38 మంది జాలర్లకు విముక్తి
రామేశ్వరం: గత నెలలో అదుపులోకి తీసుకున్న38 తమిళ జాలర్లను శ్రీలంక అధికారులు విడుదల చేయనున్నారు. గత నెల 21, 26వ తేదీల్లో తమ ప్రాదేశిక సముద్ర జలాల్లో చేపలు పడుతున్నారంటూ తమిళనాడుకు చెందిన జాలర్లను శ్రీలంక నేవీ అదుపులోకి తీసుకుంది. వీరిని మంగళవారం మధ్యాహ్నం భారత అధికారులకు అప్పగించనున్నట్లు ప్రకటించింది. అనంతరం వీరంతా కరైకాల్ చేరుకుంటారని అధికారులు ప్రకటించారు.