indian airforse
-
జమ్ము కశ్మీర్లో భారత వైమానిక దళ విన్యాసం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని దాల్ సరస్స వద్ద భారత వైమాని దళం(ఐఏఎఫ్) 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' సందర్భంగా ఎయిర్ షో (వైమానిక విన్యాసం) నిర్వహించింది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 75వ స్వాతంత్య్ర దిన అమృతోత్సవ వేడుకల సందర్భంగా ఈ వైమానిక విన్యాసాన్ని నిర్వహిస్తోంది.ఈ విన్యాసాల కార్యక్రమాన్ని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. ‘మీ కలలకు రెక్కలు ఇవ్వండి’ అనే పేరుతో ఫోటో ఎగ్జిబిషన్‌ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ భారత వైమానిక చరిత్ర, ప్రాముఖ్యతను యువతకు తెలియజేసే విధంగా ఉంది. చదవండి: (ప్రైమ్‌వీడియోస్‌లో డిస్కవరీ ప్లస్ ఇంకా మరెన్నో..) భారత వైమానిక దళం పట్ల యువత ఆసక్తి కలిగించడంతోపాటు జాతీయభావం పట్ల స్ఫూర్తి కలిగించడమే ఉద్దేశ్యంగా ఈ 'ఎయిర్ షో'ను ప్రభుత్వం నిర్వహించింది. ఈ ప్రదర్శనలో రకరకాల వైమానిక విన్యాసాల తోపాటు స్కై డైవింగ్ కూడా నిర్వహించారు. (చదవండి: జైల్లో కరోనా కల్లోలం: 6 మంది పిల్లలతో సహా 39 మందికి పాజిటివ్) -
బాలాకోట్ నుంచి బిచాణా ఎత్తేశారు!
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలు ప్రస్తుతం అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లోకి మకాం మార్చాయి. పాక్‌లోని బాలాకోట్ ఉగ్ర శిక్షణ శిబిరంపై ఫిబ్రవరిలో భారత వైమానిక దళం దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల అనంతరం ఉగ్రసంస్థలు తమ మకాంను అఫ్గానిస్తాన్‌లోకి మార్చేశాయి. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా సంస్థలు కునార్, నంగర్హార్, నూరిస్తాన్, కాందహార్‌లలో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశాయి. దీంతో భారత నిఘా వర్గాలు కాబూల్, కాందహార్‌లలో ఉన్న దౌత్య కార్యాలయాలను అప్రమత్తం చేశాయి. అఫ్గాన్ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌తో చేతులు కలిపిన జైషే మొహమ్మద్, లష్కరే తోయిబాలు పాక్–అఫ్గాన్ సరిహద్దు డ్యూరాండ్ రేఖ వెంబడి శిక్షణ శిబిరాలను నెలకొల్పి, ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 14వ తేదీన కశ్మీర్‌లోని పుల్వామాలో జైషే మొహమ్మద్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా అదే నెలలో భారత వైమానిక దళం బాలాకోట్‌పై బాంబు దాడులు జరిపింది. అంతర్జాతీయ ఒత్తిడులకు లొంగిన పాక్ ప్రభుత్వం ఈ నెల మొదటి వారంలో లష్కరే తోయిబాకు చెందిన 15 మంది నేతలను అదుపులోకి తీసుకుంది. అయితే, ఇవన్నీ కంటి తుడుపు చర్యలేనని భారత్ అంటోంది. నిర్దిష్టమైన చర్యలతో ఉగ్రమూకలను కట్టడి చేయాలని కోరుతోంది. మరోవైపు, పాక్ ఉగ్ర సంస్థలకు దన్నుగా ఉంటోందంటూ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) సంస్థ ఆర్థిక సాయం నిలిపివేసింది. దీంతో ఆర్థికంగా కుంగిపోయిన పాక్‌పై ఒత్తిడి తీవ్రమైంది. ఈ నేపథ్యంలోనే ఉగ్ర సంస్థలు పాక్ నుంచి తమ మకాంను అఫ్గానిస్తాన్‌కు మార్చాయని భారత్ నిఘా వర్గాలు అంటున్నాయి. అయితే, ఈ పరిణామంతో అఫ్గాన్ రాజధాని కాబూల్‌తోపాటు కాందహార్‌లో ఉన్న భారత దౌత్య కార్యాలయాలకు ఉగ్ర ముప్పు పెరిగిందని హెచ్చరిస్తున్నాయి. జైషే మొహమ్మద్ ఉగ్రవాదులతోపాటు, పేలుడు పదార్థాలు అమర్చిన వాహనాలతో కాబూల్ ఎంబసీపై కారివరి గుల్ అనే ఉగ్ర సంస్థ దాడులకు దిగే ప్రమాదముందని అనుమానిస్తున్నాయి. కాందహార్‌లోని ఇండియస్ ఎంబసీపై తాలిబన్లు కూడా దాడులకు పాల్పడే ప్రమాదముందని అంటున్నాయి. తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌లు జైషే మొహమ్మద్ అధిపతి మసూద్ అజార్‌కు ఆశ్రయం కల్పించేందుకు ఫిబ్రవరిలో ముందుకు వచ్చినా పాక్‌లోని భావల్పూర్లో సైనిక రక్షణ మధ్య ఉండటమే శ్రేయస్కరమని అతడు ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. అంతేకాకుండా, కాబూల్, కాందహార్ల్లో ఉన్న భారత కార్యాలయాలపై ఈ ఉగ్ర సంస్థలు నిఘా వేసి ఉంచాయి. జనవరిలో సెదిక్ అక్బర్, అతావుల్లా అనే ఇద్దరు ఉగ్రవాదులను అఫ్గాన్ బలగాలు అదుపులోకి తీసుకుని, విచారించగా ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. అమెరికా బలగాలకు ముప్పు లష్కరే తోయిబా కూడా తన అనుచరులను నంగర్హార్, నూరిస్తాన్, కునార్, హెల్మండ్, కాందహార్ ప్రావిన్సుల్లోని శిక్షణ శిబిరాలకు తరలించింది. పెషావర్‌లో ఉన్న సభ్యుల మకాంను కాబూల్‌కు మార్చింది. తాలిబన్ సాయంతో విధ్వంసక, విద్రోహ చర్యలపై శిక్షణ ఇస్తోంది. మరోవైపు, అఫ్గానిస్తాన్‌లో ఉన్న 300 మంది జైషే మొహమ్మద్ ఉగ్రవాదులతో అమెరికా, సంకీర్ణ బలగాలకు ముప్పు ఉననట్లు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ కూడా తన నివేదికలో పేర్కొంది. తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖైబర్–పక్తున్వా మధ్య రాజీ కుదర్చడంలో జైషే మొహమ్మద్ పాత్ర ఉందని తెలిపింది. -
అంతుచిక్కని విమాన అదృశ్యం
గోపాలపట్నం ఇండియన్ఎయిర్ఫోర్సు ఏఎన్32 విమానం గల్లంతై నేటికి పద్దెనిమిది రోజులు కావస్తున్నా జాడ అంతుచిక్కడం లేదు. ఇప్పటికీ ఎన్ఏడీ ఉద్యోగుల కుటుంబాలకు రక్షణ శాఖ నుంచి సెర్చింగ్ ఆపరేషన్‌లో ఉన్నాం..అన్న వార్తలే వినిపిస్తున్నాయి. ఎన్ఏడీ ఉద్యోగులు బి.సాంబమూర్తి, భుపేంద్రసింగ్, పాటి నాగేంద్రరావు, ఆర్వీ ప్రసాద్‌బాబు, పూర్ణచంద్ర సేనాపతి,చరణ్మహరాణా, ఎన్.చిన్నారావు, గంట్ల శ్రీనివాసరావులతో తో పాటు 29మంది ఎయిర్‌ఫోర్సు, నేవీ, కోస్టుగార్డు ఉద్యోగులు ఈనెల 22న ఉదయం ఎయిర్‌ఫోర్సు విమానంతో గల్లంతయిన నేపధ్యంలో కేంద్ర రక్షణ శాఖ శక్తియుక్తులనూ ధారబోసి గాలింపులు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ విమాన అదృశ్యానికి సంబంధించిన ఆచూకీ లేకపోవడంతో ఆదివారం నుంచి రష్యాకు చెందిన సెర్చ్ అండ్ రిస్క్యూ షిప్‌ని రంగంలోకి దించుతారని సమాచారం. ప్రధానంగా గల్లంతయిన విమానం ఇండియన్ఎయిర్ఫోర్సుదయినా రష్యన్ నిర్మిత ఆధారితమే అయిన తరుణంలో దీనికి సబంధించిన సెర్ఛ్ ఆపరేషన్ని రష్యా షిప్ ద్వారా వీలుండవచ్చని రక్షణ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గాలింపులకు సంబంధించి కేంద్రరక్షణమంత్రి మనోహర్‌పారికర్ దీనిపై ప్రతేక్యక శ్రద్ధ కనబరుస్తున్నట్లు రక్షణ రంగ అధికారులు చెబుతున్నారు. గల్లంతయిన విమానం దిశ ఎటో ... రష్యన్ షిప్ శక్తి సామర్ధ్యాలపై కేంద్రం ఆశిస్తోంది. గత నెల 22న చెన్నై తాంబరం ఎయిర్ఫోర్సుస్టేషన్ నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్సు ఏఎన్ 32 విమానం బయలుదేరిన సమయం ఉదయం 8.30కి కాగా, ఎంతసేపట్లో రాడార్,శాటిలైట్ సిగ్నల్స్‌ని విమానం కోల్పోయిందో అంచనావేసి ఆదిశగా షిప్ గాలింపులు జరుగుతాయని తెలిసింది. అయితే గత పద్దెనిమిది రోజులుగా విమానం ఏమై ఉంటుంది...ఎక్కడ ఉండి ఉంటుందన్నది అంతుచిక్కడం లేదు. సంద్రంలో లేదా ఎక్కడో కొండకోనల్లో విమానం కూలిపోతే శకలాలు ఎక్కడోచోట కనిపించాలి. ఇలా జరిగిన దాఖలాలు ఇంత వరకూ కనిపించలేదని అధికారుల నుంచి ఎన్ఏడీ కుటుంబాలకు అందిన సమాచారం. గల్లంతయిన విమానానికి రెండు ఇంజన్లు ఉన్నట్లు సమాచారం. విమానానికి సాంకేతిక లోపం ఎదురయినా మరో ఇంజనుతో ప్రయాణించే వీలుంటుంది. ప్రత్యేకంగా సైనిక కార్గో అవసరాలకు వినియోగిస్తున్న ఈవిమానంలో యాభైమంది వరకూ ప్రయాణించే వీలుండగా, 7.5టన్నుల బరువు మోయగల శక్తి , గంటకు 530కిలోమీటర్ల ప్రయాణవేగం ఉంటుందని తెలిసింది. ఇంకా ఈవిమానంలో ఇంకో ప్రత్యేకత కూడా ఉన్నట్లు తెలుస్తోంది.. విమానంలో ఇంధనం అయిపోయినా నాలుగు గంటల పాటు ప్రయాణించే వీలుంటుందని సమాచారం. ఆరకంగా విమానం ఎటు వెళ్లిపోయిందో తెలియడం లేదు. ఇది ఆషామాషీ విమానం కాదు. అందులో ఉన్నది ఎన్ఏడీ ఉద్యోగులు ఎనిమిది మందయినా మిగతా ఉద్యోగులు నేవీ, ఎయిర్‌ఫోర్సు, కోస్టుగార్డు ఉద్యోగులు. వీరికి సాధారణ విమానాలు నడిపే వారితో పోల్చనేకూడదు. వీరిలో తెగువ, మానసిక ధర్యం, సంసిద్ధత, నైపుణ్యం వేరు. విమానం సిగ్నల్ తప్పిందని తెలిసినా అంతసులువుగా వదిలే సే పరిస్ధితి ఉండదు. సాధారణంగా విమానం దిగడానికి వీలు పడని నేపధ్యంలో సంద్రంపై వాలి తాత్కాలికంగా ప్రాణాలు నిలబెట్టుకునే అవకాశాలుంటాయి. ఆరకంగా సిగ్నల్ తప్పినా సంద్రంలో నీరుత ఆగయినా కొన్ని రోజులు గడిపేయొచ్చని కూడా కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఆరకంగా బతికొచ్చిన వారు కూడా లేకపోలేదు. బెర్ముడా ట్రయాంగిల్ లాంటిదేమయినా...? సరిగ్గా వందేళ్ల క్రితం నాటి పరిస్ధితులనూ పలురకాలుగా జనం ఊహిస్తున్నారు. పూర్వం రోజుల్లో అట్లాంటిక్ మహాసంద్రంలో ఓ భాగంపై నుంచి విమానాలు, షిప్లూ తిరుగుతుండేవి. హటాత్తుగా విమానాలు అదశ్యమవుతుండడం అప్పట్లో ఎవరికీ అంతుచిక్కలేదు. తర్వాత తర్వాత శాస్త్రవేత్తల పరిశోధలనతో ఇక్కడ ఎన్నో విమానాలు; షిప్లూ ఉన్నట్లు తేలింది. అక్కడి తీరంలో ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతం ట్రయాంగిల్ మాదిరిగా ఉండడంతో దీన్ని నోఫ్లయింగ్ జోన్‌గా ప్రపంచచిత్రపటంలో రౌండ్ చేశారు. మరి ఆరకమయిన ప్రమాదకరమయిన ఆకర్షణ శక్తి సంద్రంలో ఎక్కడయినా ఎందా అన్న ఊహాజనిత చర్చలు సాగుతున్నాయి.