
సాక్షి, కరీంనగర్: జిల్లాలో కరోనా వ్యాప్తికి కారకులైన పది మంది ఇండోనేసియన్లతో పాటు వారికి సహకరించిన మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. మార్చి 14న కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేసియన్లు కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలకు విరుద్ధంగా వ్యవహరించి మతపరమైన సమావేశాల్లో పాల్గొన్నారని అన్నారు. వారి నిర్లక్ష్యంగా కారణంగా ఇతరులకు కూడా కరోనా సోకిందని చెప్పారు. ఈ విషయంపై కరీంనగర్ స్పెషల్ బ్రాంచి ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారని... దాంతో సదరు ఇండోనేసియన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కరీంనగర్‌కు వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం. టూరిస్ట్ వీసా మీద వచ్చి పర్యాటక కేంద్రాలను సందర్శించకుండా మసీదును సందర్శించడాన్ని పోలీసులు నేరంగా పరిగణిస్తున్నారు. సెక్షన్ 420, 269, 270, 188, యాక్ట్ 1897 సెక్షన్ 3 ప్రకారం కేసులు నమోదు చేశారు.
(చదవండి: మరో ఐదుగురి రిపోర్ట్స్ రావాల్సి ఉంది : గంగుల)
(చదవంండి: కరోనా: హుజూరాబాద్‌లో హై టెన్షన్)
Comments
Please login to add a commentAdd a comment