మంత్రి గంటా ఇంటి ముట్టడించిన కాలనీ వాసులు
విశాఖపట్నం: ఇందిరానగర్‌లోని తమ గృహాలను తొలగించవద్దని విశాఖపట్నం నగరంలోని ఆ కాలనీ వాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందులోభాగంగా మంగళవారం విశాఖపట్నంలోని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసాన్ని ఇందిరానగర్ కాలనీ వాసులు ముట్టడించారు. మంత్రికి వ్యతిరేకంగా కాలనీ వాసులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
తాము ఎంతో కాలంగా ఇందిరానగర్ కాలనీలో నివసిస్తున్నామని చెప్పారు. నగరం సుందరీకరణ పేరుతో తమను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించడం ఎంత వరకు సబబని వారు ప్రశిస్తున్నారు. అయితే ఇళ్లు కోల్పోయినవారికి కొత్త ఇళ్లు కేటాయిస్తామని జీవీఎంసీ ఉన్నతాధికారులు వెల్లడించారు.
(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)