యువతను ఉత్తేజపరచడానికే సమైక్యగీతాలు
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో యు వతను, ఉద్యమకారులను ఉత్తేజపరచడానికే ‘సమైక్య గీతాల’ సీడీని ఆవిష్కరించినట్టు ఇండియన్ బాయ్స్ క్రియేషన్స్ కన్వీనర్ ఎం.హరిప్రసాద్ తెలిపారు. ‘జై సమైక్యాంధ్ర..జైజై సమైక్యాంధ్ర’ పేరుతో రూపొందించిన పాటల సీడీలను శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఆయన మా ట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం సీమాంధ్ర ప్రజలను ఏ విధం గా చూస్తోంది, ఉద్యమాల ఆవశ్యకత తదితర అంశాల ప్రాతి పదికగా పాటలు రూపొందించినట్టు తెలిపారు.
సీడీ రూపకల్పన స్ఫూర్తితో ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు జరిగే ఉద్యమ దృశ్యాలను డాక్యుమెంటరీ రూపంలో తయారు చేసి ఢిల్లీ పెద్దలకు అందజేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న సమైక్య ఉద్యమకారుల ఆవేదన, యువతలోని వేడి ని గుర్తించలేని కాంగ్రెస్ అధిష్టానానికి తమ డాక్యుమెంట రీ ద్వారా తెలియజేస్తామన్నారు.
ప్రస్తుతానికి చిత్తూరు జిల్లాలో ని వివిధ జేఏసీలు నిర్వహిస్తున్న శిబిరాలకు మాత్రమే ఉచి తంగా పంపిణీ చేస్తున్న పాటల సీడీలను సీమాంధ్రలోని మిగి లిన జిల్లాలకు కూడా పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామ ని చెప్పారు. తాము త్వరలో రూపొందించనున్న డాక్యుమెం టరీకి సమైక్యవాదులెవరైనా సహకరించాలంటే 9652178769 నంబరులో సంప్రదించాలని కోరారు. పాటల సంగీత దర్శకు డు అంబికా సుమన్, ఆర్కెస్ట్రా ఆర్గనైజర్ ఎపినేసర్, సభ్యులు రవికాంత్, రాజశేఖర్, అశోక్, విజయ్, మోహన్ పాల్గొన్నారు.