జర్నలిస్ట్ దారుణ హత్య
రాంచీ : జార్ఖండ్‌లో ఓ జర్నలిస్టు దారుణంగా హత్యకు గురయ్యాడు. చత్రా జిల్లాలో ఇంద్రదేవ్ యాదవ్ అనే జర్నలిస్టును గుర్తు తెలియని దుండగులు గత రాత్రి హతమార్చారు. పోలీసుల కథనం ప్రకారం బైక్‌పై వచ్చిన దుండగులు ...జర్నలిస్టుపై అయిదు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలిపారు. దీంతో అతడు ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు వెల్లడించారు. ఇంద్రదేవ్ యాదవ్ స్థానిక టీవీ చానల్లో కరస్పాండెంట్‌గా పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న అతడిపై దాడి చేసి, కాల్పులు జరిపారు.
ఈ ఘటనను జార్ఖండ్ జర్నలిస్టు అసోసియేషన్, జర్నలిస్ట్ బిచర్ మార్చ్‌తో పాటు ఇతర మీడియా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాయి. కాగా జర్నలిస్టుపై దుండగులు ఎందుకు కాల్పులకు తెగబడ్డారనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు.