అంతుచిక్కని విమాన అదృశ్యం
అంతుచిక్కని విమాన అదృశ్యం
Published Sat, Aug 6 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
గోపాలపట్నం
ఇండియన్‌ఎయిర్‌ఫోర్సు ఏఎన్32 విమానం గల్లంతై నేటికి పద్దెనిమిది రోజులు కావస్తున్నా జాడ అంతుచిక్కడం లేదు. ఇప్పటికీ ఎన్‌ఏడీ ఉద్యోగుల కుటుంబాలకు రక్షణ శాఖ నుంచి సెర్చింగ్ ఆపరేషన్‌లో ఉన్నాం..అన్న వార్తలే వినిపిస్తున్నాయి. ఎన్‌ఏడీ ఉద్యోగులు బి.సాంబమూర్తి, భుపేంద్రసింగ్, పాటి నాగేంద్రరావు, ఆర్‌వీ ప్రసాద్‌బాబు, పూర్ణచంద్ర సేనాపతి,చరణ్‌మహరాణా, ఎన్.చిన్నారావు, గంట్ల శ్రీనివాసరావులతో తో పాటు 29మంది ఎయిర్‌ఫోర్సు, నేవీ, కోస్టుగార్డు ఉద్యోగులు ఈనెల 22న ఉదయం ఎయిర్‌ఫోర్సు విమానంతో గల్లంతయిన నేపధ్యంలో కేంద్ర రక్షణ శాఖ శక్తియుక్తులనూ ధారబోసి గాలింపులు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ విమాన అదృశ్యానికి సంబంధించిన ఆచూకీ లేకపోవడంతో ఆదివారం నుంచి రష్యాకు చెందిన సెర్చ్ అండ్ రిస్క్యూ షిప్‌ని రంగంలోకి దించుతారని సమాచారం. ప్రధానంగా గల్లంతయిన విమానం ఇండియన్‌ఎయిర్‌ఫోర్సుదయినా రష్యన్ నిర్మిత ఆధారితమే అయిన తరుణంలో దీనికి సబంధించిన సెర్ఛ్ ఆపరేషన్‌ని రష్యా షిప్ ద్వారా వీలుండవచ్చని రక్షణ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గాలింపులకు సంబంధించి కేంద్రరక్షణమంత్రి మనోహర్‌పారికర్ దీనిపై ప్రతేక్యక శ్రద్ధ కనబరుస్తున్నట్లు రక్షణ రంగ అధికారులు చెబుతున్నారు.
గల్లంతయిన విమానం దిశ ఎటో ...
రష్యన్ షిప్ శక్తి సామర్ధ్యాలపై కేంద్రం ఆశిస్తోంది. గత నెల 22న చెన్నై తాంబరం ఎయిర్‌ఫోర్సుస్టేషన్ నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్సు ఏఎన్ 32 విమానం బయలుదేరిన సమయం ఉదయం 8.30కి కాగా, ఎంతసేపట్లో రాడార్,శాటిలైట్ సిగ్నల్స్‌ని విమానం కోల్పోయిందో అంచనావేసి ఆదిశగా షిప్ గాలింపులు జరుగుతాయని తెలిసింది. అయితే గత పద్దెనిమిది రోజులుగా విమానం ఏమై ఉంటుంది...ఎక్కడ ఉండి ఉంటుందన్నది అంతుచిక్కడం లేదు. సంద్రంలో లేదా ఎక్కడో కొండకోనల్లో విమానం కూలిపోతే శకలాలు ఎక్కడోచోట కనిపించాలి. ఇలా జరిగిన దాఖలాలు ఇంత వరకూ కనిపించలేదని అధికారుల నుంచి ఎన్‌ఏడీ కుటుంబాలకు అందిన సమాచారం. గల్లంతయిన విమానానికి రెండు ఇంజన్లు ఉన్నట్లు సమాచారం. విమానానికి సాంకేతిక లోపం ఎదురయినా మరో ఇంజనుతో ప్రయాణించే వీలుంటుంది. ప్రత్యేకంగా సైనిక కార్గో అవసరాలకు వినియోగిస్తున్న ఈవిమానంలో యాభైమంది వరకూ ప్రయాణించే వీలుండగా, 7.5టన్నుల బరువు మోయగల శక్తి , గంటకు 530కిలోమీటర్ల ప్రయాణవేగం ఉంటుందని తెలిసింది. ఇంకా ఈవిమానంలో ఇంకో ప్రత్యేకత కూడా ఉన్నట్లు తెలుస్తోంది.. విమానంలో ఇంధనం అయిపోయినా నాలుగు గంటల పాటు ప్రయాణించే వీలుంటుందని సమాచారం. ఆరకంగా విమానం ఎటు వెళ్లిపోయిందో తెలియడం లేదు.
ఇది ఆషామాషీ విమానం కాదు. అందులో ఉన్నది ఎన్‌ఏడీ ఉద్యోగులు ఎనిమిది మందయినా మిగతా ఉద్యోగులు నేవీ, ఎయిర్‌ఫోర్సు, కోస్టుగార్డు ఉద్యోగులు. వీరికి సాధారణ విమానాలు నడిపే వారితో పోల్చనేకూడదు. వీరిలో తెగువ, మానసిక ధర్యం, సంసిద్ధత, నైపుణ్యం వేరు. విమానం సిగ్నల్ తప్పిందని తెలిసినా అంతసులువుగా వదిలే సే పరిస్ధితి ఉండదు. సాధారణంగా విమానం దిగడానికి వీలు పడని నేపధ్యంలో సంద్రంపై వాలి తాత్కాలికంగా ప్రాణాలు నిలబెట్టుకునే అవకాశాలుంటాయి. ఆరకంగా సిగ్నల్ తప్పినా సంద్రంలో నీరుత ఆగయినా కొన్ని రోజులు గడిపేయొచ్చని కూడా కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఆరకంగా బతికొచ్చిన వారు కూడా లేకపోలేదు.
బెర్ముడా ట్రయాంగిల్ లాంటిదేమయినా...?
సరిగ్గా వందేళ్ల క్రితం నాటి పరిస్ధితులనూ పలురకాలుగా జనం ఊహిస్తున్నారు. పూర్వం రోజుల్లో అట్లాంటిక్ మహాసంద్రంలో ఓ భాగంపై నుంచి విమానాలు, షిప్‌లూ తిరుగుతుండేవి. హటాత్తుగా విమానాలు అదశ్యమవుతుండడం అప్పట్లో ఎవరికీ అంతుచిక్కలేదు. తర్వాత తర్వాత శాస్త్రవేత్తల పరిశోధలనతో ఇక్కడ ఎన్నో విమానాలు; షిప్‌లూ ఉన్నట్లు తేలింది. అక్కడి తీరంలో ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతం ట్రయాంగిల్ మాదిరిగా ఉండడంతో దీన్ని నోఫ్లయింగ్ జోన్‌గా ప్రపంచచిత్రపటంలో రౌండ్ చేశారు. మరి ఆరకమయిన ప్రమాదకరమయిన ఆకర్షణ శక్తి సంద్రంలో ఎక్కడయినా ఎందా అన్న ఊహాజనిత చర్చలు సాగుతున్నాయి.
Advertisement