indira amma houses
-
చెల్లని కార్డులు 1,27,936
చిగురుమామిడికి చెందిన నారాయణపురం హన్మంతు అనే నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. హౌసింగ్ ఏఈ రవీందర్‌రెడ్డి రేషన్‌కార్డు చూపించాలని కోరారు. హన్మంతు ప్రభుత్వం తనకు ఇచ్చిన రేషన్‌కార్డు (నంబర్ ట్యాప్ 205320608864)ను అందించాడు. ఏఈ ఆన్లైన్లో పరిశీలిస్తే సదరు కార్డు నంబరు కనిపించలేదు. దీంతో హన్మంతుకు మంజూరైన ఇల్లు రద్దవుతుందని చెప్పారు. గత్యంతరం లేక హన్మంతు డెప్యూటీ తహశీల్దార్ విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో తామేమీ చేయలేమని డీటీ బదులిచ్చారు. ఇలాంటి కార్డుల గురించి పై అధికారులకు నివేదించామని, తిరిగి ఉత్తర్వులు వచ్చేంత వరకు వేచిచూడాలని సూచించారు. ఇది ఒక్క హన్మంతు పరిస్థితే కాదు.. జిల్లావ్యాప్తంగా 1,27,936 కుటుంబాలదీ ఇదే వ్యథ. - న్యూస్‌లైన్, చిగురుమామిడి చిగురుమామిడి, న్యూస్‌లైన్ : జిల్లాలో గత నవంబర్‌లో జరిగిన మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో 1,27,936 మందికి కొత్తగా రేషన్‌కార్డులు జారీ చేసినట్లు ప్రజాప్రతినిధులు, అధికారులు గొప్పగా ప్రచా రం చేసుకున్నారు. కానీ కార్డుల స్థానంలో తాత్కాలిక కూపన్లు జారీ చేయడంతో అవి ఎందుకూ కొరగావడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కూపన్లపై కొన్ని చోట్ల రేషన్ సరుకులు ఇస్తుండగా, మరికొన్ని చోట్ల వాటికీ దిక్కులేదని ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా, ఇటీవల కాలంలో ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డులతో లంకె పెట్టిన విషయం తెలిసిందే. సామాజిక పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, నివేశన స్థలాలు, సబ్సిడీగ్యాస్, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి ప్రభుత్వ పథకాలు కొత్త రేషన్‌కార్డులు పొందిన లబ్ధిదారులకు వర్తిం చడం లేదు. రేషన్‌కార్డులను తాత్కాలింకగా పనికి వచ్చేలా జారీచేయడంతో కార్డులు పొందిన కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. ఈ కార్డులు కేవలం రేషన్ సరుకుల కోసం తప్ప మరే అవసరానికీ ఉపయోగపడడం లేదని వాపోతున్నారు. కార్డులపై ఉన్న నంబర్లు ఆన్లైన్లో కనిపించడంలేదని తిరస్కరిస్తున్నారు. దీంతో ఆయా కుటుంబాలకు సంక్షేమ పథకాల్లో చుక్కెదురవుతోంది. జిల్లావ్యాప్తంగా మొదటి, రెండో విడత రచ్చబండ కార్యక్రమాలతోపాటు జిల్లా, మండల స్థాయి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ రేషన్‌కార్డులు మంజూరు చేశామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పుకున్నారు. ఇలాంటి కార్డులు జిల్లాలో 1,27,936 మంజూరు చేయగా, చిగురుమామిడి మండలంలో 1,074 కుటుంబాలకు అందించారు. తాత్కాలికంగా ఆయా కుటుంబాలకు అందించిన కార్డులు సంక్షేమ పథకాలకు వర్తించేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
‘గృహ నిర్మాణం పేదలకు భారం కాకూడదు’
పుట్టపర్తి అర్బన్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేదలకు భారం కాకూడదని హౌసింగ్ పీడీ ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక హౌసింగ్ కార్యాలయం ప్రారంభోత్సవానికి మంగళవారం ఆయన విచ్చేశారు. అనంతరం హౌసింగ్ ఈఈ చంద్రమౌళిరెడ్డితో కలసి స్థానిక ఎమ్మార్సీ భవనం సమీపంలో ఏర్పాటు చేసిన తాపీ మేస్త్రీలు శిక్షణా కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతులకు అనుకూలంగా తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం చేపట్టేది తాపీ మేస్త్రీలే కావడంతో వారికి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. అవగాహన సదస్సులు మండల కేందాల్లోనే గాక గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు ఎస్సీలకు లక్ష రూపాయలు, ఎస్టీలకు 1.05 లక్షలు, బీసీలకు రూ.70 వేలు మంజూరు చేస్తుందన్నారు. సమావేశం అనంతరం తక్కువ ఖర్చుతో ఇళ్లు, మరుగుదొడ్డి ఎలా నిర్మించుకోవాలా అనే వాటి సమస్యలను పరిష్కరించేందుకు మేస్త్రీలకు పుస్తకాలు పంపిణీ చేశారు. 1.16 లక్షలు హౌసింగ్ దరఖాస్తులు పెండింగ్‌లో.. : జిల్లాలో ప్రస్తుతం 1.16 లక్షల హౌసింగ్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు హౌసింగ్ పీడీ ప్రసాద్ తెలిపారు. పుట్టపర్తికి మంగళవారం విచ్చేసిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొదటి, రెండో రచ్చబండల్లో వచ్చిన దరఖాస్తుల్లో పరిశీలించిన అనంతరం మూడో విడత రచ్చబండలో 42,820 ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఇంకా సుమారు 1.16 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పరిశీలన అనంతరం ఇళ్ల మంజూరు చేస్తామన్నారు. జిల్లాలో 914 ఇందిరమ్మ కాలనీలు ఉన్నాయన్నారు. వీటికి మౌలిక వసతులు కల్పన కోసం రూ.54 కోట్లు మంజూరు కాగా రూ.42 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. విడపనకల్, రామగిరి మండలాల్లో జరిగిన అవినీతిపై విచారణ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో 53 ఎస్సీ, ఎస్టీ కాలనీలకు సీసీ రోడ్లు, డ్రెయినేజీలు ఏర్పాటు చేయడానికి రూ.23 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. 50 శాతం జనాభా ఉన్న కాలనీలు మాత్రం ఇందులో ఉంటాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో వర్క్ ఇన్స్పెక్టర్కు 75 ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేయించడం, మరో 75 ఇళ్లు పలు దశల్లో బిల్లులు పంపిణీ చేయించడం లక్ష్యంగా నిర్ణయించామన్నారు. జిల్లాలో 62 ఏఈ కార్యాలయాలు నిర్మస్తుండగా 50 పూర్తైట్లు చెప్పారు. -
మొండి గోడలే!
అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ‘ఇందిరమ్మ’ ఇళ్ల నిర్మాణం పడకేసింది. కొన్ని చోట్ల అధికారులు బిల్లుల పంపిణీలో చేతివాటం ప్రదర్శించారు. సిమెంటు, బిల్లుల పంపిణీ ఆలస్యం అవుతుండడంతో లబ్ధిదారులు నిర్మాణాలను పూర్తి చేసుకోలేకపోతున్నారు. ఇందిరమ్మ మొదటి, రెండు, మూడు విడతలతో పాటు రచ్చబండ-1, రచ్చబండ-2 కింద 4,47,205 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 3,00,210 ఇళ్లు పూర్తయ్యాయి. 62,745 ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. 31,276 ఇళ్లు గోడల స్థాయిలో, 4,720 ఇళ్లు గోడల కన్నా తక్కువ స్థాయిలో, 31,926 ఇళ్లు పునాది స్థాయిలో, 16,278 ఇళ్లు పునాది కన్నా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఈ ఏడాది 29,549 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించగా.. ఇప్పటిదాకా 4,955 మాత్రమే పూర్తి చేశారు. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుని బిల్లుల కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. చివరికి లబ్ధిదారుడు ఎంతో కొంత మామూళ్లు ముట్టచెపితే బిల్లు మంజూరుకు ఎంబుక్ రికార్డు చేసి పంపుతున్నారు. అలా ఇచ్చుకోలేని వారు సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఇక ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు వచ్చే అదనపు మొత్తంలో అధికారులు అందినంత గుంజుతున్నారు. -
సిమెంట్ కొరత
మిర్యాలగూడ, న్యూస్‌లైన్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సిమెంట్ కొరత ఏర్పడింది. నెలరోజులుగా లబ్ధిదారులకు సిమెంట్ ఇవ్వకపోవడంతో ఇంటి నిర్మాణాలు నిలిచిపోయాయి. అధికారులు పాత ధరల ప్రకారం లబ్ధిదారులకు ఒక సిమెంట్ బస్తాకు రూ.184 చెల్లిస్తున్నారు. కానీ బహిరంగ మార్కెట్లో బస్తా సిమెంట్ రూ.280 పలుకుతున్నది. దీంతో ఒక బస్తాకే రూ.96 భారం లబ్ధిదారుడిపై పడుతున్నది. దీనివల్ల సిమెంట్ కొనుగోలుకు నిరాసక్తత చూపడంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఆగి పోయాయి. ఒక్కో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడికి 60బస్తాల సిమెంట్ ఇవ్వాల్సి ఉంది. కేవలం సిమెంట్ కొనుగోలు చేయడానికే అదనంగా రూ.ఆరు వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోవడం లేవని లబ్ధిదారులు ఆందోళన చెందుతుండగా.. ప్రభుత్వం సిమెంట్ ఇవ్వకుండా డబ్బులు ఇవ్వడంతో లబ్ధిదారులపై మరింత భారం పడుతున్నది. జిల్లాలోని 15 సబ్ డివిజన్ల పరిధిలోని 15స్టాక్ పాయింట్ల ద్వారా సిమెంట్ సరఫరా చేయాల్సి ఉన్నా, నెల రోజులుగా అవి మూతపడి ఉన్నాయి. మూడు విడతల్లో... జిల్లావ్యాప్తంగా మూడు విడతలుగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 2,83,511మందిని ఎంపిక చేశారు. వాటిలో ఇప్పటి వరకు కేవలం 1,42,781మంది లబ్ధిదారులే ఇళ్లు నిర్మించుకోగా 64,883మంది నిర్మాణాలే ప్రారంభించలేదు. మొదటి విడతలో 89,622మందిని అర్హులుగా గుర్తించగా, వారిలో ఇప్పటివరకు 6752 మంది నిర్మాణాలు ప్రారంభించలేదు. రెండో విడతలో 1,12,699ఇళ్లు మంజూరుకాగా 29,592 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. మూడో విడతలో 81,190మందిని ఎంపిక చేయగా ఇప్పటివరకు 28,539మంది ఇళ్ల నిర్మాణం ప్రారంభించలేదు. భారమైన నిర్మాణ ఖర్చులు ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకోవడానికి జీఓ 44 ప్రకారం పట్టణ ప్రాంతాలలో ఒక లబ్ధిదారుడికి 80 వేల రూపాయలు, ఎస్సీలకు అదనంగా రూ. 25వేలు, ఎస్సీలకు అదనంగా 20వేల రూపాయలు చెల్లిస్తున్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో లబ్ధిదారుడికి రూ.70 వేలు చెల్లిస్తుండగా, ఎస్టీలకు అదనంగా రూ.25 వేలు, ఎస్సీలకు అదనంగా 20 వేల రూపాయలు చెల్లిస్తున్నారు. కాగా ప్రస్తుతం మార్కెట్లో ఒక్క బస్తా సిమెంట్ రూ.280, ఇనుముకు క్వింటా రూ.4100 కాగా ఒక రాయికి రూ.8 నుంచి 10 రూపాయలు, ఇసుక ట్రాక్టర్‌కు రూ.1500 ఉన్నాయి. అదేవిధంగా ఇళ్లు నిర్మించే కూలీ రేట్లు విపరీతంగా పెరిగాయి. దీంతో ఇంది రమ్మ ఇళ్లు పూర్తయ్యే వరకు సుమారు 1.70 లక్షల రూపాయల ఖర్చు వస్తుంది. దీంతో ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోకపోవడంతో ఇంటి నిర్మాణం భారంగా మారింది.