indonesia citizen
-
10 మంది ఇండోనేసియన్లపై కేసు నమోదు
సాక్షి, కరీంనగర్: జిల్లాలో కరోనా వ్యాప్తికి కారకులైన పది మంది ఇండోనేసియన్లతో పాటు వారికి సహకరించిన మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. మార్చి 14న కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేసియన్లు కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలకు విరుద్ధంగా వ్యవహరించి మతపరమైన సమావేశాల్లో పాల్గొన్నారని అన్నారు. వారి నిర్లక్ష్యంగా కారణంగా ఇతరులకు కూడా కరోనా సోకిందని చెప్పారు. ఈ విషయంపై కరీంనగర్ స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారని... దాంతో సదరు ఇండోనేసియన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కరీంనగర్‌కు వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం. టూరిస్ట్ వీసా మీద వచ్చి పర్యాటక కేంద్రాలను సందర్శించకుండా మసీదును సందర్శించడాన్ని పోలీసులు నేరంగా పరిగణిస్తున్నారు. సెక్షన్ 420, 269, 270, 188, యాక్ట్ 1897 సెక్షన్ 3 ప్రకారం కేసులు నమోదు చేశారు. (చదవండి: మరో ఐదుగురి రిపోర్ట్స్ రావాల్సి ఉంది : గంగుల) (చదవంండి: కరోనా: హుజూరాబాద్‌లో హై టెన్షన్) -
ఉద్యోగం కోసం కన్నబిడ్డనే చంపేసింది..
అబుదాబి: ఏమహిళకైనా తల్లి అవబోతోందని తెలిస్తే ఆమె ఆనందానికి హద్దులు ఉండవు. తనకు పుట్టబోయే బిడ్డకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంది. ప్రాణాలకు తెగించి నవమాసాలు మోస్తుంది. బిడ్డకు జన్మనిచ్చే సమయం అంటే ఆతల్లికి మరో జన్మ ఎత్తడం వంటిది. అమ్మతనంలో అంత గొప్పతనం ఉంది. కానీ ఓ మహిళ అమ్మతనానికి మచ్చ తెచ్చే పని చేసింది. అత్యంత దారుణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా 9 నెలల గర్భాన్ని మోసింది. రహస్యంగా జన్మనిచ్చిన శిశువును బాత్రూంకి తీసుకెళ్లి ఫ్లోర్‌పై కొట్టిచంపింది. అలాగని శిశువు అక్రమ సంతానం కూడా కాదు. ఎందుకంటే గర్భానికి ఆమె భర్తే కారణం. వివరాల్లోకి వెళ్తే.. ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ ఉపాధి నిమిత్తం యూఏఈలోని అబుదాబి నగరానికి వచ్చింది. ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే గర్భవతి అని తెలిసింది. అది యాజమాన్యానికి తెలిస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తారని గర్భవతిననే విషయాన్ని ఆఫీస్‌లో, కుటుంబ సభ్యులకు తెలియకుండా జాగ్రత్తపడింది. నొప్పులను కూడా భరించి, గదిలోకి వెళ్లి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆశిశువును బాత్రూంకు తీసుకెళ్లి బాత్రూం ఫ్లోర్‌పై కొట్టిచంపింది. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన ఓ ఉద్యోగి అధికారులతో పాటు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. శిశువు, తల్లిని హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే శిశువు మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. మహిళపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. నిందితురాలు చేసిన తప్పును అంగీకరించడంతో జీవితకాలజైలు శిక్ష విధించారు. నిందితురాలి వివరాలు తెలియచేయడానికి పోలీసు వర్గాలు నిరాకరించాయి.