హాకీ ఇండియా అంగీకరిస్తే...
వాల్ష్‌ను పునర్నియమిస్తామన్న ‘సాయ్’
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు కోచ్‌గా మరో సారి టెర్రీ వాల్ష్‌ను నియమించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) ప్రకటించింది. అయితే ఇందుకు హాకీ ఇండియా (హెచ్ఐ) ఒప్పుకోవాల్సి ఉంటుందని ‘సాయ్’ డెరైక్టర్ జనరల్ జిజి థామ్సన్ అన్నారు. ‘వాల్ష్ తో మేం అనేక అంశాల్లో చర్చలు జరిపాం. అయితే వాల్ష్ ఆర్థిక అవకతవకలపై హెచ్ఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. వాల్ష్ మంచి కోచ్ అయినా మేం ఒక్కరమే నిర్ణయం తీసుకోలేం. అతనితో ఇబ్బంది లేదని హెచ్ఐ భావిస్తే మళ్లీ నియమించేందుకు సిద్ధం’ అని ఆయన స్పష్టం చేశారు. అమెరికా కోచ్‌గా వాల్ష్ భారీగా అవినీతికి పాల్పడ్డాడని గత వారం హెచ్ఐ అధ్యక్షుడు బాత్రా ఆరోపించారు.