ముగ్గురు ఎన్ఆర్ఐ విద్యార్థుల మృతి
కౌలాలంపూర్: మలేషియాలో గత శుక్రవారం సంభవించిన భారీ భూకంపం కారణంగా మృతిచెందినవారిలో ముగ్గురు భారత సంతతి విద్యార్థులు కూడా ఉన్నారు. సింగపూర్ లోని టంజాంగ్ కటోంగ్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులుగా వారిని గుర్తించారు. విహార యాత్రలో భాగంగా సింగపూర్ నుంచి ఐదుగురు విద్యార్థులు, ఒక టీచర్ మలేసియాకు వచ్చారు.
స్థానిక శిక్షకుడి సహాయంతో కినబారు పర్వతశ్రేణుల్లో ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలోనే భూకంపం సంభవించింది. కొండచరియలు విరిగిపడటంతో శిక్షకుడు సహా ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని సింగపూర్ విద్యా మంత్రిత్వశాఖ ప్రకటించింది. కాగా, భూకంపం మృతుల సంఖ్య ఆదివారం నాటికి 13కు పెరిగింది.