ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా భారతీయ చిన్నారి | Indian American 11 year old girl is one of the brightest students in world | Sakshi
Sakshi News home page

భారతీయ చిన్నారి అరుదైన ఘనత

Published Wed, Aug 4 2021 8:35 AM | Last Updated on Wed, Aug 4 2021 8:35 AM

Indian American 11 year old girl is one of the brightest students in world - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థుల్లో ఒకరిగా 11 ఏళ్ల వయసున్న ఇండియన్‌ అమెరికన్‌ నటాషా పేరి ఎంపికైంది. స్కాలస్టిక్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ (శాట్‌), అమెరికన్‌ కాలేజీ టెస్టింగ్‌(యాక్ట్‌)లలో అసమాన ప్రతిభ చూపించినందుకు అమెరికాలోని న్యూజెర్సీ విశ్వవిద్యాలయం నటాషా పేరిని అత్యంత తెలివైన చిన్నారిగా గుర్తించి గౌరవించింది. అమెరికాలో ఎన్నో కాలేజీల్లో అడ్మిషన్ల కోసం శాట్, యాక్ట్‌ పరీక్షల్లో వచ్చే స్కోర్‌నే కొలమానంగా తీసుకుంటాయి.

జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ టాలెంటెడ్‌ యూత్‌ (సీటీవై) సెర్చ్‌లో భాగంగా నిర్వహించిన శాట్, యాక్ట్‌ పరీక్షల్లో నటాషా అత్యుద్భుతమైన ప్రతిభ కనబరిచింది. న్యూజెర్సీలోని ఒక ఎలిమెంటరీ స్కూలులో నటాషా చదువుకుంటోంది. సీటీవై నిర్వహించిన పరీక్షల్లో ప్రపంచవ్యాప్తంగా 84 దేశాలకు చెందిన 19 వేల మంది పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ సీజన్‌లో పరీక్షలు నిర్వహించి అత్యంత తెలివైన విద్యార్థుల్ని ఈ సంస్థ ఎంపిక చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం స్ప్రింగ్‌ సీజన్‌లో పరీక్షలు రాసిన గ్రేడ్‌-5కి చెందిన నటాషా తన వయసుకి మించిన ప్రతిభను ప్రదర్శించి గ్రేడ్‌-8 వారితో సమానంగా స్కోరు సాధించింది. దీంతో జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ హై ఆనర్స్‌ అవార్డుకి ఎంపికైంది. ఇందులో విజయం సాధించడం తనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందన్న నటాషా పేరి తాను ఇంకా ఎంతో సాధిస్తానన్న ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement