Indian American girl
-
ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా భారతీయ చిన్నారి
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థుల్లో ఒకరిగా 11 ఏళ్ల వయసున్న ఇండియన్ అమెరికన్ నటాషా పేరి ఎంపికైంది. స్కాలస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ (శాట్), అమెరికన్ కాలేజీ టెస్టింగ్(యాక్ట్)లలో అసమాన ప్రతిభ చూపించినందుకు అమెరికాలోని న్యూజెర్సీ విశ్వవిద్యాలయం నటాషా పేరిని అత్యంత తెలివైన చిన్నారిగా గుర్తించి గౌరవించింది. అమెరికాలో ఎన్నో కాలేజీల్లో అడ్మిషన్ల కోసం శాట్, యాక్ట్ పరీక్షల్లో వచ్చే స్కోర్‌నే కొలమానంగా తీసుకుంటాయి. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ (సీటీవై) సెర్చ్‌లో భాగంగా నిర్వహించిన శాట్, యాక్ట్ పరీక్షల్లో నటాషా అత్యుద్భుతమైన ప్రతిభ కనబరిచింది. న్యూజెర్సీలోని ఒక ఎలిమెంటరీ స్కూలులో నటాషా చదువుకుంటోంది. సీటీవై నిర్వహించిన పరీక్షల్లో ప్రపంచవ్యాప్తంగా 84 దేశాలకు చెందిన 19 వేల మంది పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ సీజన్లో పరీక్షలు నిర్వహించి అత్యంత తెలివైన విద్యార్థుల్ని ఈ సంస్థ ఎంపిక చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం స్ప్రింగ్ సీజన్లో పరీక్షలు రాసిన గ్రేడ్-5కి చెందిన నటాషా తన వయసుకి మించిన ప్రతిభను ప్రదర్శించి గ్రేడ్-8 వారితో సమానంగా స్కోరు సాధించింది. దీంతో జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ హై ఆనర్స్ అవార్డుకి ఎంపికైంది. ఇందులో విజయం సాధించడం తనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందన్న నటాషా పేరి తాను ఇంకా ఎంతో సాధిస్తానన్న ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. -
ఐదేళ్ల చిన్నారి.. అరుదైన ప్రపంచ రికార్డు
నేటి సాంకేతిక యుగంలో నెలల వయసున్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఆన్లైన్లో బిజీగా గడిపేస్తున్నారు. వీడియో గేమ్స్‌లో మునిగి తేలుతోన్న పిల్లలకు స్కూల్ బుక్స్ చదివే తీరిక కూడా ఉండడంలేదు. అటువంటిది ఐదేళ్ల చిన్నారి తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాలు చదివి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇండో అమెరికన్ చిన్నారి కియరా కౌర్‌కు పుస్తకాలు చదవడమంటే ఎంతో ఇష్టం. ఈ ఇష్టంతో 36 పుస్తకాలను రెండుగంటల్లోపే చదివి అతిచిన్న వయసులో.. లండన్ వరల్డ్ రికార్డ్, ఆసియా వరల్డ్ రికార్డుల జాబితాలో తన పేరును చేర్చింది. చెన్నైకు చెందిన డాక్టర్ రవీంద్రనాథ్ దంపతుల కుమార్తె కియరా. ప్రస్తుతం అబుదాబిలో ఉంటోన్న కియరాకు పుస్తకాలు చదవడమంటే ఎంతో ఇష్టం. కార్లో వెళ్తున్నా, రెస్ట్‌రూంలోకి వెళ్లినా కియరా చేతిలో బుక్ తప్పనిసరిగా ఉండేంత ఇష్టం తనకి. లాక్డౌన్ సమయం లో స్కూళ్లు మూతపడినప్పుడు కియరా మొత్తం సమయాన్ని బుక్స్ చదవడానికి కేటాయించి, వందల పుస్తకాలను చదివేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న 105 నిమిషాల్లో ఏకధాటి గా 36 పుస్తకాలను చదివి.. లండన్ వరల్డ్ రికార్డ్, ఆసియా వరల్డ్ రికార్డులలో స్థానం సంపాదించడంతో.. వరల్డ్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ కియరా ను ‘బాల మేధావి’గా అభివర్ణించింది. ఇంత చిన్నవయసు లో కియరా పుస్తకాల పురుగుగా మారడం విశేషమని కితాబునిచ్చింది. కియరా మాట్లాడుతూ... పుస్తకాలు చదువుతుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. బుక్‌ను పట్టుకుని చదువుతుంటే ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. ఇంటర్నెట్ లేకపోతే ఆన్లైన్లో బుక్స్ చదవలేము, వీడియోలు కూడ చూడలేము. అందుకే మన చేతిలో పుస్తకం ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ఇబ్బంది లేకుండా చదవొచ్చు. రంగురంగుల బొమ్మలు, పెద్ద పెద్ద అక్షరాల్లో టెక్ట్స్ ఉన్న పుస్తకాలు చదవడమంటే నాకెంతో ఇష్టం. నాకు ఇష్టమైన పుస్తకాల జాబితాలో సిండ్రెల్లా, అలీస్ ఇన్ వండర్లాండ్, లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ వంటివి అనేకం ఉన్నాయి. పుస్తకాలు చదవడమేగాక భవిష్యత్తులో మంచి డాక్టర్ని కూడా అవుతాను’’ అని కియరా చెప్పింది. ‘‘కియరాకు వాళ్ల తాతయ్య వాట్సాప్ కాల్లో చెప్పే కథలంటే ఎంతో ఇష్టం. గంటల తరబడి ఆయన చెప్పే కథలు వింటూ ఆమె సమయం గడిపేది. ఆయన ప్రేరణతోనే కియరా ఇలా పుస్తకాలు చదవగలుగుతోంది’’ అని కియరా తల్లి చెప్పారు. కరోనా సమయంలో స్కూళ్లు మూతపడ్డాయి. ఆ సమయంలో కియరా రెండు వందలకు పైగా పుస్తకాలను చదివింది. పుస్తకాలు అయిపోవడంతో కొత్త పుస్తకాలకోసం ఎదురుచూసేది. కొన్ని సందర్భాల్లో చదివిన పుస్తకాలనే మళ్లీమళ్లీ చదువుతూ ఉండేది. ఉద్యోగ రీత్యా మేము ఎంత బిజీగా ఉన్నప్పటికీ షాపింగ్ చేసిన ప్రతిసారి తనకోసం కొన్ని కొత్త పుస్తకాలను కొని తెచ్చిస్తాము’’ అని ఆమె తెలిపారు. విద్యార్థులు ఈ చిన్నారిని చూసైనా కాస్త పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుని మరింత జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆశిద్దాం. ఇక్కడ చదవండి: ఒంటరి తల్లులకు భరోసా ఏదీ? పిల్లలు అకస్మాత్తుగా ఎందుకు స్పృహ తప్పుతుంటారు? -
‘ధ్రితి’ కోసం వారం రోజుల్లోనే రూ. 4 కోట్ల విరాళాలు
వాషింగ్టన్ : మతోన్మాదం మత్తులో తూగుతున్న ఓ వ్యక్తి ముస్లింలుగా భావించి ఓ కుటుంబాన్ని చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి.. కోమాలోకి వెళ్లిన ఓ చిన్నారి కోలుకోవడం కోసం ప్రపంచమంతా ప్రార్థిస్తుంది. అంతేకాక ఆ చిన్నారి వైద్య ఖర్చులకు కావాల్సిన మొత్తాన్ని విరాళాల ద్వారా సేకరిస్తుంది. వివరాలు.. ఇండో అమెరికన్ కుటుంబానికి చెందిన ధ్రితి(13) గత నెల 23న తన కుటుబంతో కలిసిన బయటకు వెళ్తోంది. అయితే వీరిని ముస్లింలుగా భావించిన ఓ మోటరిస్ట్.. వారిని చంపేందుకు ప్రయత్నించాడు. కావాలనే మోటర్‌సైకిల్‌తో వారిని ఢీకొట్టాడు. ఈ దాడిలో ధ్రితి తీవ్రంగా గాయపడగా.. ఆమె తండ్రి, సోదరులకు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి చేర్చారు. అయతే ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ధ్రితి కోమాలోకి వెళ్లింది. ఆమెకు వైద్యం చేయడానికి 5 లక్షల అమెరికన్ డాలర్లు(రూ.3,46,80,750) ఖర్చవుతాయని వైద్యులు తెలిపారు. ఇంత భారీ మొత్తం ఖర్చు చేసి ధ్రితికి వైద్యం చేపించే స్థితిలో ఆమె కుటుంబం ఆర్థిక పరిస్థితులు లేవు. విషయం తెలుసుకున్న ‘గోఫండ్‌మి’ అనే ఫండ్ రైజింగ్ సంస్థ ధ్రితి పరిస్థితిని వివరిస్తూ.. ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇలా చేసిన వారం రోజుల్లోనే.. దాదాపు 12,360 మంది జనాలు ధ్రితికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దాంతో కేవలం ఏడు రోజుల్లోనే 6 లక్షల అమెరికన్ డాలర్లు (రూ.4,16,18,700 )విరాళంగా వచ్చాయి. ఈ మొత్తం వైద్యం ఖర్చుల కోసం కావాల్సిన దానికంటే ఎక్కువే ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ధ్రితిపై దాడి చేసిన వ్యక్తి జైలులో ఉన్నాడు. -
మధుమేహంపై బాలిక వినూత్న పోరాటం
న్యూఢిల్లీ: తన కుటుంబంలో ముగ్గురిని బలితీసుకున్న షుగర్వ్యాధిపై అమెరికాకు చెందిన 16 ఏళ్ల భారత సంతతి అమ్మాయి అవని మదానీ వినూత్న పోరాటం ప్రారంభించింది. తన కుటుంబ సభ్యుల్లా ఇతరులు ఈ వ్యాధి బారిన పడకుండా అవగాహన కలిగించేందుకు ‘దీ హెల్త్ బీట్’ అనే వెబ్‌సైట్‌ను రూపొందించింది. హిందీ, ఇంగ్లీష్ భాషలలో రూపొందించిన ఈ వెబ్సైట్లో మధుమేహం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పొందుపరిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత సమాజానికి ఆహార అలవాట్ల గురించి అవగాహన కల్పించడమే ఈ వెబ్సైట్ ఉద్దేశం. ఈ వెబ్‌సైట్‌కు భారత్‌కు చెందిన ది డయాబెటిక్ ఆఫ్ ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 41 సంస్థలు సహాయ సహకారాలను అందిస్తున్నాయి. భారతీయులు తీసుకునే ఆహారంలో పిండిపదార్థాలు, కొవ్వు అధిక పరిమాణంలో ఉండటం వల్లే ఎక్కువ మంది మధుమేహ బారినపడుతున్నారని మదానీ వివరించింది. ప్రపంచవ్యాప్తంగా మధుమేహానికి గురవుతున్న వారిలో భారత్‌లోనే 20 శాతం ఉన్నారని పేర్కొంది. ఇండియాలో 2015లో 6.9 కోట్ల డయాబెటిస్ కేసులు నమోదుకాగా, 10 లక్షల మంది మరణించారు.