రిటైర్మెంట్ ఆలోచన వచ్చింది
- కానీ లక్ష్యాలు మిగిలే ఉన్నాయి
- మేరీకామ్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: బాక్సింగ్‌కు ఇక గుడ్‌బై చెప్పాలన్న ఆలోచన కలుగుతోందని భారత మహిళా బాక్సర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీ కామ్ తెలిపింది. ఏడాది కాలంగా బాక్సింగ్‌కు దూరంగా ఉండి మూడో బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం కామన్వెల్త్ క్రీడల కోసం ఆమె తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించింది. ఈ సందర్భంగా మేరీ కామ్ మాట్లాడుతూ, ‘రిటైర్మెంట్ ఆలోచన చాలాసార్లు వచ్చింది. కానీ, సాధించాల్సిన లక్ష్యాలు ఇంకా ఉన్నాయి.
ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే ప్రధాన లక్ష్యం’ అని వివరించింది. 2008లో తొలిసారి తల్లి అయ్యేందుకు బాక్సింగ్ నుంచి విరామం తీసుకున్న మేరీ కామ్ ఆ తరువాత రింగ్‌లోకి అడుగు పెడుతూనే ప్రపంచ టైటిల్‌ను గెలుచుకుంది. తాజా విరామంతో కూడా తనకు ఎటువంటి ఇబ్బంది తలెత్తదని, నెల రోజుల క్రితమే ప్రాక్టీస్ మొదలుపెట్టానని ఆమె పేర్కొంది.