ఇక నిర్ణయం వాల్ష్దే
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు చీఫ్ కోచ్ పదవిలో కొనసాగాలో? వద్దో? తేల్చుకోవాల్సింది... టెర్రీ వాల్షేనని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) స్పష్టం చేసింది. వాల్ష్ డిమాండ్లను కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ ఆమోదించారు కాబట్టి ఇక ఆస్ట్రేలియన్ తుది నిర్ణయం తీసుకోవాలని సూచింది. మరో 4, 5 రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని సాయ్ ఆశాభావం వ్యక్తం చేసింది. మరోవైపు సాయ్ పంపే తాజా ప్రతిపాదనలను అధ్యయనం చేసేందుకు రెండు రోజుల సమయం కోరిన వాల్ష్... చాంపియన్స్ ట్రోఫీకి ముందు జట్టుతో కలుస్తానని చెప్పి ఆస్ట్రేలియా వెళ్లాడు.
అయితే తాము ఎలాంటి ప్రతిపాదనలను పంపబోమని, వాల్ష్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని సాయ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (టీమ్స్) సుధీర్ సేతీ తెలిపారు.