indian ship
-
హార్మూజ్‌ను దాటేసిన... రెండు భారత నౌకలు
న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల నుంచి ఎల్పీజీ నిల్వలతో వస్తున్న మరో రెండు భారత నౌకలు హార్మూజ్ జలసంధిని దాటాయి. భారీస్థాయిలో ఎల్పీజీ నిల్వలతో భారత్ వైపు బయల్దేరాయి. ‘‘శివాలిక్, నందాదేవి అనే రెండు నౌకలు శనివారం ఉదయం హార్మూజ్‌ను దాటుకుని వచ్చాయి. గుజరాత్‌లోని ముంద్రా, కాండ్లా రేవులకేసి బయల్దేరాయి’’అని నౌకాయాన శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్‌కుమార్ సిన్హా మీడియాకు తెలిపారు. వాటిలో 92,700 టన్నుల ఎల్పీజీ ఉన్నట్టు వెల్లడించారు. శివాలిక్ సోమవారం ముంద్రాకు, ఆ మర్నాడు నందాదేవి కాండ్లాకు చేరే అవకాశముందన్నారు. హార్మూజ్‌కు పశి్చమాన మరో 22, తూర్పున 4 భారత నౌకలు ఇంకా వెయిటింగ్‌లోనే ఉన్నట్టు ఆయన వివరించారు.వాటిని కూడా సురక్షితంగా దాటించేలా ఇరాన్ వర్గాలతో కేంద్రం ముమ్మరంగా సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. పశి్చమాన నిలిచిన 22 నౌకల్లో ఆరింట్లో ఎల్పీజీ, ఒకదాంట్లో ఎల్ఎన్జీ, నాలుగింట్లో చమురు నిల్వలున్నట్టు వివరించారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఎలీ్పజీకి తీవ్ర కొరత నెలకొన్న నేపథ్యంలో రెండు నౌకల్లో భారీగా నిల్వల రాక ఉపశమనం కల్పించనుంది. టాంజానియాకు గ్యాసోలిన్ నిల్వలు తీసుకెళ్తున్న జగ్ప్రకాశ్ అనే భారత చమురు నౌక శుక్రవారమే హార్మూజ్‌ను దాటడం తెలిసిందే. మన దేశీయ ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దాకా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. వాటిలో 90 శాతం దిగుమతులు గల్ఫ్ దేశాల నుంచే జరుగుతున్నాయి. మార్చి 1 నుంచి హార్మూజ్ మూతపడటంతో గల్ఫ్ నుంచి చమురు, ఎల్పీజీ సరఫరా నిలిచిపోయాయి. మళ్లీ రష్యా నుంచే కొనాలని అడుక్కుంటోంది ఇరాన్ ఎద్దేవాదుబాయ్: రష్యా నుంచి ముడిచమురు కొనొద్దని భారత్‌ను నెలల తరబడి బెదిరించిన అమెరికా ఇప్పుడు గతిలేక భారత్‌ను బతిమిలాడుతోందని ఇరాన్ ఎద్దేవా చేసింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శనివారం తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘యుద్ధం మొదలుకాకమునుపేమో రష్యా నుంచి చమురు అస్సలు కొనకూడదని భారత్‌ను అమెరికా బాగా బెదిరించింది. తీరా యుద్ధం మొదలయ్యాక మార్చి ఐదో తేదీన అమెరికా మాటమార్చింది. యుద్ధం దెబ్బకు హార్మూజ్ మూతబడటంతో రష్యాకాకుండా ఇతర దేశాల నుంచి చమురు కొనాలంటే సాధ్యపడట్లేదు. అందుకే మరో 30 రోజుల సడలింపు ఇస్తున్నాం.. రష్యా నుంచి కొనుక్కోండి అని అమెరికా భారత్‌కు అడగకపోయినా గడువు పెంచుతూపోతోంది’’అని అబ్బాస్ వెటకారంగా మాట్లాడారు. -
భారత్ కు వస్తున్న నౌకను పేల్చేసిన ఇరాన్..!
-
సముద్రంలో బిక్కుబిక్కు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా భారత నౌకలు పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌తోపాటు పరిసర సముద్ర జలాల్లో చిక్కుకుపోయాయి. భారతదేశ జెండాలతో కూడిన మొత్తం 37 నౌకలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఆయా నౌకల్లో 1,109 మంది సిబ్బంది ఉన్నారు. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడుల నేపథ్యంలో చమురు రవాణాకు కీలకమైన హొర్మూజ్ జలసంధిని మూసివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వీటిలో కొన్ని నౌకల్లో ముడి చమురు, సహజ వాయువు ఉన్నాయి. అవి భారత ఓడరేవులకు చేరుకోవాల్సి ఉంది.మరికొన్ని నౌకలు పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేయడానికి గల్ఫ్ దేశాలకు ప్రయణిస్తుండగా మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది. భారత ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్’గల్ఫ్ దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. నౌకల్లో చిక్కుకుపోయిన భారతీయ సిబ్బందికి సహాయం అందించడానికి కేంద్ర షిప్పింగ్ శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా, ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మరణం తర్వాత గల్ఫ్ సముద్ర తీరంలో విదేశీ జెండాలు ఉన్న నౌకలపై పలు దాడులు జరిగాయి.ఈ దాడుల్లో కనీసం ముగ్గురు భారతీయులు మరణించారు. ఈ పరిణామాలు భారత షిప్పింగ్ కంపెనీలకు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత షిప్పింగ్ మంత్రి శర్బానంద సోనోవాల్ మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. తాజా పరిస్థితిని సమీక్షించారు. భారత నౌకలకు, సిబ్బందిని తగిన రక్షణ కల్పించడానికి భారత నావికాదళం, విదేశాంగ శాఖ, మారిటైమ్ రెస్క్యూ కో–ఆర్డినేషన్ సెంటర్(ఎంఆర్సీసీ) సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. -
ఇండియన్ షిప్ హైజాక్
న్యూఢిల్లీ: ఇండియన్ కార్గో షిప్ హైజాక్‌కు గురవడం కలకలం రేపుతోంది. 11 మంది సిబ్బందితో షిప్ దుబాయ్ నుంచి యెమెన్ వెళ్తుండగా.. సోమాలియా సముద్రపు దొంగలు దాడి చేసి హైజాక్ చేశారు. ఏప్రిల్ 1న షిప్ హైజాక్‌కు గురైనట్లు అధికారులు నిర్థారించారు. సముద్రపు దొంగల చేతిలో బంధీలుగా ఉన్న 11 మంది కూడా ముంబైలోని మాండ్వీ ప్రాంతానికి చెందిన వారని సమాచారం. హైజాక్ విషయాన్ని షిప్ కెప్టెన్ దుబాయ్‌లోని అధికారులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ హైజాక్ ఘటనను ధృవీకరించింది. షిప్‌లోని సిబ్బందిని రక్షించడానికి చర్యలు చేపడుతున్నట్లు భారత నేవీ అధికారులు వెల్లడించారు.


