మిఠాయిలు పంచుకున్న భారత్, పాక్ సైన్యం
న్యూఢిల్లీ: భారత్, పాక్ సరిహద్దుల్లో దీపావళి పండుగ వాతావరణం కనిపించింది. గత కొంతకాలంగా కాల్పుల మోతతో దద్దరిల్లిన సరిహద్దు ప్రాంతాలు దీపావళితో పండుగశోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా సరిహద్దుల్లో భారత్, పాక్ సైన్యాలు మిఠాయిలు పంచుకున్నారు.
పంజాబ్ అమృతసర్‌లోని అట్టారి సరిహద్దు వద్ద భారత్ కమాండెంట్ బిపుల్ బిర్ గుసేన్, పాక్ కమాండర్ బిలాల్ అహ్మద్ ఆధ్వర్యంలో ఇరుదేశాల సిబ్బంది మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం సైనిక సిబ్బంది ఆలింగనం చేసుకుని స్నేహబంధాన్ని చాటుకున్నారు.