indrapalem
-
ఇంద్రపాలెంలో చోరీ
5 కాసుల బంగారం, కిలో వెండి అపహరణ ఇంద్రపాలెం (కాకినాడ రూరల్) : తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి 5 కాసుల బంగారం, కిలో వెండిని ఎత్తుకుపోయిన ఘటన ఆదివారం అర్ధరాత్రి ఇంద్రపాలెంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే కాకినాడ రూరల్ ఇంద్రపాలెం డ్రైవర్స్‌కాలనీకి చెందిన వులిశెట్టి భాను కుటుంబ సభ్యులు వేసవి సెలవులు కావడంతో బంధువుల ఇళ్లకు వెళ్లారు. శనివారం ఉదయం భాను ఉంటున్న జీప్లస్ టూ పై అంతస్తులోని పోర్ష¯ŒSకి తాళం వేసుకుని శనివారం రాత్రి వ్యక్తిగత పనిపై పశ్చిమగోదావరి జిల్లా తణుకు వెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి దొంగలు ఇంటి తాళం బద్దలు కొట్టి బీరువాలో ఉన్న సుమారు ఐదు కాసుల బంగారు ఆభరణాలు, కిలో వెండి, సుమారు రూ. 5 వేల నగదును దోచుకుపోయారు. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కింద పోర్ష¯ŒSలో ఉంటున్న నివాసితులు భానుకి ఫో¯ŒS చేశారు. ఇంటి తాళం కప్ప బద్దలు కొట్టబడి ఉందని, ఇంట్లో ఉన్న వస్తువులు చిందరవందరగా ఉన్నాయని సమాచారం ఇచ్చారు. తణుకులో ఉన్న భాను హుటాహుటిన ఇంటికి చేరుకుని దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి ఎస్సై డి.రామారావుకు ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఆయన క్లూస్ టీమ్‌ని రప్పించి ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్సై వైఖరికి నిరసనగా ఆందోళన
ఇంద్రపాలెం వంతెన వద్ద రాస్తారోకో చర్య తీసుకోవాలని డీఎస్పీకి వినతి కాకినాడ రూరల్ :చిరు వ్యాపారులు, వినియోగదారులపై ఇంద్రపాలెం ఎస్సై జులుం ప్రదర్శిస్తున్నారని, ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ కొవ్వాడ, చీడిగ, ఇంద్రపాలెం గ్రామాలకు చెందిన వ్యాపారస్తులు సోమవారం ఇంద్రపాలెం వంతెన వద్ద రాస్తారోకో నిర్వహించారు. సాయంత్రం సమయంలో వ్యాపారాలు జరుగుతున్న సమయంలో ఎస్సై సిబ్బందితో వచ్చి వ్యాపారస్తులను తిడుతూ, వినియోగదారులు రోడ్డుపక్కన పెట్టే వాహనాలు తీసుకుపోయి కేసులు నమోదు చేస్తున్నారని వ్యాపారస్తులు వివరించారు. ఆదివారం ఇంద్రపాలెం నేరేళ్లమ్మ తల్లి గుడి సమీపంలో వ్యాపారస్తునిపై చేయి చేసుకోవడంతో మూడు గ్రామాలకు చెందిన చిరువ్యాపారులు ఆందోళనకు దిగారు. చీడిగ, ఇంద్రపాలెంల గుండా ర్యాలీగా వ్యాపారస్తులు వచ్చి ఇంద్రపాలెం వంతెన వద్ద రాస్తారోకో చేశారు. అనంతరం ర్యాలీగా డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్సైపై చర్యలు తీసుకోవాలంటూ ధర్నా చేశారు. అనంతరం డీఎస్పీ వెంకటేశ్వరరావును కలసి వినతిపత్రం అందించారు. ఈ ఆందోళనలో పుప్పాల బాబీ, మాజీ సర్పంచ్‌లు కొప్పిశెట్టి నాగేశ్వరరావు, గోపిశెట్టి వీర వెంకటసత్యనారాయణలతోపాటు వ్యాపారులు పాల్గొన్నారు.