‘ఎన్పీఎస్ నుంచి రైల్వేని మినహాయించండి’
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ పింఛను పథకం(ఎన్పీఎస్)నుంచి రైల్వే శాఖను తప్పించి పాత రైల్వే సర్వీసెస్ పెన్షన్ స్కీమ్-1993ను పునరుద్ధరించాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్(ఎన్ఎఫ్ఐఆర్) ప్రధాన కార్యదర్శి ఎం.రాఘవయ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
‘రైల్వే కార్మికుల విధులు సైనిక బలగాల విధుల్లా కష్టభరితంగా ఉంటాయి. ఏడాదిపొడవునా 24 గంటలూ రైల్వేలను నిర్వహించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మినహాయింపివ్వాలి’ అని కోరారు