Indian Oil Petrol Bunk
-
Hyderabad: పెట్రోల్ పోస్తుండగా నిప్పుపెట్టిన ఆకతాయి
మల్లాపూర్: మల్లాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో పెట్రోలు పోస్తుండగా ఓ ఆకతాయి నిప్పు అంటించిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. సిబ్బంది అప్రమత్తమై మంటలు ఆరి్పవేయడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు, ఎస్ఐ మైబెలి తెలిపిన వివరాల ప్రకారం..మల్లాపూర్ ఓల్డ్ మీర్‌పేట్‌కు చందన్‌కుమార్ (19) తన స్నేహితులతో కలిసి యాక్టివా ద్విచక్రవాహనంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చారు.అదే సమయంలో సిబ్బంది వేరే కస్టమర్‌కు బాటిల్లో పెట్రోల్ పోస్తుండగా చందన్‌కుమార్ సడన్‌గా జేబులోంచి లైటర్ తీసి వెలిగించాడు. ‘అంటించమంటారా..’ అంటూ పెట్రోలు నింపుతున్న సిబ్బంది దగ్గరకు వచ్చి అంటించాడు. దీంతో గన్‌కు మంటలు అంటుకున్నాయి. తీవ్ర భయాందోళనకు గురైన సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఫైర్ ఫోమ్‌తో మంటలు ఆరి్పవేశారు. దీంతో పెట్రోల్ బంక్‌లో ఉన్నవారందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించగా..చందన్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోస్తుండగా నిప్పు పెట్టిన ఆకతాయిలు.. గంజాయి మత్తులో ఉన్న యువకులు..హైదరాబాద్ - నాచారం పీఎస్ పరిధిలో మల్లాపూర్‌లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోస్తుండగా నిప్పు పెట్టిన ఆకతాయిలు.. ఒక్కసారిగా చెలరేగిన మంటలువెంటనే మంటలను ఆర్పిన పెట్రోల్ బంక్… pic.twitter.com/IVmrhJPfdy— Telugu Scribe (@TeluguScribe) October 26, 2024 -
ఇంత దారుణమా.. ఐదు లీటర్లకు హాఫ్ లీటర్ పెట్రోల్ కొట్టేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: మహానగరంలోని పెట్రో బంకుల చిప్ ట్రిక్స్ ఆగడం లేదు. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం మ్యానువల్ పెట్రోల్ బంకుల మోసాలను అడ్డుకట్ట వేసేందుకు ఎలక్ట్రానిక్, డిజిటల్ ఫిల్లింగ్ డిస్పెన్సరీ యూనిట్లు అమల్లోకి తీసుకొచ్చినా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఊహకు అందని సరికొత్త మోసాలు బహిర్గతమవుతూనే ఉన్నాయి. తాజాగా రాజేంద్రనగర్ శివరాంపల్లిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుపై ఫిర్యాదులు రావడంతో తూనికలు, సివిల్ సప్లయిస్, ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించగా డిస్పెన్సరీ మిషన్ సాఫ్ట్‌వేర్‌లో చిప్ అమర్చినట్లు బయటపడింది. ఐదు లీటర్ల పెట్రోల్‌కు దాదాపు 500 ఎంఎల్ తక్కువగా వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మరికొన్ని బంకులపై అధికారులు దాడులు దిగినప్పటికి అప్పటికి డీలర్లు అప్రమత్తం కావడంతో ఫలితం లేకుండా పోయింది. అంతా గప్ చిప్.. పెట్రోల్ బంక్‌ల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేతివాటం ‘గప్ చిప్’గా కొనసాగుతూనే ఉంది. డిజిటల్ ఫిల్లింగ్ డిస్పెన్సరీ యూనిట్లలో అడిషనల్ మైక్రో చిప్స్, రిమోట్ కంట్రోల్, సాఫ్ట్వేర్ పోగ్రామింగ్, ఇన్సిస్టెంట్ అప్లికేషన్ ఇన్స్టాలేషన్ తదితర అక్రమ మార్గాలు బట్టబయలైనా తాజాగా డిస్పెన్సరీ టెక్నాలజీకి అనుగుణంగా అప్డేషన్ మెకానిజం మాత్రం ఆగడం లేదు. డిస్ప్లేలో మీటర్ రీడింగ్ కరెక్ట్‌గానే చూపిస్తున్నా తెరమాటున పెట్రోల్, డీజిల్ మెజర్మెంట్ దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. డిస్పెన్సరీ మ్యానూఫ్యాక్చరింగ్ యూనిట్ మాజీ టెక్నిషియన్ల నైపుణ్యత పెట్రోల్ బంకు యాజమానులకు కాసులు కురిపిస్తోంది. డిస్ప్లేలో ఓకే...కానీ పెట్రోల్ బంక్ బాయ్ కీ బోర్డుపై బట¯న్ నొక్కి మీటర్‌ను(జీరో) సున్నా చూపించి టకీమని మనం చెప్పినంత పెట్రోలు కొడతాడు. ఫిల్లింగ్ మిషన్ డిస్ప్లే బోర్డులో మీటర్ రీడింగ్ మిల్లీ లీటర్లు... అమోంట్ కరెక్ట్‌గా ఉండటం చూసి లెక్క సరిపోయిందని నిర్ధారించుకుంటాం. డబ్బులు చెల్లించి అక్కడి నుంచి కదులుతాం. మన డబ్బుకు సరిపోనూ పెట్రోల్ మన బండి ట్యాంకులోకి పడిందని అనుకుంటే పొరపాటే... లీటరుకు 850 నుంచి 900 మిల్లీ లీటర్లే చేరుతుంది.! దీంతో 100 నుంచి 150 మిల్లీలీటర్లు నష్టపోవాల్సిందే. చేతివాటం ఇలా.. ►పెట్రోల్ బంకు ఫ్యూల్ మీటర్ (డిస్పెన్సరీ) యూనిట్లో మెజరింగ్ సిస్టమ్‌గా పనిచేసే పల్సర్ విభాగానికి సర్యూ్యట్తో కూడిన అదనపు కేబుల్‌ను అనుసంధానించి కీ ప్యాడ్ కనెక్ట్ ద్వారా పంప్‌ను ఆపరేట్ చేస్తూ సర్దుబాటు కొలతల ప్రకారం తక్కువగా పెట్రోల్, డీజిల్ డెలివరీ చేస్తూ మోసం చేస్తున్నారు. ►ఫ్యూయల్ డిస్పెన్సరీ యూనిట్‌లోని మదర్ బోర్డులో ఐసీ సర్క్యూట్ ద్వారా ‘ఇన్సిస్టెంట్ అప్లికేషన్ ఇన్స్టాలేషన్’తో అడ్జెస్ట్ చేసిన మెజర్మెంట్ ప్రకారం ఫ్యూల్ ఆయిల్ డెలివరీలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ►డిస్పెన్సరీ యూనిట్లలో సీల్‌కు సైతం సాల్టరింగ్ బాహాటంగానే సాగుతున్నట్లు తెలుస్తోంది. తూనికలు, ఆయిల్ కంపెనీల అధికారులతో పాటు ఇద్దరు టెక్నీషియల్ సమక్షంలో పంపింగ్ మిషన్‌లో మెజర్మెంట్ను పరిశీలించి మోసాలకు పాల్పడకుండా మీటరింగ్ యూనిట్, పల్సర్(సెన్సర్), మదర్ బోర్డు, కీ ప్యాడ్, కంట్రోలర్ కార్డులకు సీల్ చేస్తున్నా...బంకు నిర్వహకులు సీల్‌ను బ్రేక్ చేయడమే కాకుండా తిరిగి అదే రకమైన వైర్‌తో సీల్‌కు సాల్టరింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బయట పడకుండా అప్రమత్తమే అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు డిస్పెన్సరీ యూనిట్ ఆఫ్–ఆన్‌చేసి మెజర్మెంట్లో ఎలాంటి వ్యత్యాసం కనిపించకుండా బంకు నిర్వాహకులు జాగత్త పడుతున్నారు. యూనిట్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే అందులో ఇనిస్టాల్చేసిన ఇన్సిస్టెంట్ అప్లికేషన్ ఎగిరిపోయి పాత మేజర్మెంట్ ప్రకారం ఆయిల్ డెలివరీ అవుతోంది. తిరిగి కొలతల హెచ్చు తగ్గుల కోసం ఇన్సిస్టెంట్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడం సర్వసాధారమైంది. ఇదీ నిబంధన తూనికలు కొలతల శాఖ నిబంధన ప్రకారం కనీసం 5 లీటర్లలో 25 ఎంఎల్ కంటే ఎక్కువగా షార్టేజ్ రావొద్దు. ఒక వేళ వస్తే తక్షణమే సంబంధిత డిస్పెన్సరీ నాజిల్‌ను సీజ్ చేసి నోటీసు జారీ చేయాల్సి ఉంటుంది. కాంపౌండింగ్ విధించడమే కాకుండా కొన్నిసార్లు కేసులు కూడా నమోదు చేసి కోర్టుకు నివేదించే అవకాశం ఉంటుంది. -
ఇండియన్ ఆయిల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రాష్ట్రంలోని తమ పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (రెడ్కో)తో గురువారం ఇక్కడ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. జాతీయ రహదారులపై ఉన్న తమ పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. రెడ్కో సంస్థ ఎంపిక చేసిన ఏజెన్సీల ద్వారా పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ఈవీ చార్జింగ్ స్టేషన్లను నిర్మించి ఇండియన్ ఆయిల్ సంస్థకు అప్పగించనుంది. సీబీజీ, సీఎన్జీ వంటి పునరుద్ధరణీయ ఇంధన ఆధారిత చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును సైతం పరిశీలిస్తున్నట్టు రెడ్కో వీసీ, ఎండీ ఎన్.జానయ్య పేర్కొన్నారు. 2022 చివరి నాటికి 800 ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. -
ఇచ్చిన బాకీ తిరిగి రాలేదని..
అద్దంకి: ఇచ్చిన బాకీ తిరిగి రాలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు 60 అడుగుల ఎత్తున 33 కిలోవాట్ల విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణ శివార్లలోని మేదరమెట్ల-నార్కెట్‌పల్లి రహదారిలో శింగరకొండ సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ఎదురుగా ఆదివారం జరిగింది. పోలీసులు అందించిన సమాచారం మేరకు గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం దొండపాడులో నివశిస్తున్న పెట్లూరి వెంకటరెడ్డికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. మూడో కుమారుడు ఆదిరెడ్డి (22) ఏడో తరగతి వరకు చదువుకుని బడిమానేశాడు. విజయవాడలోని ఓ పళ్ల దుకాణంలో కొన్నేళ్లు..ఆ తరువాత అద్దంకి పట్టణంలోని ఓ వాటర్ ప్లాంటులో రెండేళ్లు పనిచేశాడు. ప్లాంటు యజమానికి *2 లక్షల అప్పు ఇంటి నుంచి తెచ్చి ఇచ్చాడు. ఇటీవల అప్పు వసూలు విషయంలో యజమానికి.. తనకు పడకపోవడంతో అక్కడ పని మానేశాడు. శింగరకొండ రహదారిలో ఉన్న ఓ దాబాలో బాయ్‌గా చేరాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో ఆదిరెడ్డిని గతంలో పనిచేసిన వాటర్ ప్లాంట్‌లో పనిచేసే ఇద్దరు స్నేహితులు వచ్చి సినిమాకు పిలిచారు. దాబా ఓనర్ వద్ద అనుమతి తీసుకుని సినిమాకు వెళ్లాడు. సినిమా చూసి రాత్రి 11గంటల సమయంలో దాబా వద్దకు చేరుకున్నాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో తెల్లవారే సరికి యువకుడు అరవై అడుగుల విద్యుత్ టవర్‌పై శవమై కనిపించాడు. దాబా సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోలు బంకు వారు బహిర్భూమికి బయటకు రావడంతో అద్దంకి నుంచి మండలంలోని కుంకుపాడులో ఉన్న కల్లం స్పిన్నింగ్ మిల్కు వెళ్లే 33 కిలోవాల్టుల కెపాసిటీ ఉన్న 60 అడుగుల విద్యుత్ టవర్‌పై ఓ యువకుని శవాన్ని గమనించిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సాంబశివరావు, ఎస్సై సీహెచ్ వెంకటేశ్వర్లు వివరాలు సేకరించారు.యువకుడు వేసుకున్న చొక్కా..తల వెంట్రుకలు బూడిదై కింద రాలిపడ్డాయి. సంతమాగులూరు నుంచి క్రేన్ తెప్పించి రెండు గంటల అనంతరం ఇద్దరు యువకులు టవర్ ఎక్కి ఇనుప గిలక కట్టి మోకు సాయంతో మృతదేహాన్ని కిందకు దించారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇచ్చిన అప్పు రాకపోవడమే మృతికి కారణం... తాను 2 లక్షల అప్పు ఇచ్చిన యజమాని ఎన్నిసార్లు అడిగినా డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది, ఇంట్లో డబ్బు ఏదని అడుగుతుండడంతో బాధ భరించలేక ఆదిరెడ్డి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. విచారణ నిర్వహించి పూర్తి వివరాలు తెలియజేస్తామని ఎస్సై సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు.