indian passports
-
నీరవ్ మోదీకి మరో షాక్
సాక్షి,న్యూఢిల్లీ: డైమండ్ వ్యాపారి, ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేలకోట్ల రుణాలను ఎగవేసిన కేసులో ప్రధాన నిందితుడు నీరవ్‌మోదీకి మరోషాక్ తగిలింది. అతి పెద్ద పీఎన్బీ కుంభకోణంలో (రూ.13,600 కోట్లు) ముంచేసి విదేశాల్లో చక్కర్లుకొడుతున్న నిందితుడు నీరవ్ మోదీకి సంబంధించి తాజాగా మరింత కీలక సమాచారాన్ని దర్యాప్తు బృందం అధికారులు సేకరించారు. కనీసం ఆరు భారతీయ పాస్‌పోర్ట్ లతో వివిధ దేశాలలో తిరిగుతున్నట్టు కనుగొన్నారు. ఈ నేరానికి మోదీపై తాజా ఎఫ్ఐఐఆర్ నమోదు చేయాలని దర్యాప్తు బృందాలు కోరుతున్నాయని సీనియర్ అధికారులు ధృవీకరించారు. ఒకటి కంటే ఎక్కువ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉండటం, అలాగే రద్దు చేయబడిన పాస్‌పోర్ట్‌ను ఉపయోగించడం నేరమని పేర్కొన్నారు. అధికారుల సమాచారం ప్రకారం నీరవ్ మోదీ మొత్తం ఆరు ఇండియన్ పాస్ట్‌పోర్టులను కలిగివుండగా రెండింటిని తరచుగా వాడుతున్నాడు. మిగిలినవి ఇన్‌యాక్టివ్‌గా ఉన్నాయి. ఒక దానిలో మోదీ పూర్తి పేరు ఉండగా, మరొకటి, 40 ఏళ్ళ యూకే వీసాలో ఫస్ట్‌నేమ్‌తో ఉంది. పీఎన్బీ స్కాంలో వెలుగులోకి వచ్చిన అనంతరం ఈ ఏడాది ప్రారంభంలో తన మొదటి పాస్‌పోర్టును, ఆ తరువాత రెండవదాన్ని ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ, వాటిని ఇంకా వినియోగించడం చట్టరీత్యా నేరమని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీంతోపాటు బెల్జియం పాస్‌పోర్ట్ కూడా ఉంది. ఈ వ్యవహారంపై ఒక కొత్త నేరారోపణ కింద మోదీపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని, అంతర్గత విచారణ పూర్తయిన తర్వాత విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని సీనియర్ అధికారి చెప్పారు. అలాగే ఇతర దేశాలు జారీ చేసిన పాస్‌పోర్టులను మోదీ ఉపయోగించినట్లయితే, దానిపై కూడా దర్యాప్తు జరుగుతుందని ఆయన చెప్పారు. కాగా పీఎన్బీ స్కాంలో ఇప్పటికే మోదీపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. తమ ఛార్జిషీట్ల ఆధారంగా మోదీతోపాటు ఇతర నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాయి. మరోవైపు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారా నీరవ్ పాస్‌పోర్ట్ రద్దు గురించి ప్రభుత్వం ఇంటర్‌పోల్‌కు సమాచారం అందించింది. అరెస్టు వారెంట్ జారీ చేయాలని కోరిన సంగతి తెలిసిందే. -
భారత పాస్‌పోర్టుల కోసం ఉగ్రవాదుల ప్రయత్నం
అనుమానిత హుజి (హర్కతుల్ జీహాద్ ఇస్లామీ) ఉగ్రవాదులపై టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో.. చంచల్‌గూడ సమీపంలోని ఎంఎం జిరాక్స్ పాయింట్ వద్ద సోదాలు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సీసీఎస్ జాయింట్ కమిషనర్ ప్రభాకర్ రావు తెలిపారు. నకిలీ పత్రాలతో భారత పాస్‌పోర్టులు పొందేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారని తెలిసిందన్నారు. ఈ దాడుల్లో తాము ముందుగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మహ్మద్ నజీర్, మసూద్ అలీఖాన్, పర్వేజ్ఖాన్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిని విచారించగా, మసూద్ అలీఖాన్ ఇంట్లో మరో ముగ్గురు ఉన్నట్లు తెలిసి, వాళ్లను కూడా కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు. తాము మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రభాకర్ రావు చెప్పారు. వీళ్లంతా పుట్టుక రీత్యా బంగ్లాదేశీయులని, అక్కడి నుంచి ఆరేడేళ్ల వయసు ఉన్నప్పుడే పాకిస్థాన్ వెళ్లిపోయారని సీసీఎస్ జాయింట్ కమిషనర్ ప్రభాకర్ రావు తెలిపారు. 2010లో భారతదేశంలోకి అక్రమంగా చొరబడ్డారని, ముందుగా ముజఫర్‌నగర్, పానిపట్ లాంటి కొన్ని ప్రాంతాల్లో తిరిగారని అన్నారు. గడిచిన మార్చి నెలలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చారని, అప్పటినుంచి జైపల్లిలోని యునానీ ఆస్పత్రిలో పనిచేస్తున్నారని వివరించారు. వీళ్లలో మహ్మద్ నజీర్‌కు హుజితో సంబంధాలు ఉన్నాయని, బంగ్లాదేశ్‌లోని హుజి ప్రధాన నాయకుడు జబ్బార్‌తో నిరంతరం టచ్‌లో ఉంటున్నారని చెప్పారు. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు సోనీని బంగ్లాదేశ్ పంపేందుకు వీళ్లే సాయపడ్డారని ఆయన అన్నారు. -
పాస్‌పోర్టుల కోసం ఉగ్రవాదుల ప్రయత్నం
-
అమెరికాలో 70 భారతీయ పాస్‌పోర్టుల చోరీ
శాన్ఫ్రాన్సిస్కోలోని ఓ ప్రైవేటు కంపెనీ నుంచి దాదాపు 70 భారతీయ పాస్‌పోర్టులను గుర్తు తెలియని దుండగులు తస్కరించారు. వీసా, పాస్‌పోర్టు సంబంధిత సేవలను ఆ కంపెనీకి భారత రాయబార కార్యాలయం ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చింది. అందుకే ఆ కంపెనీలో అన్ని పాస్‌పోర్టులున్నాయి. అంత కీలకమైన సంస్థలో భద్రతాపలమైన లోపాలు ఎందుకు ఉన్నాయనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పాస్‌పోర్టులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు భారతీయ రాయబార కార్యాలయంతో పాటు స్థానిక పోలీసులు కూడా విదేశాంగ శాఖను అప్రమత్తం చేశారు. బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ అనే ఈ కంపెనీ సేవలు ఇక అవసరం లేదని భారత రాయబార కార్యాలయం తెలిపింది. కొత్త కంపెనీలను ఆహ్వానిస్తూ బిడ్లు దాఖలు చేయాలని కోరింది. చోరీకి గురైన పాస్‌పోర్టులన్నింటినీ శాన్ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం రద్దుచేసింది.