ఉప్పల్ స్టేడియంను సీజ్ చేస్తాం
ఉప్పల్ (హైదరాబాద్): ఆస్తిపన్ను చెల్లించని కారణంగా ఉప్పల్ క్రికెట్ స్టేడియంను శనివారం ఉదయం సీజ్ చేయనున్నట్లు ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా) తెలిపింది. ఈ మేరకు ఐలా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గత కొంతకాలంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) తమకు స్టేడియంకు సంబంధించిన ఆస్తి పన్ను రూ.12 కోట్లు చెల్లించకుండా తాత్సారం చేస్తోందని పేర్కొన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే, ఐలా, ఉప్పల్ జీహెచ్ఎంసీ సమక్షంలో శనివారం స్టేడియంకు తాళాలు వేయనున్నట్లు ఐలా అధికారులు తెలిపారు.