‘పంచె’ను అడ్డుకుంటే ఏడాది జైలు
బిల్లును ప్రవేశపెట్టిన జయ సర్కారు
చెన్నై: తమిళనాట సంప్రదాయ బద్ధమైన పంచెకట్టుపై, ఇతర భారతీయ సంప్రదాయ వస్త్రధారణపై రిక్రియేషనల్ క్లబ్లు, ఇతర సంస్థల నిషేధాన్ని తొలగిస్తూ రూపొందించిన బిల్లును జయలలిత ప్రభుత్వం తమిళనాడు అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టింది. సభలో బిల్లును ప్రవేశపెడుతూ, తమిళుల సంప్రదాయ వస్త్రధారణ అయిన పంచెకట్టుకు ఎవరు అభ్యంతరం తెలిపినా, ఆక్షేపించినా ఏడాదిపాటు జైలు శిక్ష, రూ.25 వేలు జరిమానా విధింపు తప్పదని జయలలిత అన్నారు.
చెన్నైలోని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ క్లబ్లో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు పంచెకట్టులో హాజరైనపుడు, పంచెకట్టుపై నిషేధం ఉందంటూ వారిని నిర్వాహకులు వెనక్కు పంపివేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది.