AN-32
-
శకలాలు ఏఎన్ 32వేనా?
జీఎస్ఐ శాస్త్రవేత్తల సాయంతో సాగర్ నిధి పరిశోధన గాలింపులో శకలాలు లభ్యం... లేబొరేటరీకి తరలింపు విశాఖపట్నం : నేషనల్ జియోలాజికల్ సర్వే శాస్త్రవేత్తల సహకారంతో సాగర్ నిధి (ఓషన్ టెక్నాలజీ షిప్) సముద్ర గర్భంలో చేపట్టిన శోధనలో విమాన శకలాలు దొరికాయి. అయితే ఇవి ఇండియన్ ఎయిర్‌ఫోర్సు ఏఎన్ 32వేనా... కాదా అన్నది తేలాల్సి వుంది. ఎన్ఏడీ ఉద్యోగులు బి.సాంబమూర్తి, భూపేంద్రసింగ్, పాటి నాగేంద్రరావు, ఆర్వీ ప్రసాద్‌బాబు, పూర్ణచంద్ర సేనాపతి,చరణ్ మహరాణా, ఎన్.చిన్నారావు, గంట్ల శ్రీనివాసరావులతోపాటు 29మంది ఎయిర్‌ఫోర్సు, నేవీ, కోస్టుగార్డు ఉద్యోగులు గత నెల 22న ఉదయం ఎయిర్‌ఫోర్సు విమానంతో గల్లంతయిన నేపథ్యంలో రక్షణ శాఖ గాలింపు జరుపుతున్న సంగతి తెలిసిందే. షిప్పులు, సబ్మెరైన్లు, నేవీ హెలికాప్టర్లు, కోస్టుగార్డు, ఎయిర్‌ఫోర్సు దళాలు ఇందులో పాల్గొన్నాయి. రష్యన్ సెర్చ్ అండ్ రిస్క్యూ షిప్‌ని కూడా రంగంలోకి దించడం తెలిసిందే. ఈ చర్యల్లో భాగంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) శాస్త్రవేత్తల సహకారంతో సాగర్ నిధి నౌక ఇన్సాల్ కెమెరా ద్వారా శోధించింది. చెన్నైకి 280 నాటికన్ మైళ్ల దూరంలో సంద్రమంతా జల్లెడపడితే కొన్ని విమాన శకలాలు లభించినట్లు తెలిసింది. లభ్యమయిన శకలాలు ఇండియన్ ఎయిర్‌ఫోర్సు విమానం ఏఎన్ 32వేనా... కాదా నిర్ధారించేందుకు ఎయిర్‌క్రాఫ్ట్ లేబొరేటరీకి తరలించినట్లు సమాచారం. ఎన్ఏడీ ఉద్యోగుల కుటుంబాల్లో ఉత్కంఠ సంద్రంలో విమాన శకలాలు లభ్యమయ్యాయన్న సమాచారంతో ఎన్ఏడీ ఉద్యోగుల కుటుంబాల్లో ఆందోళన, ఉత్కంఠ పెరిగింది. ఉద్యోగుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పడానికి ఇపుడు అధికారులకు, యూనియన్ నేతలకు అంతుచిక్కడం లేదు. వారు ఏమయ్యారని కుటుంబాలు ప్రశ్నిస్తుంటే.. ఏం చెప్పాలో వారికి తెలీడం లేదు. ఎందరెందరో పెద్దలు వచ్చారు.. వారు తమవారిని కాపాడకపోతారా అన్న అంతులేని ఆశలతో గల్లంతైనవారి కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. శకలాల లభ్యంపై సోమవారం ఎన్ఏడీ సీజీఎంతో యూనియన్ నేతలు చర్చించారు. -
అంతుచిక్కని విమాన అదృశ్యం
గోపాలపట్నం ఇండియన్ఎయిర్ఫోర్సు ఏఎన్32 విమానం గల్లంతై నేటికి పద్దెనిమిది రోజులు కావస్తున్నా జాడ అంతుచిక్కడం లేదు. ఇప్పటికీ ఎన్ఏడీ ఉద్యోగుల కుటుంబాలకు రక్షణ శాఖ నుంచి సెర్చింగ్ ఆపరేషన్‌లో ఉన్నాం..అన్న వార్తలే వినిపిస్తున్నాయి. ఎన్ఏడీ ఉద్యోగులు బి.సాంబమూర్తి, భుపేంద్రసింగ్, పాటి నాగేంద్రరావు, ఆర్వీ ప్రసాద్‌బాబు, పూర్ణచంద్ర సేనాపతి,చరణ్మహరాణా, ఎన్.చిన్నారావు, గంట్ల శ్రీనివాసరావులతో తో పాటు 29మంది ఎయిర్‌ఫోర్సు, నేవీ, కోస్టుగార్డు ఉద్యోగులు ఈనెల 22న ఉదయం ఎయిర్‌ఫోర్సు విమానంతో గల్లంతయిన నేపధ్యంలో కేంద్ర రక్షణ శాఖ శక్తియుక్తులనూ ధారబోసి గాలింపులు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ విమాన అదృశ్యానికి సంబంధించిన ఆచూకీ లేకపోవడంతో ఆదివారం నుంచి రష్యాకు చెందిన సెర్చ్ అండ్ రిస్క్యూ షిప్‌ని రంగంలోకి దించుతారని సమాచారం. ప్రధానంగా గల్లంతయిన విమానం ఇండియన్ఎయిర్ఫోర్సుదయినా రష్యన్ నిర్మిత ఆధారితమే అయిన తరుణంలో దీనికి సబంధించిన సెర్ఛ్ ఆపరేషన్ని రష్యా షిప్ ద్వారా వీలుండవచ్చని రక్షణ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గాలింపులకు సంబంధించి కేంద్రరక్షణమంత్రి మనోహర్‌పారికర్ దీనిపై ప్రతేక్యక శ్రద్ధ కనబరుస్తున్నట్లు రక్షణ రంగ అధికారులు చెబుతున్నారు. గల్లంతయిన విమానం దిశ ఎటో ... రష్యన్ షిప్ శక్తి సామర్ధ్యాలపై కేంద్రం ఆశిస్తోంది. గత నెల 22న చెన్నై తాంబరం ఎయిర్ఫోర్సుస్టేషన్ నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్సు ఏఎన్ 32 విమానం బయలుదేరిన సమయం ఉదయం 8.30కి కాగా, ఎంతసేపట్లో రాడార్,శాటిలైట్ సిగ్నల్స్‌ని విమానం కోల్పోయిందో అంచనావేసి ఆదిశగా షిప్ గాలింపులు జరుగుతాయని తెలిసింది. అయితే గత పద్దెనిమిది రోజులుగా విమానం ఏమై ఉంటుంది...ఎక్కడ ఉండి ఉంటుందన్నది అంతుచిక్కడం లేదు. సంద్రంలో లేదా ఎక్కడో కొండకోనల్లో విమానం కూలిపోతే శకలాలు ఎక్కడోచోట కనిపించాలి. ఇలా జరిగిన దాఖలాలు ఇంత వరకూ కనిపించలేదని అధికారుల నుంచి ఎన్ఏడీ కుటుంబాలకు అందిన సమాచారం. గల్లంతయిన విమానానికి రెండు ఇంజన్లు ఉన్నట్లు సమాచారం. విమానానికి సాంకేతిక లోపం ఎదురయినా మరో ఇంజనుతో ప్రయాణించే వీలుంటుంది. ప్రత్యేకంగా సైనిక కార్గో అవసరాలకు వినియోగిస్తున్న ఈవిమానంలో యాభైమంది వరకూ ప్రయాణించే వీలుండగా, 7.5టన్నుల బరువు మోయగల శక్తి , గంటకు 530కిలోమీటర్ల ప్రయాణవేగం ఉంటుందని తెలిసింది. ఇంకా ఈవిమానంలో ఇంకో ప్రత్యేకత కూడా ఉన్నట్లు తెలుస్తోంది.. విమానంలో ఇంధనం అయిపోయినా నాలుగు గంటల పాటు ప్రయాణించే వీలుంటుందని సమాచారం. ఆరకంగా విమానం ఎటు వెళ్లిపోయిందో తెలియడం లేదు. ఇది ఆషామాషీ విమానం కాదు. అందులో ఉన్నది ఎన్ఏడీ ఉద్యోగులు ఎనిమిది మందయినా మిగతా ఉద్యోగులు నేవీ, ఎయిర్‌ఫోర్సు, కోస్టుగార్డు ఉద్యోగులు. వీరికి సాధారణ విమానాలు నడిపే వారితో పోల్చనేకూడదు. వీరిలో తెగువ, మానసిక ధర్యం, సంసిద్ధత, నైపుణ్యం వేరు. విమానం సిగ్నల్ తప్పిందని తెలిసినా అంతసులువుగా వదిలే సే పరిస్ధితి ఉండదు. సాధారణంగా విమానం దిగడానికి వీలు పడని నేపధ్యంలో సంద్రంపై వాలి తాత్కాలికంగా ప్రాణాలు నిలబెట్టుకునే అవకాశాలుంటాయి. ఆరకంగా సిగ్నల్ తప్పినా సంద్రంలో నీరుత ఆగయినా కొన్ని రోజులు గడిపేయొచ్చని కూడా కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఆరకంగా బతికొచ్చిన వారు కూడా లేకపోలేదు. బెర్ముడా ట్రయాంగిల్ లాంటిదేమయినా...? సరిగ్గా వందేళ్ల క్రితం నాటి పరిస్ధితులనూ పలురకాలుగా జనం ఊహిస్తున్నారు. పూర్వం రోజుల్లో అట్లాంటిక్ మహాసంద్రంలో ఓ భాగంపై నుంచి విమానాలు, షిప్లూ తిరుగుతుండేవి. హటాత్తుగా విమానాలు అదశ్యమవుతుండడం అప్పట్లో ఎవరికీ అంతుచిక్కలేదు. తర్వాత తర్వాత శాస్త్రవేత్తల పరిశోధలనతో ఇక్కడ ఎన్నో విమానాలు; షిప్లూ ఉన్నట్లు తేలింది. అక్కడి తీరంలో ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతం ట్రయాంగిల్ మాదిరిగా ఉండడంతో దీన్ని నోఫ్లయింగ్ జోన్‌గా ప్రపంచచిత్రపటంలో రౌండ్ చేశారు. మరి ఆరకమయిన ప్రమాదకరమయిన ఆకర్షణ శక్తి సంద్రంలో ఎక్కడయినా ఎందా అన్న ఊహాజనిత చర్చలు సాగుతున్నాయి. -
ఇంతకీ ఏమైన్నట్లు?
రేపటికి అండమాన్ చేరి, ఆచూకీ కోసం గాలింపు ఎయిర్‌ఫోర్స్ 32 విమానం ఆచూకీ తెలిసేనా? గోపాలపట్నం : ఎన్ఏడీ ఉద్యోగులతో గల్లంతైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఏఎన్ 32 విమానం కోసం దేశరక్షణ వ్యవస్థ ఎన్ని రకాలుగా శోదిస్తున్నా.. ఉపయోగం లేకపోవడంతో కేంద్రం రష్యా సహకారం తీసుకుంది. ఇప్పటికే రష్యన్ సెర్చ్ అండ్ రిస్క్యూ షిప్‌ని రప్పించినట్లు సమాచారం. ఇది అత్యంత శక్తిసామర్థ్యం గల షిప్. 3.5 కిలోమీటర్ల లోతుకు మించి సంద్రంలో రేడియేషన్ అందుకో గల యంత్రాంగం దీనికి ఉంది. ప్రధానంగా విమానం బ్లాక్ బాక్స్ నుంచి ఎలాంటి రేడియేషన్ సిగ్నల్స్ అందకపోవడంతో ఎట్టి పరిస్థితిలోనూ దీన్ని శోదించి తీరాలని కేంద్రం ప్రయత్నాలు సాగిస్తోంది. ఇంతకీ ఏమైన్నట్లు? నిజానికి సంద్రంలో ఎలాంటి ఆయుధాలు పడిపోయినా గాలించగల యంత్రాంగం మన దేశ రక్షణ రంగ వ్యవస్థ వద్ద ఉంది. దేశ భద్రతకు సంబంధించి ఆయుధ ప్రయోగాలు సంద్రంలో జరిపినా.. శకలాలు ఎక్కడున్నాయో గుర్తించే నైపుణ్యం అపారంగా ఉంది. దేశభద్రతా బలగాలన్నీ సంద్రమంతా జల్లెడపట్టినా ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో అధికారులకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇంతకీ ఏమైన్నట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నెన్నో వదంతులు ఎంతగా శోదిస్తున్నా 16 రోజులుగా విమానం కనిపించకపోవడంతో ఎన్నో వదంతులు, ఊహాగానాలు ప్రచారంలో కొస్తున్నాయి. సంద్రంలో సబ్‌మెరైన్, షిప్‌లు, నేవీ విమానాలు, కోస్టుగార్డు విమానాలు, ఎయిర్‌ఫోర్సు విమానాలు విపరీతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. బ్లాక్‌బాక్స్ రేడియేషన్ అందుకోగల శక్తి సామర్థ్యాలున్న షిప్‌లు, విమానాలతోనూ శాటిలైట్, రాడార్ ప్రయోగాలు చేశారు. ఇస్రోకు సంబంధించిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నిపుణులు సహకారాన్ని తీసుకున్నారు. అయినా ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఊహాజనిత వార్తలు వెలువడుతున్నాయి. ఈ అదృశ్యం వెనుక గ్రహాంతర వాసుల(ఫ్లైయింగ్ సాసర్స్) హస్తమేమైనా? ఉందా అన్న ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మనుషుల్లాంటి మనుషులు... మనుషుల కన్నా శక్తివంతమైన గ్రహాంతరవాసులు విశ్వంలో ఓ గ్రహంలో తిరుగుతున్నట్లు, భూమ్మీదకు వచ్చి పోతున్నట్లు కూడా వార్తలు, ప్రచారాలూ వెలువడుతున్న తరుణంలో భూమ్మీదే కాక సంద్రంలోనూ విహరిస్తున్నారా? అన్న ఊహలు కూడా వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో వందలసార్లు గ్రహాంతరవాసులు రహస్యంగా సంచరించినట్లు కథనాలు వెలువడ్డ నేపథ్యంలో ఇక్కడా అలాంటి ఆశ్చర్యకర పరిణామాలేమైనా జరుగుతున్నాయా? అని అనుమానాలు తలెత్తుతున్నాయి. దయనీయంగా కుటుంబాలు విమానంలో వెళ్లిన వారు ఏమయ్యారో.. ఎక్కడున్నారో ఎలా ఉన్నారో... తెలియక పదహారు రోజులుగా తల్లడిల్లుతున్న ఎన్ఏడీ ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. తిండి సహించక, నిద్రపట్టక ఒక్కొక్కరూ అనారోగ్యాల పాలవుతున్నారు. వారి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. ఉద్యోగుల భార్యలు నీరసంతో ఆసుపత్రిల్లో చేరుతున్నారు. దేవుడా ఏంటీ మాకీ పరీక్ష... ఎందుకిలా చేస్తున్నావ్... అంటూ ఉద్యోగుల భార్యలు విలపిస్తున్న తీరు చూస్తే కళ్లు చెమరుస్తున్నాయి. ఉద్యోగుల కుటుంబాలకు ఒక నెల వేతనం ఎన్ఏడీ యాజమాన్యం గత నెల వేతనం ఎన్ఏడీ ఉద్యోగుల కుటుంబాలకు అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే సూపర్వైజర్ క్యాడరులో ఉన్న సాంబమూర్తి కుటుంబానికి వేతనం స్వయంగా అందించారు. ఈనెల 7న మిగతా కుటుంబాలకు వేతనం అందించనున్నారు. అలాగే గల్లంతైన ఉద్యోగుల కుటుంబాల కోసం ఎన్ఏడీలో ఉన్న 1200 మంది ఉద్యోగుల ఒక రోజు వేతనం ఇవ్వడానికి టీఎన్టీయూసీ, ఐఎన్టీయూసీ యూనియన్లు తీర్మానించినట్లు ఎన్టీయూసీ అధ్యక్షుడు డి.ఎ.వి.ఎస్.రాజు తెలిపారు. -
ఆపరేషన్ తలాష్
విమానం గాలింపులో రోబోలు ఏడురోజులైనా దొరకని ఆచూకీ సాక్షి ప్రతినిధి, చెన్నై: ఈనెల 22న గల్లంతైన భారత వైమానిక దళానికి చెందిన విమానం ఏఎన్-32 ఆచూకీపై కొనసాగుతున్న వివిధ శాఖల సమష్టి కృషికి ఆపరేషన్ తలాష్ అని నామకరణం చేశారు. జాతీయ సముద్ర సాంకేతిక పరిశోధనా సంస్థకు చెందిన చక్రనిధి అనే నౌక ద్వారా అత్యాధునిక రోబోలను గురువారం నుంచి గాలింపు పనుల్లో ప్రవేశపెట్టనున్నారు. అత్యాధునికమైన ఈ నౌకకు అమర్చే రోబోలు నడిసముద్రంలో ఎంతటి లోతులో ఉన్న వస్తువులనైనా గుర్తించగలవు. మారిషస్ దీవుల్లో ఉన్న ఈ నౌకను చెన్నైకి రప్పిస్తున్నారు. ఈ నౌక కు అత్యాధునిక రోబోలను అమర్చి నడిసముద్రంలోని లోతుల్లో గాలింపు చర్యలు చేపడతామని చెబుతున్నారు. గజ ఈతగాళ్లు ఎంతటి మాస్క్‌లు, యంత్రాలు వినియోగించినా 120 అడుగుల కంటే లోతుకు వెళ్లడం ప్రాణాలకే ప్రమాదం. బంగాళాఖాతంపై ఎగురుతున్నప్పుడే విమానం ప్రమాదానికి లోనై ఉంటుంది, విమాన వేగానికి సుమారు 13 వేల అడుగుల లోతుల్లోని ఇసుకలో కూరుకు పోయి ఉండవచ్చని భావిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విమానాన్ని కనుగొనడం అంత సులువు కాదని అభిప్రాయపడుతున్నారు. అందుకే చక్రనిధి నౌకకు అడుగుభాగంలో అత్యాధునికమైన రోబోలను అమర్చి గాలింపు చేపడుతున్నట్లు చెప్పారు. ఈరోబోలకు పొడవైన కేబుల్ ద్వారా అత్యధిక వెలుతురు నిచ్చే లైటు, కెమెరా అమర్చి ఉంటుందని తెలిపారు. ఈ రోబోలను సముద్రపు అడుగుభాగం వరకు పంపి విమానం కోసం వెతుకుతామని చెప్పారు. రోబోల ప్రవేశం వల్ల కూలిపోయిన విమానం ఆచూకీ లభిస్తుందని నమ్ముతున్నామన్నారు. గత ఏడాది కూలిపోయిన కోస్ట్‌గార్డ్ విమానం శకలాలను సైతం ఈ రోబోల ద్వారానే గుర్తించినట్లు తెలిపారు. ఈ రోబో సేవలు గురువారం నుంచి వినియోగించే అవకాశం ఉందని వివరించారు. -
గమ్యం చేరని ప్రయాణాలు..
చెన్నై నుంచి 29 మంది రక్షణ సిబ్బందితో పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన భారత వాయుసేన విమానం(ఏఎన్-32) శుక్రవారం గల్లంతైంది. ఈ విమానంలో వాయుసేన సిబ్బందితో పాటు విశాఖపట్నానికి చెందిన వారు 8 మంది ఉన్నారు. దీని ఆచూకీ కోసం వైమానిక దళం, నౌకాదళం, కోస్ట్‌గార్డ్‌లు భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. గతంలో చాలా విమానాలు కూడా ఆచూకీ తెలియకుండా గల్లంతయ్యాయి. భువి నుంచి బయలుదేరి గమ్యం చేరకుండా మిస్టరీగా మిగిలిపోయిన అలాంటి కొన్ని లోహవిహంగాల వివరాలు.. అమీలియా ఇయర్హార్ట్... 1937లో విమానంలో భూగోళాన్ని చుట్టేయాలని బయలుదేరిన అమెరికన్ వనిత అమీలియా ఇయర్హార్ట్ తన విమానంతోపాటు గల్లంతైంది. మధ్య పసఫిక్ మహాసముద్రంలోని హౌలాండ్ ద్వీపం పరిసరాల్లో కనిపించకుండా పోయిన అమీలియా వివరాలు ఇప్పటికీ తెలియదు. అయితే ఇటీవలి కాలంలో నికుమరారో అనే నిర్మానుష్య ద్వీపం సమీపంలో అమీలియా నడిపిన లాక్‌హీడ్ ఎలెక్ట్రా విమానం తాలూకూ ఆనవాళ్లను గుర్తించారు. కచ్చితంగా తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకో విషయం... అమీలియా 119వ జన్మదినం జూలై 24 కావడం యాదృచ్ఛికమే అవుతుంది! ఫ్లయింగ్ టైగర్ లైన్ ప్లయిట్ 739 దాదాపు 96 మంది అమెరికన్ సైనికులతో గల్లంతైన విమానం ఈ ఫ్లయింగ్ టైగర్ లైన్ ఫ్లయిట్ 739. 1962లో కాలిఫోర్నియా నుంచి వియత్నాంలోని సైగాన్కు బయలుదేరిన ఈ విమానం ఇంధనం నింపుకునేందుకు గామ్‌లో దిగింది కూడా. ఆ తరువాత 80 నిమిషాల తరువాత పిలిప్పీన్స్ చేరేలోపు కనిపించకుండా పోయింది. దాదాపు రెండులక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలో విసృ్తతమైన గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ దీని జాడ తెలియరాలేదు. బోయింగ్ 727 సుమారు 13 ఏళ్ల క్రితం అంటే 2003లో అంగోలాలోని ఫీవరీరో విమానాశ్రయంలో రన్‌వేపై ఉన్న ఓ విమానం చోరీకి గురైంది. ఎలాంటి అనుమతుల్లేకుండా గుర్తుతెలియని వ్యక్తులు ఆ విమానాన్ని టేకాఫ్ చేసి తీసుకెళ్లారు. చిత్రమైన విషయమేమిటంటే.. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ విమానం ఏమైందన్నది ఎవరికీ తెలియదు. బెన్ ఛార్లెస్ పడిల్లా అనే పెలైట్ ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చునని అనుకుంటున్నా... అతడి ఆనవాళ్లు కూడా తెలియకపోవడం మరో మిస్టరీగా మిగిలిపోయింది. స్టార్ టైగర్, స్టార్ ఏరియల్.. బెర్ముడా ట్రయాంగిల్లో గల్లంతైన మరో రెండు విమానాల కథ ఇది. 1948 జూన్ 30న స్టార్ టైగర్ ఆవ్రో ట్యూడర్ విమానం సాంటామారియా - బెర్ముడా మార్గమధ్యంలో కనిపించకుండా పోయింది. అనానుకూల వాతావరణంలో చిక్కుకుని కూలిపోయి ఉండవచ్చునని అంచనాలున్నప్పటికీ శకలాలేవీ దొరక్కపోవడం మిస్టరీగా మిగిలిపోయింది. 1949 జనవరి 17న స్టార్ ఏరియల్ బెర్ముడా - జమైకా మర్గమధ్యంలో గల్లంతైంది. చిట్టచివరి రేడియో సందేశంలో వాతావరణం బాగుందని, ప్రయానం సాఫీగా జరుగుతోందని సమాచారం ఉంది. ఆ తరువాత కొద్దిసేపటికే ఇది జాడ లేకుండా పోయింది. ఈ రెండు సంఘటనల తరువాత ఆవ్రో సంస్థ ట్యూడర్ -4 రకం విమానాల ఉత్పత్తిని నిలిపివేయడం గమనార్హం. ఫ్లయిట్ 19.. బెర్ముడా ట్రయాంగిల్లో 1945 డిసెంబరు 5వ తేదీన ఒకేసారి ఐదు విమానాలు గల్లంతయ్యాయి. ఇవన్నీ టీబీఎం అవెంజర్ టర్పెడో బాంబర్లు ఇప్పటివరకూ ఈ విమానాల తాలూకూ శకలాలుగానీ... అందులోని 14 మంది సిబ్బంది ఆనవాళ్లుగానీ కనిపించలేదు. అందుబాటులో ఉన్న రేడియో సమాచారాన్నిబట్టి చూస్తే ఈ విమానాలు ముందుగా నిర్దేశించిన మార్గంలో కాకుండా దారితప్పి అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయాయి. -
రంగంలోకి దిగిన పి-8ఐ విమానం