నైజీరియా హైకమిషనర్‌గా ప్రొద్దుటూరు వాసి
పొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన బొల్లవరం నాగభూషణం రెడ్డి నైజీరియా దేశానికి భారత్ హై కమిషనర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో పనిచేస్తున్న ఆయనకు పదోన్నతి కల్పిస్తూ నైజీరియాలో భారతదేశం తరఫున హై-కమిషనర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నెల 9న జెనివాలో ఆయన రిలీవ్ కానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పట్టణానికి చెందిన డాక్టర్ బొల్లవరం రామసుబ్బారెడ్డి, నారాయణమ్మ దంపతుల కుమారుడైన నాగభూషణం 1993లో సివిల్స్‌లో 71వ ర్యాంక్ సాధించారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ కు ఎంపికయ్యారు. ఆయన సోదరుడు వేణుగోపాల్ రెడ్డి ఐఏఎస్ గా ఎంపికయి ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ కార్యలయంలో కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.