కేసీఆర్ పునరాలోచించుకోవాలి
హైదరాబాద్ : తెలంగాణలో పరిశ్రమలకు రెండు రోజుల పవర్ హాలిడేపై ప్రభుత్వ వైఖరిని బీజేపీ వ్యతిరేకించింది. పవర్ హాలీడే వల్ల రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రావని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు అన్నారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ పునరాలోచించుకోవాలని సూచించారు. విద్యుత్ కోతల వల్ల కార్మికుల పరిస్థితి రోడ్డున పడే అవకాశం ఉందన్నారు.
కాగా పరిశ్రమలకు సరఫరా చేసే విద్యుత్‌లో కోత మరింత పెంచాలని తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్ పంపి ణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) నిర్ణయించిన విషయం తెలిసిందే. పరిశ్రమలకు ఇప్పటికే వారంలో ఒక రోజు పూర్తిగా కరెంటు కోతలు విధిస్తున్నారు. ఈ నెల 9 నుం చి దీన్ని రెండు రోజులకు పెంచనున్నారు. పరి శ్రమలకు రెండు రోజులపాటు విధించే కరెంటు కోతలను అధికారికంగా పేర్కొంటూ ఎన్పీడీసీఎల్ మంగళవారం ప్రకటన జారీ చేసింది.