అడ్మిషన్స్, జాబ్స్
బిట్స్‌లో పీహెచ్డీ ప్రోగ్రామ్
బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్), పిలానీ పీహెచ్డీ (ఫుల్‌టైమ్/ పార్ట్‌టైమ్)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: బయలాజికల్ సెన్సైస్, ఇంజనీరింగ్ (కెమికల్, సివిల్, సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్), ఎకనమిక్స్ అండ్ ఫైనాన్స్, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, ఫార్మసీ, ఫిజిక్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్.
క్యాంపస్‌లు: హైదరాబాద్, పిలానీ, దుబాయి, గోవా.
అర్హతలు: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 18
వెబ్సైట్: www.bitsadmission.com
ది ఇండియన్ లా ఇన్స్టిట్యూట్
న్యూఢిల్లీలోని ది ఇండియన్ లా ఇన్స్టిట్యూట్ (ఐఎల్ఐ) ఆన్లైన్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ఇంటర్నెట్ ఏజ్
సైబర్ లాకాలపరిమితి: మూడు మాసాలు
అర్హత: ఏదైనా డిప్లొమా/డిగ్రీ (10+2తో). కంప్యూటర్, ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉండాలి.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 15
వెబ్సైట్: http://ili.ac.in/
నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ
పుణేలోని నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ (ఎన్ఐఏ) పీజీడీఎం కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం)
వ్యవధి: రెండేళ్లు
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనలియర్ విద్యార్థులూ అర్హులే.
వయోపరిమితి: జూలై 1, 2014 నాటికి 26 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: అకడమిక్ రికార్డ్, క్యాట్-2014, సీమ్యాట్ (సెప్టెంబర్ 2014, ఫిబ్రవరి 2014), గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: మార్చి 31
వెబ్సైట్: http://niapune.com
ఐఐటీ, కాన్పూర్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: సర్వీస్ మేనేజ్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆపరేషన్స్, సిస్టమ్స్, మార్కెటింగ్.
అర్హత: 65 శాతం మార్కులతో పదో తరగతి; ఇంటర్మీడియెట్; బీటెక్/ బీఎస్సీ ఇంజనీరింగ్/ బీఆర్క్ ఉత్తీర్ణత. క్యాట్-2014లో 85 శాతం పర్సంటైల్ సాధించాలి.
ఎంపిక: క్యాట్-2014, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: జనవరి 13
వెబ్సైట్: www.iitk.ac.in
ఎన్ఐఎఫ్టీఈఎం
కేంద్ర ప్రభుత్వ ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రి త్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్ (ఎన్ఎఫ్టీఈఎం) వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులు: బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్.
వ్యవధి: నాలుగేళ్లు సీట్లు: 180
అర్హత: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్లతోపాటు కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ కంప్యూటర్‌సైన్స్/ బయాలజీల్లో ఒక సబ్జెక్టుతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: జేఈఈ మెయిన్-2015 ర్యాంక్ ఆధారంగా.
ఎంటెక్ కోర్సులు: ఫుడ్ సప్లై చైన్ మేనేజ్మెంట్,ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్, ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ఫుడ్ ప్లాంట్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్.
వ్యవధి: రెండేళ్లు
అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుతో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: గేట్ స్కోర్ ఆధారంగా.
పీహెచ్డీ కోర్సులు: అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ సెన్సైస్, బేసిక్ అండ్ అప్లైడ్ సెన్సైస్, ఫుడ్ ఇంజనీరింగ్, ఫుడ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. నెట్/ గేట్ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఉంటుంది.
ఎంపిక: ఇన్స్టిట్యూట్ నిర్వహించే రీసెర్చ్ ప్రవేశపరీక్ష ద్వారా.
వెబ్సైట్: www.niftem.ac.in
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
డిప్యూటీ జనరల్ మేనేజర్: 8
వయోపరిమితి: 2014 డిసెంబర్ 3 నాటికి 45 ఏళ్లకు మించకూడదు.
చీఫ్ మేనేజర్: 13
సీనియర్ మేనేజర్ (డిజైన్): 28
వయోపరిమితి: 2014 డిసెంబర్ 3 నాటికి 48 ఏళ్లకు మించరాదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 3
వెబ్సైట్:www.halindia.com
ఉస్మానియా యూనివర్సిటీ
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ జెనెటిక్స్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ప్రాజెక్ట్ అసిస్టెంట్: 1
అర్హత: జెనెటిక్స్/ బయోటెక్నాలజీలో 55 శాతం మార్కులతో డిగ్రీ ఉండాలి.
టెక్నికల్ అసిస్టెంట్: 1
అర్హత: బీఎస్సీ ఉత్తీర్ణత.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 19
వెబ్సైట్: www.osmania.ac.in
రైల్‌టెల్ కార్పొరేషన్
రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల సంఖ్య: 8
అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. స్టెనోగ్రఫీలో నిమిషానికి 80 పదాలు, ఇంగ్లిష్ టైపింగ్‌లో నిమిషానికి 40 పదాల వేగం ఉండాలి.
వయసు: 21 - 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 15
వెబ్సైట్: http://railtelindia.com/