వీర్నపల్లికి పదోస్థానం
ముకరంపుర: సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద జాతీయస్థాయిలో వీర్నపల్లి పదో స్థానంలో నిలిచిందని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ తెలిపారు. శనివారం ఎంపీ ల్యాండ్ వినియోగంపై సమీక్షించారు. ఇటీవల గ్రామంలో పర్యటించిన కేంద్ర బృందం 50వ ర్యాంకు నుంచి 10వ ర్యాంకుకు తెచ్చిందన్నారు. మంజూరైన 439 పనుల్లో 313 పూర్తయినట్లు తెలిపారు. మిగిలినవి ప్రగతిలో ఉన్నాయని తెలుసుకున్నారు. సీసీ రోడ్లు నాణ్యతతో ఉండాలలని, కమ్యూనిటీహాల్స్ త్వరగా పూర్తి చేయాలన్నారు. సిరిసిల్ల ఆస్పత్రిలో లేబర్ రూంలో ఏసీలను రూ.5లక్షలతో మంజూరు చేసినట్లు తెలిపారు. ఏజేసీ నాగేంద్ర, డీఆర్వో వీరబ్రహ్మయ్య, సీపీవో సుబ్బారావు, ఏవో రవీందర్, తహసీల్దార్ జయచంద్ర పాల్గొన్నారు.