సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రాష్ట్రంలోని తమ పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (రెడ్కో)తో గురువారం ఇక్కడ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. జాతీయ రహదారులపై ఉన్న తమ పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది.
రెడ్కో సంస్థ ఎంపిక చేసిన ఏజెన్సీల ద్వారా పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ఈవీ చార్జింగ్ స్టేషన్లను నిర్మించి ఇండియన్ ఆయిల్ సంస్థకు అప్పగించనుంది. సీబీజీ, సీఎన్జీ వంటి పునరుద్ధరణీయ ఇంధన ఆధారిత చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును సైతం పరిశీలిస్తున్నట్టు రెడ్కో వీసీ, ఎండీ ఎన్.జానయ్య పేర్కొన్నారు. 2022 చివరి నాటికి 800 ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment