భారత రియల్టీ మార్కెట్లోకి చైనా వాండా గ్రూప్
న్యూఢిల్లీ: చైనా రియల్టీ దిగ్గజం దలియాన్ వాండా గ్రూప్ భారత రియల్టీ మార్కెట్లో 500 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. భారత్‌లో పారిశ్రామిక టౌన్‌షిప్‌ల అభివృద్ధి కోసం ఈ మేరకు పెట్టుబడులు పెట్టనున్నది. జాయింట్ వెంచర్ల ఏర్పాటు కోసం డీఎల్ఎఫ్ వంటి కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది. భారత్‌లో కనీసం 10 టౌన్‌షిప్‌ల అభివృద్ధి కోసం ఇన్వెస్ట్మెంట్స్ చేయనున్నామని వాండా గ్రూప్ చైర్మన్ వాంగ్ జైన్‌లిన్ పేర్కొన్నారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన ఆయన బుధవారం భారత రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ ఉన్నతాధికారులతో ఆయన సంప్రదింపులు జరిపారు.