ఇండస్ కాఫీ ఫ్యాక్టరీలో ప్రమాదం
నెల్లూరు : నెల్లూరు జిల్లా తడ మండలం మాంభట్టు సెజ్‌లోని ఇండస్ కాఫీ ఫ్యాక్టరీలో మంగళవారం ప్రమాదం సంభవించింది. ట్రయిల్ రన్లో భాగంగా బాయిలర్ క్లీన్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. రసాయనాలు ఒక్కసారిగా వెలువడటంతో మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం చెన్నైకి తరలించారు. కాగా మృతులు తడ మండలానికి చెందిన రవి, రవీంద్ర కుమార్, ఈశ్వర్‌గా గుర్తించారు. అస్వస్థతకు గురైన వారిలో పోలయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.