Indicted
-
కేసుల వలయంలో డోనాల్డ్ ట్రంప్.. ఇప్పట్లో బయటపడేనా..
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొత్తంగా 78 కేసుల్లో ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఆయనకు ఈ అభియోగాలు అన్నిటిలోనూ శిక్ష పడి, ఏకకాలంలో శిక్ష అనుభవించినా జీవితకాలం పాటు కారాగారంలోనే గడపాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇదిలా ఉండగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు అనేక తప్పిదాలకు పాల్పడ్డారంటూ ఆయనపై ఒక్కొక్కటిగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 76కు చేరుకుంది. ఒకవేళ అభియోగాలన్నీ నిరూపణ అయ్యి ఆయన దోషిగా తేలితే మాత్రం ఆయా నేరాల శిక్షా సమయాన్ని బట్టి ట్రంప్ జీవితకాలం ఖైదును అనుభవించాల్సిందే. శృంగార తారకు చెల్లింపుల వ్యవహారంతో మొదలైన కేసుల పరంపర వైట్ హౌస్ రహస్య పత్రాల కేసుతో ఆయన మెడకు ఉచ్చు మరింత బిగిసింది. తాజాగా 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో మరో కేసు నమోదై ఆయనకు ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయాన్ని ధృవీకరించకుండా ట్రంప్ తమపై ఒత్తిడి తీసుకొచ్చారని కొందరు వైట్ హౌస్ అధికారులు వాంగ్మూలం ఇవ్వడంతో ట్రంప్ ఇరుకున పడ్డారు. అసలే వచ్చే ఏడాది అమెరికా అధ్యక్షుడి ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్షుడి అభ్యర్థి రేసులో కూడా డోనాల్డ్ ట్రంప్ ముందున్నారు. సమయం కూడా చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ట్రంప్ ఈ కేసుల ఊబి నుండి బయట బయట పడతారా? బయటపడినా వైట్ హౌస్ చేరుకుంటారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఇది కూడా చదవండి: సముద్రంలో ఒళ్ళు గగుర్పొడిచే సాహసం.. తలచుకుంటేనే.. -
నేను అమాయకుడిని.. డోనాల్డ్ ట్రంప్
జార్జియా, నార్త్ కరోలినాలో రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులతో నిర్వహించిన సమావేశంలో డోనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఆయనపై నేరాభియోగాలు మోపిన తర్వాత పబ్లిక్ మీటింగుకి రావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ శనివారం తన మద్దతుదారులకు ధైర్యం చెబుతూ త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఓటమి భయంతోనే బైడెన్ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, నాకే పాపం తెలియదని అన్నారు. 20 ఏళ్ళు జైలులోనే... అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన పదవీకాలం ముగిసిన తర్వాత వైట్ హౌస్ నుండి వెళ్తూ వెళ్తూ పెంటగాన్, జాతీయ ఇంటెలిజెన్స్, దేశ భద్రతకు సంబంధించిన అనేక రహస్య పత్రాలను తనతో పాటు తీసుకువెళ్లారని ఫెడరల్ న్యాయస్థానంలో అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఇందులో 37 అభియోగాలపై చార్జిషీట్లు కూడా దాఖలయ్యాయి. నేరం రుజువైతే డోనాల్డ్ ట్రంప్ కనీసం 20 ఏళ్లపాటు జైలులోనే గడపాల్సి ఉంటుందని అంటున్నారు ఫెడరల్ న్యాయాధికారులు. ఎన్నికల భయంతోనే.. జార్జియా, నార్త్ కరోలినాలో జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశాల్లో మాట్లాడిన ట్రంప్ తానే నేరం చేయలేదని అన్నారు. జార్జియాలో జరిగిన సమావేశంలో తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని నేనే తప్పు చేయలేదని చెప్పిన ట్రంప్ నార్త్ కరోలినాలో మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తానే ముందున్న నేపథ్యంలో అధికారం చేజారిపోతుందేమోనన్న భయంతో బైడెన్ ప్రభుత్వం ఈ తరహా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. నాపై ఉన్నవన్నీ హాస్యాస్పదమైన, నిరాధారమైన ఆరోపణలే. బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అమెరికా చరిత్రలోనే అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా మిగిలిపోతాయని అన్నారు. ఇది కూడా చదవండి: కెనడాలోని భారత విద్యార్ధులకు గుడ్ న్యూస్ -
శాంసంగ్‌కు మరిన్ని కష్టాలు
సియోల్: దక్షిణ కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ మరిన్ని కష్టాల్లో ఇరుక్కోనుంది. సౌత్ కొరియాలో సంచలనం రేపిన కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శాంసంగ్ గ్రూప్ డి ఫ్యాక్టో హెడ్ జె వై లీ (48) పై అవినీతి సహా బహుళ ఆరోపణలపై ప్రత్యేక ప్రాసిక్యూటర్లు కేసును దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈయనతోపాటు మరో నలుగురు ఎగ్జిక్యూటివ్‌లపై ఆరోపణలను నమోదు చేయనుంది. అరెస్టు వారెంట్‌నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించిన శాంసంగ్ వారసుడు చివరికి అరెస్టుకాక తప్పలేదు. తాజాగా కేసుల నమోదు ఖరారు కావడంతో శాంసంగ్ కు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు లీకు వ్యతిరేకంగా నిధుల దుర్వినియోగం, లంచం, అప్రకటిత విదేశీ ఆస్తులు తదితర ఆరోపణలను నమోదు చేయనున్నట్టు దక్షిణ కొరియన్ ప్రత్యేక ప్రాసిక్యూటర్ ప్రతినిధి లీ క్యు-చుల్ మంగళవారం విలేకరులకు చెప్పారు. ఈ విలక్షణ విచారణ , తీర్పు కు 18 నెలల వరకు పడుతుందనీ, అయినప్పటికీ, ప్రత్యేక-ప్రాసిక్యూటర్ చట్టం చాలా త్వరగా కేసు పరిష్కరించేందుకు సిఫార్సు చేసినట్టు చెప్పారు. మరోవైపు ఈ నేరారోపణలపై లీ బెయిల్ కోరే అవకాశం ఉంది. అలాగే మూడు నెలలోపు కోర్టు కోర్టు తన మొదటి తీర్పును జారీ చేయాల్సి ఉంది. కాగా తాము ఎలాంటి తప్పులు చేయలేదని, లంచాలు ఇవ్వలేదని శాంసంగ్ సంస్థతో పాటు జే లీ కూడా వాదిస్తున్నారు. కోర్టు విచారణలో వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తామని , తాము ఎలాంటి తప్పు చేయలేదంటూఈ ఆరోపణలను లీ తిరస్కరించారు. -
జస్టిన్ బీబర్‌కు షాక్
బ్యూనస్ ఎయిర్స్: గ్రామీ అవార్డ్ విన్నింగ్ సింగర్ జస్టిన్ బీబర్‌కు అర్జెంటీనాలోని ఓ కోర్టు షాక్ ఇచ్చింది. 2013లో బీబర్ అంగరక్షకులు ఓ ఫోటో గ్రాఫర్‌పై దాడి చేసిన కేసులో.. బీబర్ విచారణను ఎదుర్కోవాలని న్యాయమూర్తి ఆల్బర్టో బానోస్ పేర్కొన్నారు. బీబర్ అంగరక్షకులు ఫోటో గ్రాఫర్‌పై దాడి చేసి.. అతడి వద్ద నుంచి డబ్బు, ఇతర వస్తువులను దొంగిలించారని, ఈ దాడిలో బీబర్ ప్రమేయం సైతం ఉందని ఆరోపణలు ఉన్నాయి. కేసు విచారణ తీరుపై బీబర్ అసంతృప్తిగా ఉన్నాడని మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఏదేమైనా ఈ కేసు చిక్కులు తొలగేంతవరకు బీబర్ అర్జెంటీనాలో అడుగుపెట్టే అవకాశం లేదని తెలుస్తోంది. బీబర్ తరఫు లాయర్లు దీనిపై కోర్టులో అప్పీల్ చేయనున్నారని తెలుస్తోంది.