటేటివ్ క్రికెట్లో పునరాగమనం చేశాడు.త్వరలోనే తిరిగి జట్టులోకిరంజీ తాజా సీజన్లో అతడి ప్రదర్శన, ఫిట్నెస్ ఎలా ఉంటుందో అంచనా వేసిన తర్వాతే అతడిని ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు. అందుకే భారత్-‘ఎ’ జట్టుకు ఎంపిక చేయలేదు. త్వరలోనే తిరిగి అతడు జట్టులోకి వస్తాడని నమ్ముతున్నాం’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు ఎన్డీటీవీ తెలిపింది.కాగా స్వదేశంలో దేశంలో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో ఈనెల 30 నుంచి నవంబర్ 9 వరకు జరిగే రెండు నాలుగు రోజుల (ఫస్ట్‌క్లాస్) అనధికారిక టెస్టు మ్యాచ్‌లలో తలపడే భారత ‘ఎ’ జట్టుకు పంత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ. పంత్ రీఎంట్రీబెంగళూరు వేదికగా జరిగే ఈ రెండు మ్యాచ్‌ల కోసం రెండు వేర్వేరు జట్లను మంగళవారం సెలక్టర్లు ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ తేదీలను దృష్టిలో ఉంచుకుంటూ ఆయా ఆటగాళ్ల అందుబాటును బట్టి జట్లను ఎంపిక చేశారు.కాగా ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టులో పేసర్ క్రిస్ వోక్స్ బంతి బలంగా తగలడంతో పంత్ కాలికి తీవ్ర గాయమైంది. దాంతో చివరి టెస్టు నుంచి తప్పుకున్న అతడు ఆ తర్వాత ఆసియా కప్ టీ20 టోర్నీ, వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. చికిత్స అనంతరం కోలుకున్న పంత్ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్య బృందం ఇటీవలే సర్టిఫికెట్ ఇచ్చింది. దాంతో అతడిని ముందుగా ‘ఎ’ జట్టు తరఫున ఆడించాలని సెలక్టర్లు నిర్ణయించారు.అన్నీ సానుకూలంగా ఉంటే దక్షిణాఫ్రికాతో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం పంత్‌ను ఎంపిక చేయడం లాంఛనమే. పంత్‌తో పాటు యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు మరింత మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని భావించి అతడిని రెండు మ్యాచ్‌ల కోసం ఎంపిక చేశారు. దేశవాళీలో రాణిస్తూ ఫామ్‌లో ఉన్న రజత్ పాటీదార్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వరన్, ఆకాశ్‌దీప్‌లను రంజీ కారణంగా ఒకే మ్యాచ్ కోసం ఎంపిక చేశారు. మరోవైపు టెస్టు సిరీస్‌కు ముందు తమ ఆటకు పదును పెట్టాలని భావిస్తున్న రెగ్యులర్ టెస్టు జట్టు సభ్యులు కేఎల్ రాహుల్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ధ్రువ్ జురేల్ కూడా రెండో మ్యాచ్‌లో ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగుతారు. భారత్ ‘ఎ’ జట్టు (తొలి మ్యాచ్‌కు): రిషభ్ పంత్ (కెప్టెన్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), ఆయుశ్ మాత్రే, జగదీశన్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటీదార్, హర్ష్ దూబే, తనుశ్ కొటియాన్, మానవ్ సుతార్, అన్షుల్ కంబోజ్, యశ్ ఠాకూర్, ఆయుశ్ బదోని, సారాంశ్ జైన్, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్. భారత్ ‘ఎ’ జట్టు (రెండో మ్యాచ్‌కు): పంత్ (కెప్టెన్), సాయిసుదర్శన్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుశ్ కొటియాన్, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్. చదవండి: డకౌట్ తర్వాత కోహ్లి చర్య వైరల్.. గుడ్‌బై చెప్పేశాడా? -
ఇంటిపేరు వల్లే అతడిని ఎంపిక చేయలేదా?.. మాజీ క్రికెటర్ స్ట్రాంగ్ కౌంటర్
సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన భారత్- ‘ఎ’ జట్టులో సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan)కు చోటు దక్కలేదు. రిషభ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ జట్టుకు వైస్ కెప్టెన్‌గా సాయి సుదర్శన్ (Sai Sudharsan)ను ఎంపిక చేశారు సెలక్టర్లు.కావాల్సినంత ప్రాక్టీస్అదే విధంగా రెండో అనధికారిక టెస్టులో కేఎల్ రాహుల్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ వంటి టీమిండియా స్టార్లకు కూడా చోటిచ్చారు. సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్‌కు సన్నాహకంగా ఉండే ఈ రెడ్‌బాల్ సిరీస్‌తో ఆటగాళ్లకు కావాల్సినంత ప్రాక్టీస్ దొరకనుంది.పక్కనపెట్టడంపై విమర్శలుఇక ‘ఎ’ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సర్ఫరాజ్ ఖాన్‌కు ప్రధాన జట్టులో స్థానం దక్కదనే స్పష్టంగానే తెలుస్తోంది. ఇటీవలే పదిహేడు కిలోల బరువు తగ్గడంతో పాటు రెడ్ బాల్ టోర్నీల్లో సెంచరీ చేసినా సెలక్టర్లు అతడిని ఇలా పక్కనపెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత షామా మొహమ్మద్ సంచలన ట్వీట్ చేశారు.ఇంటిపేరు వల్లే అతడిని ఎంపిక చేయలేదా?‘‘ఇంటిపేరు కారణంగానే సర్ఫరాజ్ ఖాన్ జట్టుకు ఎంపిక కాలేదా?.. ఊరికే అడుగుతున్నా అంతే!.. ఈ విషయంలో గౌతం గంభీర్ విధానాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే కదా!’’ అంటూ హెడ్‌కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతం గంభీర్‌ను షామా మొహమ్మద్ టార్గెట్ చేశారు.కరెక్ట్ కాదు మేడమ్..ఈ నేపథ్యంలో షామా ట్వీట్‌పై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. అయితే, మెజారిటీ మంది ఆమె ఆలోచనా విధానాన్ని తప్పుబడుతున్నారు. మొహమ్మద్ సిరాజ్ జట్టులోని ప్రధాన బౌలర్లలో ఒకడన్న విషయాన్ని మర్చిపోవద్దని హితవు పలుకుతున్నారు. ఆటలో ఇలాంటి రాజకీయాలకు తావు లేదని.. ఇలాంటి మాటలతో చిచ్చు పెట్టాలని చూడటం సరికాదని పేర్కొంటున్నారు.భారత క్రికెట్లో ఎప్పుడూ ఇలా జరుగలేదుఈ క్రమంలో టీమిండియా మాజీ పేసర్ అతుల్ వాసన్.. షామా మొహమ్మద్ వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా విషాదకరం. ఇలాంటి మాటలు వద్దు. సర్ఫరాజ్ ఖాన్ జట్టులో ఉండేందుకు అర్హుడు.అయితే, అతడికి రావాల్సినన్ని అవకాశాలు రావడం లేదన్న మాట వాస్తవమే. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు అర్థంలేనివి. భారత క్రికెట్లో ఎప్పుడూ ఇలా జరుగలేదు. అజర్ హయాంలోనూ కొందరు ఇలాంటి మాటలే మాట్లాడారు.కానీ ఇందులో మతపరమైన కోణం ఉంటుందని నేను అస్సలు అనుకోను. సర్ఫరాజ్ ప్రస్తుత ప్రదర్శనల ఆధారంగానే జట్టులోకి ఎంపిక కాలేడు. చాన్నాళ్లుగా మూడు ఫార్మాట్లలోనూ రాణిస్తున్న ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది.సర్ఫరాజ్‌కు తగినన్ని ఛాన్సులు రాలేదు.. కానీఅయితే, ఓ ప్లేయర్ ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన పక్కన పెట్టడం సరికాదు. సర్ఫరాజ్ ఖాన్‌కు తగినన్ని ఛాన్సులు రాలేదు. ఒకవేళ గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన రిషభ్ పంత్.. తర్వాత విఫలమైనా అతడిని పక్కనపెట్టడం జరగదు.జట్టు ప్రయోజనాల కోసం కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. వీటిని ఎవరూ మార్చలేరు’’ అని అతుల్ వాసన్ చెప్పుకొచ్చాడు. కాగా ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గతేడాది టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడి ఓ సెంచరీ, మూడు అర్థ శతకాల సాయంతో 371 పరుగులు చేశాడు. రోహిత్ లావుగా ఉన్నాడని..కాగా షామా మొహమ్మద్ గతంలోనూ రోహిత్ శర్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహిత్ లావుగా ఉన్నాడని.. అదృష్టం కొద్దీ కెప్టెన్ అయ్యాడే తప్ప అతడికి అంత సీన్ లేదని వ్యాఖ్యానించారు. కాగా భారత్‌కు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత రోహిత్ శర్మది.చదవండి: ఓపెనర్‌గానూ రోహిత్ శర్మపై వేటు!?.. గంభీర్, అగార్కర్ చర్య వైరల్ -
పంత్ కారణంగానే సర్ఫరాజ్ ఖాన్‌పై వేటు.. అసలు విషయమేంటి?
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో గాయపడి ఆటకు దూరమైన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) తిరిగి మైదానంలోకి అడుగు పెడుతున్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో అక్టోబరు 30 నుంచి నవంబర్ 9 వరకు జరిగే రెండు నాలుగు రోజుల (ఫస్ట్‌క్లాస్) అనధికారిక టెస్టు మ్యాచ్‌లలో తలపడే భారత ‘ఎ’ జట్టుకు పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.బెంగళూరు వేదికగా జరిగే ఈ రెండు మ్యాచ్‌ల కోసం రెండు వేర్వేరు జట్లను మంగళవారం సెలక్టర్లు ప్రకటించారు. అయితే, ఇందులో ముంబై స్టార్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan)కు చోటు దక్కలేదు. కాగా స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ను ఆడిస్తామని సెలక్టర్లు నమ్మకంగానే అతడికి చెప్పినట్లు సమాచారం.పదిహేడు కిలోల మేర బరువు తగ్గి..ఈ నేపథ్యంలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న వేళ సర్ఫరాజ్ ఖాన్ ఫిట్‌నెస్‌పై మరింతగా దృష్టి సారించాడు. ఏకంగా పదిహేడు కిలోల మేర బరువు తగ్గి స్లిమ్‌గా మారాడు. అయితే, సెలక్టర్లను మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టెస్టులకు ముందు జరిగే అనధికారిక టెస్టు సిరీస్‌కు సెలక్టర్లు సర్ఫరాజ్‌ను ఎంపిక చేయలేదు. ఇందుకు ప్రధాన కారణం అతడి బ్యాటింగ్ ఆర్డరే అని తెలుస్తోంది. సాధారణంగా ముంబై జట్టులో సర్ఫరాజ్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు.పంత్ రాకతోఅయితే, భారత- ‘ఎ’ జట్టు కెప్టెన్‌గా తిరిగి వచ్చిన పంత్ కూడా అదే స్థానంలో ఆడతాడన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ టాపార్డర్‌కు ప్రమోట్ అవుదామనుకున్నా.. ఓపెనర్లుగా ఆయుశ్ మాత్రే- నారాయణ్ జగదీశన్ వచ్చే అవకాశం ఉండగా.. వన్‌డౌన్‌లో వైస్ కెప్టెన్ సాయి సుదర్శన్ ఉండనే ఉన్నాడు.ఇక ఆ తర్వాతి స్థానం కోసం దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ పోటీపడుతున్నారు. ఇక మిడిలార్డర్లో ఐదో నంబర్లో పంత్ ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో సర్ఫరాజ్ బ్యాటింగ్ చేసే అవకాశం లేదు. ఇక టీమిండియాలోనూ ఆరో స్థానం నుంచి ఆల్‌రౌండర్లే ప్రధానంగా బ్యాటింగ్‌కు వస్తున్నారు.బ్యాటింగ్ ఆర్డర్ గురించి చర్చించాలిఇలాంటి సమీకరణల నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్‌కు ‘ఎ’ జట్టులోనూ చోటు కరువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతడి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఒకరు పీటీఐతో మాట్లాడుతూ..‘‘ముంబై మేనేజ్మెంట్తో సర్ఫరాజ్ ఖాన్ తన బ్యాటింగ్ ఆర్డర్ గురించి చర్చించాలి. లేదంటే.. సీనియర్ ప్లేయర్ అజింక్య రహానేతో మాట్లాడాలి. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కొత్త బంతిని ఎదుర్కునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.చాలానే ఆప్షన్లు ఉన్నాయివన్డౌన్లో నిలదొక్కుకుంటే భవిష్యత్తులోనైనా అవకాశాలు వస్తాయి. అలా కాకుండా ఐదు లేదంటే ఆరో స్థానంలో ఆడతానంటే సర్ఫరాజ్ కెరీర్ ప్రశ్నార్థకమే అవుతుంది. ఎందుకంటే.. ఐదో స్థానంలో పంత్‌తో పాటు.. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, నితీశ్ రెడ్డి రూపంలో మేనేజ్మెంట్కు చాలానే ఆప్షన్లు ఉన్నాయి.ఈ ముగ్గురు ఫిట్‌గా ఉండి.. సెలక్షన్‌కు అందుబాటులో ఉంటే సర్ఫరాజ్ ఖాన్‌కు మొండిచేయి తప్పదు. ఒకవేళ పంత్ గాయపడినా ధ్రువ్ జురెల్ ఐదు లేదంటే ఆరో స్థానంలో ఆడతాడు. కాబట్టి సర్ఫరాజ్ మూడో స్థానంలో ఆడటంపై దృష్టి పెడితే బాగుంటుంది’’ అని సదరు సెలక్టర్ అభిప్రాయపడ్డాడు.కాగా ముంబై తరఫున రంజీల్లో పరుగుల వరద పారించిన 28 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్.. గతేడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడి 371 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి.చదవండి: సౌతాఫ్రికాతో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రిషభ్ పంత్ -
పాపం సర్ఫరాజ్ ఖాన్.. ఎందుకిలా..?
త్వరలో స్వదేశంలో సౌతాఫ్రికా-ఏతో జరుగబోయే రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల కోసం రెండు వేర్వేరు భారత-ఏ జట్లను ఇవాళ (అక్టోబర్ 21) ప్రకటించారు. రెండు జట్లకు రిషబ్ పంత్ కెప్టెన్‌గా, సాయి సుదర్శన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడిన పంత్ ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, మొహమ్మద్ సిరాజ్ రెండో టెస్ట్ జట్టుకు మాత్రమే ఎంపికయ్యారు.కాగా, ఈ రెండు జట్లలో ఇన్ ఫామ్ ఆటగాళ్లు మహ్మద్ షమీ (Mohammed Shami), సర్ఫరాజ్ ఖాన్‌కు (Sarfaraz Khan) చోటు దక్కకపోవడం అందరికీ ఆశ్యర్యాన్ని కలిగించింది. షమీ గాయం నుంచి పూర్తిగా కోలుకొని తాజాగా ముగిసిన రంజీ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. వాస్తవానికి షమీ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులోనే చోటు ఆశించాడు. అయితే ఫిట్‌నెస్‌పై అప్డేట్ లేదన్న కారణం చెప్పి సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు సౌతాఫ్రికా-ఏతో సిరీస్‌కు కూడా షమీని ఎంపిక చేయకపోవడంతో సెలెక్టర్లపై విమర్శలు వస్తున్నాయి. ఫిట్‌గా ఉండి, ఫామ్‌లో ఉన్నా షమీని సౌతాఫ్రికా-ఏతో సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేయలేదని అభిమానులు నిలదీస్తున్నారు. మరోవైపు యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విషయంలోనూ సెలెక్టర్ల తీరుపై విమర్శలు వస్తున్నాయి. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో పాటు అంచనాలకు మించి బరువు తగ్గి, ఫామ్‌ను చాటుకున్న సర్ఫరాజ్ ఖాన్‌ను సౌతాఫ్రికా-ఏతో సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేయలేదని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. సర్ఫరాజ్ తాజాగా ముగిసిన రంజీ మ్యాచ్‌లో 74 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అంతకుముందు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆథ్వర్యంలో జరిగిన బుచ్చిబాబు టోర్నీలో వరుసగా రెండు సెంచరీలు చేశాడు. దీనికి ముందు భారత్-ఏ తరఫున కూడా సర్ఫరాజ్ సత్తా చాటాడు. ఇంగ్లండ్ పర్యటన తొలి మ్యాచ్‌లో 92 పరుగులు చేశాడు. ఇంత చేసినా సర్ఫరాజ్‌ను ఏ జట్టుకు కూడా ఎంపిక చేయకపోవడం విచారకరమని అభిమానులు అంటున్నారు. సర్ఫరాజ్, షమీ.. ఏం నేరం చేశారని వారికి అవకాశాలు ఇవ్వడం లేదని అభిమానులు సెలెక్టర్ల నిలదీస్తున్నారు.సౌతాఫ్రికా-ఏతో తొలి మ్యాచ్‌కు భారత జట్టు (అక్టోబరు 30- నవంబరు 2):రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ మాత్రే, నారాయణ్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్, ఆయుష్ బదోని, సారాంశ్ జైన్.సౌతాఫ్రికా-ఏతో రెండో మ్యాచ్‌కు భారత జట్టు (నవంబరు 6- నవంబరు 9):రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.చదవండి: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. కెప్టెన్ ఔట్ -
సౌతాఫ్రికాతో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రిషభ్ పంత్
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant)పునరాగమనం ఖరారైంది. గాయం నుంచి కోలుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టు (Ind A vs SA A)తో జరిగే నాలుగు రోజుల మ్యాచ్‌ల రెడ్‌బాల్ సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి అతడిని సారథిగా ఎంపిక చేసింది.కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో బిజీగా ఉన్న టీమిండియా.. నవంబరు 14 నుంచి స్వదేశంలో సౌతాఫ్రికాతో వరుస సిరీస్‌లు ఆడనుంది. సఫారీలతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది.ముందుగా నాలుగు రోజుల మ్యాచ్‌లు అయితే, అంతకంటే ముందే.. భారత్- సౌతాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య అక్టోబరు 30- నవంబరు 9 వరకు రెడ్‌బాల్ ఫార్మాట్లో నాలుగు రోజుల మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ జట్టుకు రిషభ్ పంత్ కెప్టెన్ కాగా.. టీమిండియా యువ ఆటగాడు సాయి సుదర్శన్‌కు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ దక్కింది.పంత్ సేనలోకి ఆ టీమిండియా స్టార్లు కూడాఇక సౌతాఫ్రికా- ‘ఎ’తో రెండో మ్యాచ్ నుంచి టీమిండియా స్టార్లు కేఎల్ రాహుల్, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ కూడా పంత్ సేనలో చేరనున్నారు. కాగా భారత్- సౌతాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరిగే ఈ రెడ్‌బాల్ సిరీస్‌కు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదిక. కాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా పంత్ కుడికాలికి గాయమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుదీర్ఘ విశ్రాంతి తర్వాత అతడు ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.సౌతాఫ్రికా- ‘ఎ’తో తొలి ఫోర్-డే మ్యాచ్‌కు భారత జట్టు (అక్టోబరు 30- నవంబరు 2):రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ మాత్రే, నారాయణ్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్, ఆయుష్ బదోని, సారాంశ్ జైన్.సౌతాఫ్రికా- ‘ఎ’తో రెండో ఫోర్-డే మ్యాచ్‌కు భారత జట్టు (నవంబరు 6- నవంబరు 9):రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టులో బవుమా దక్షిణాఫ్రికా రెగ్యులర్ టెస్టు కెప్టెన్ తెంబా బవుమా... టీమిండియా పర్యటన కోసం కసరత్తులు చేస్తున్నాడు. గాయం కారణంగా పాకిస్తాన్‌తో సిరీస్‌కు దూరమైన బవుమా... ఈ నెలాఖరులో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో పాటు భారత్‌కు రానున్నాడు. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే.నవంబర్ 14న ప్రారంభం కానున్న ఈ పర్యటన... డిసెంబర్ 19తో ముగియనుంది. దానికి ముందు ఇక్కడి పరిస్థితులపై అంచనా కోసం దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు... భారత ‘ఎ’ జట్టుతో రెండు అనధికారిక టెస్టులు ఆడనుంది. ఈ నెల 30న బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుండగా... నవంబర్ 6 నుంచి రెండో మ్యాచ్ జరుగుతుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో బవుమా... దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. దీంతో ఇక్కడి పరిస్థితులపై అవగహనకు రావొచ్చని దక్షిణాఫ్రికా జట్టు యాజమాన్యం భావిస్తోంది. అకెర్మన్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టులో బవుమాతో పాటు జుబేర్ హంజా, ప్రెనెలన్ సుబ్రాయన్ కూడా ఉన్నారు. చదవండి: IND vs AUS: 244 పరుగులు.. 83.84 స్ట్రైక్ రేటు! అడిలైడ్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లి


