Indo-US
-
భారత్ మాకు బలమైన భాగస్వామి
న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, అమెరికా తీర్మానించుకున్నాయి. ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా రక్షణ సంబంధాలను విస్తృతం చేసుకోవాల్సిన అవసరం ఉందని, పరస్పర సహకారంతోనే ఇది సాధ్యమని నిర్ణయానికొచ్చాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భారత్ తమకు బలమైన భాగస్వామి అని అమెరికా ఉద్ఘాటించింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్ శనివారం పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఇండో–యూఎస్ రక్షణ భాగస్వామ్యానికి జో బైడెన్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని లాయిడ్ అస్టిన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అంతర్జాతీయంగా పరిణామాలు వేగంగా మారిపోతున్న నేపథ్యంలో భారత్ తమకు ముఖ్యమైన భాగస్వామిగా మారుతోందని తెలిపారు. ఇండో–పసిఫిక్ రీజియన్‌లో అమెరికాకు ఇండియా ఒక మూలస్తంభం అని వ్యాఖ్యానించారు. ఇండియాతో సమగ్రమైన రక్షణ భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని వివరించారు. తద్వారా జో బైడెన్ ప్రభుత్వ విదేశాంగ విధానంలోని ప్రాధాన్యతలపై అస్టిన్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. చైనా ఆగడాలపై చర్చ అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ అస్టిన్‌తో చర్చలు సమగ్రంగా, ఫలవంతంగా జరిగాయని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. భారత సైన్యం, అమెరికాకు చెందిన ఇండో–పసిఫిక్ కమాండ్, సెంట్రల్ కమాండ్, ఆఫ్రికా కమాండ్ మధ్య సహకారం పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇండియా–అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కలిసి పని చేసేందుకు ఇరు దేశాలు ఆసక్తిగా ఉన్నాయన్నారు. తూర్పు లద్దాఖ్‌లో చైనా సాగిస్తున్న ఆగడాలు కూడా తమ మధ్య చర్చకు వచ్చాయన్నారు. రక్షణ సహకారంపై ఇండియా–అమెరికా మధ్య గతంలో కొన్ని ఒప్పందాలు కుదిరాయని, వాటిని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైనా చర్చించామని పేర్కొన్నారు. భారత్–అమెరికా భాగస్వామ్యం 21వ శతాబ్దంలో నిర్ణయాత్మక భాగస్వామ్యాల్లో ఒకటిగా నిలిచిపోవాలని రాజ్‌నాథ్‌సింగ్ ఆకాంక్షించారు. త్రివిధ దళాల అవసరాల కోసం అమెరికా నుంచి 3 బిలియన్ డాలర్ల విలువైన 30 మల్టీ–మిషన్ ఆర్మ్డ్ ప్రిడేటర్ డ్రోన్లు కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై రాజ్‌నాథ్ సింగ్, లాయిడ్ అస్టిన్ చర్చించినట్లు సమాచారం. మీడియం–ఆల్టిట్యూడ్ లాండ్ ఎండ్యురెన్స్ (ఎంఏఎల్‌ఈ) ప్రిడేటర్–బి డ్రోన్లుగా పిలిచే ఈ డ్రోన్లు ఏకంగా 35 గంటలపాటు గాలిలో సంచరించగలవు. భూమిపై, సముద్రంపై ఉన్న లక్ష్యాలను వేటాడే సామర్థ్యం వీటి సొంతం. రాజ్‌నాథ్‌తో చర్చల అనంతరం లాయిడ్ అస్టిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. -
దిగ్గజ స్టార్టప్‌కు ప్రేమ్‌జీ ఊతం
బెంగళూరు: ఐటీ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్‌జీ తోడ్పాటుతో ఒక స్టార్టప్ సంస్థ బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ స్థాయికి చేరింది. క్లౌడ్ ఆధారిత కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ సేవలు అందించే ఐసెర్టిస్ సంస్థలో అజీం ప్రేమ్‌జీ కుటుంబానికి చెందిన ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ ఫండ్, గ్రేక్రాఫ్ట్ పార్ట్నర్స్ తదితర సంస్థలు 115 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. వీటిలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన బి క్యాపిటల్ గ్రూప్, ఎయిట్ రోడ్స్ మొదలైనవి కూడా ఉన్నాయి. తాజా పెట్టుబడులతో ఐసెర్టిస్ సంస్థ మొత్తం 211 మిలియన్ డాలర్లు సమీకరించినట్లయింది. ఈ విడత నిధుల సమీకరణతో సంస్థ విలువ 1 బిలియన్ డాలర్ల స్థాయికి చేరినట్లవుతుందని ఐసెర్టిస్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ బోదాస్ తెలిపారు. నెలకొల్పింది మనోళ్లే.. 2009లో సమీర్, ఆయన మిత్రుడు మనీష్ దర్దా కలిసి ఐసెర్టిస్ను ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో 850 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 600 మంది పుణే కేంద్రంలో పనిచేస్తున్నారు. సరుకుల కొనుగోళ్ల నుంచి ఉద్యోగులతో ఒప్పందాలు దాకా ప్రపంచవ్యాప్తంగా పలువురు క్లయింట్లకు 57 లక్షల పైగా కాంట్రాక్టుల నిర్వహణకు సేవలు అందిస్తున్నట్లు సమీర్ వివరించారు. వీటి మొత్తం విలువ 1 లక్ష కోట్ల డాలర్ల పైగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ తరహా కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ సేవలపై కంపెనీలు 2018–2022 మధ్య కాలంలో దాదాపు 20 బిలియన్ డాలర్ల దాకా వెచ్చించనున్నట్లు పరిశ్రమవర్గాల అంచనా. -
ఇండో యూఎస్ ఆస్పత్రిలో అరుదైన చికిత్స
-
వ్యవసాయ వర్సిటీకి విదేశీ ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: జయశంకర్ వ్యవసాయ వర్సిటీని గురువారం వివిధ దేశాల ప్రతినిధులు సందర్శిం చారు. భారత్-అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ విస్తరణ, యాజమాన్య సంస్థలో నిర్వహిస్తున్న ‘ఫీడ్ ది ఫ్యూచర్- ఇండియా ట్రయాంగులర్ ట్రైనింగ్’లో పాల్గొనేందుకు వచ్చిన అఫ్గానిస్తాన్, కంబోడియా, ఘనా, కెన్యా, లైబీరియా, మాలవి, మంగోలియా, మొజాంబిక్ దేశాలకు చెందిన 29 మంది వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన విస్తరణాధికారులు వర్సిటీకి వచ్చి పరిశోధనల తీరును పరిశీలించారు. వారికి వర్సిటీ గురించి, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడుతున్న కార్యక్రమాల గురించి వీసీ ప్రవీణ్‌రావు వివరించారు. మిల్లట్ ఇంక్యుబేషన్ కేంద్రాన్ని కూడా సందర్శించారు. -
ఇండో యుఎస్ ఆర్మీ మాక్ యుద్ద విన్యాసాలు