ఉద్యోగం కోసం కన్నబిడ్డనే చంపేసింది.. | woman killed her child in bathroom | Sakshi
Sakshi News home page

ఉద్యోగం కోసం కన్నబిడ్డనే చంపేసింది..

Published Sun, Jul 30 2017 12:22 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

ఉద్యోగం కోసం కన్నబిడ్డనే చంపేసింది.. - Sakshi

ఉద్యోగం కోసం కన్నబిడ్డనే చంపేసింది..

అబుదాబి: ఏమహిళకైనా తల్లి అవబోతోందని తెలిస్తే ఆమె ఆనందానికి హద్దులు ఉండవు. తనకు పుట్టబోయే బిడ్డకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంది.  ప్రాణాలకు తెగించి నవమాసాలు మోస్తుంది. బిడ్డకు జన్మనిచ్చే సమయం అంటే ఆతల్లికి మరో జన్మ ఎత్తడం వంటిది. అమ్మతనంలో అంత గొప్పతనం ఉంది. కానీ ఓ మహిళ అమ్మతనానికి మచ్చ తెచ్చే పని చేసింది. అత్యంత దారుణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా 9 నెలల గర్భాన్ని మోసింది. రహస్యంగా జన్మనిచ్చిన శిశువును బాత్‌రూంకి తీసుకెళ్లి ఫ్లోర్‌పై కొట్టిచంపింది. అలాగని శిశువు అక్రమ సంతానం కూడా కాదు. ఎందుకంటే గర్భానికి ఆమె భర్తే కారణం.

వివరాల్లోకి వెళ్తే.. ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ ఉపాధి నిమిత్తం యూఏఈలోని అబుదాబి నగరానికి వచ్చింది. ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే గర్భవతి అని తెలిసింది. అది యాజమాన్యానికి తెలిస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తారని గర్భవతిననే విషయాన్ని ఆఫీస్‌లో, కుటుంబ సభ్యులకు తెలియకుండా జాగ్రత్తపడింది. నొప్పులను కూడా భరించి, గదిలోకి వెళ్లి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆశిశువును బాత్‌రూంకు తీసుకెళ్లి బాత్‌రూం ఫ్లోర్‌పై కొట్టిచంపింది. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన ఓ ఉద్యోగి అధికారులతో పాటు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.  శిశువు, తల్లిని హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే శిశువు మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. మహిళపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. నిందితురాలు చేసిన తప్పును అంగీకరించడంతో జీవితకాలజైలు శిక్ష విధించారు. నిందితురాలి వివరాలు తెలియచేయడానికి పోలీసు వర్గాలు నిరాకరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement