జార్జియా, నార్త్ కరోలినాలో రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులతో నిర్వహించిన సమావేశంలో డోనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఆయనపై నేరాభియోగాలు మోపిన తర్వాత పబ్లిక్ మీటింగుకి రావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ శనివారం తన మద్దతుదారులకు ధైర్యం చెబుతూ త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఓటమి భయంతోనే బైడెన్ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, నాకే పాపం తెలియదని అన్నారు.
20 ఏళ్ళు జైలులోనే...
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన పదవీకాలం ముగిసిన తర్వాత వైట్ హౌస్ నుండి వెళ్తూ వెళ్తూ పెంటగాన్, జాతీయ ఇంటెలిజెన్స్, దేశ భద్రతకు సంబంధించిన అనేక రహస్య పత్రాలను తనతో పాటు తీసుకువెళ్లారని ఫెడరల్ న్యాయస్థానంలో అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఇందులో 37 అభియోగాలపై చార్జిషీట్లు కూడా దాఖలయ్యాయి. నేరం రుజువైతే డోనాల్డ్ ట్రంప్ కనీసం 20 ఏళ్లపాటు జైలులోనే గడపాల్సి ఉంటుందని అంటున్నారు ఫెడరల్ న్యాయాధికారులు.
ఎన్నికల భయంతోనే..
జార్జియా, నార్త్ కరోలినాలో జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశాల్లో మాట్లాడిన ట్రంప్ తానే నేరం చేయలేదని అన్నారు. జార్జియాలో జరిగిన సమావేశంలో తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని నేనే తప్పు చేయలేదని చెప్పిన ట్రంప్ నార్త్ కరోలినాలో మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తానే ముందున్న నేపథ్యంలో అధికారం చేజారిపోతుందేమోనన్న భయంతో బైడెన్ ప్రభుత్వం ఈ తరహా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. నాపై ఉన్నవన్నీ హాస్యాస్పదమైన, నిరాధారమైన ఆరోపణలే. బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అమెరికా చరిత్రలోనే అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా మిగిలిపోతాయని అన్నారు.
ఇది కూడా చదవండి: కెనడాలోని భారత విద్యార్ధులకు గుడ్ న్యూస్
Comments
Please login to add a commentAdd a comment